Varun Tej And Lavanya Tripathi Plan A Destination Wedding In Italy - Sakshi
Sakshi News home page

Varun Tej Lavanya Marriage: మెగాహీరో పెళ్లి కోసం మాస్టర్ ప్లాన్!

Published Tue, Aug 1 2023 1:53 PM | Last Updated on Tue, Aug 1 2023 2:14 PM

Varun Tej Lavanya Wedding Plan Italy Venue - Sakshi

మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ, ఎవరికీ తెలియకుండా భలే మేనేజ్ చేశాడు. ఇన్నేళ్ల తర్వాత అంటే ఈ ఏడాది జూన్‪‌లో ఈ విషయాన్ని రివీల్ చేశాడు. పెద్దల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంట పెళ్లి గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా ఓ విషయం ఆసక్తికరంగా మారింది.

ఆగస్టు చివర్లో?
మెగాఫ్యామిలీలో ఈ మధ్య అన్నీ బ్యాడ్‌న్యూస్‌లే వినిపిస్తున్నాయి. నిహారిక విడాకులు తీసుకోవడం, భర్తతో కలిసి కాకుండా శ్రీజ విడిగా ఉండటం మెగా ఫ్యాన్స్‌కి బాధ కలిగించింది. వీటి మధ్య వరుణ్ తేజ్ కాస్త హ్యాపీనెస్‌ని తీసుకొచ్చాడు. లావణ్య త్రిపాఠితో జూన్ లో నిశ్చితార్థం జరగ్గా.. ఆగస్టు చివరి వారంలో పెళ్లి ఉండబోతుందని అంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ‍్యాగ్)

అలాంటి పద్ధతిలో?
వరుణ్-లావణ్య.. 'మిస్టర్' సినిమా కోసం తొలిసారి ఇటలీలో కలిశారు. అలా ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ తర్వాత ప్రేమలో పడి, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో తాము తొలిసారి కలిసిన చోటే మ్యారేజ్ చేసుకోవాలని ఈ జంట ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలానే ఆషామాషీగా కాకుండా రాజరిక పద్ధతిలో వివాహం జరగనుందని సమాచారం.

వాళ్లకే ఆహ్వానం
ఇటలీలో జరిగే ఈ డెస్టినేషన్ వేడుక కోసం ఇప్పటికే పలువురు వెడ్డింగ్ ప్లానర్స్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిపి కేవలం 50 మంది మాత్రమే హాజరవుతారని సమాచారం. అలానే పెళ్లి జరిగిన వారం తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉండనుంది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నారట.

(ఇదీ చదవండి: ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో పెద్ద సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement