
మెగా ఇంట ఇటీవలే పెళ్లి సందడి ముగిసింది. నాగబాబు తనయుడు , మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహాం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మాదాపూర్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాలో ఓ ఫోటోను పంచుకున్నారు. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిలో మెగాస్టార్ దంపతులు సందడి చేశారు. తాజాగా దీనికి సంబంధించి హల్దీ వేడుకలో దిగిన ఫోటోను చిరంజీవి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చిరు తన ఇన్‌స్టాలో రాస్తూ.. ఇటలీలో ఒక అందమైన సాయంత్రం. ఇది చాలా కాలం క్రితం జరిగింది కాదు. ప్రేమతో ఒకటైన రెండు హృదయాలు ఎన్నో మధురమైన క్షణాలు, జ్ఞాపకాలను తీసుకొచ్చాయి. అలాంటి ఒక అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment