మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్! | Megastar Chiranjeevi Tweet Goes Viral On Varun Tej and Lavanya Tripathi | Sakshi
Sakshi News home page

త్వరలోనే మెగా ఇంట్లో పెళ్లి సందడి.. ఫోటోలు పంచుకున్న మెగాస్టార్!

Published Sat, Oct 7 2023 12:48 PM | Last Updated on Sat, Oct 7 2023 5:14 PM

Megastar Chiranjeevi Tweet Goes Viral On Varun Tej and Lavanya Tripathi - Sakshi

మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి సంబరాలు జరగనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: ఉంగరాలు మార్చుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి)

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ మెగాస్టార్ తన ట్విటర్‌ ద్వారా ఫోటోలు పంచుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ప్రీ వెడ్డింగ్ ‍వేడుకలో మెగాస్టార్ దంపతులు పాల్గొన్నారు. కాబోయే వధూవరులైన వరుణ్-లావణ్యతో ఫోటోలు దిగారు. ఫ్యామిలీ మొత్తం ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

జూన్ 9న ఎంగేజ్‌మెంట్

మెగా హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌ మణికొండలోని నాగబాబు నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్  9న జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులు, అల్లు అరవింద్, ‍అల్లు అర్జున్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా హాజరయ్యారు. చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన కూడా పాల్గొన్నారు. 

కాగా.. 2017లో విడుదలైన ‘మిస్టర్‌’ కోసం వరుణ్‌ - లావణ్య తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్‌లో అంతరిక్షం మూవీ వచ్చింది. ఈ క్రమంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది.  ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చూస్తే ఈ నెలలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. 

వరుణ్‌ తేజ్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ సరసన అందాల భామ మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement