
టైటిల్ : సోదరా
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ఆర్తి గుప్తా, ప్రాచి బన్సాల్, బాబు మోహన్, బాబా భాస్కర్ తదితరులు
నిర్మాణ సంస్థలు: క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: చంద్ర చగన్లా
ఎడిటింగ్: శివ శ్రావణి
దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లి
సంగీతం: సునీల్ కశ్యప్
విడుదల: ఏప్రిల్ 25, 2025
డిఫరెంట్ కామెడీ సినిమాలతో నవ్వించి మెప్పించే సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu ) మొదటిసారి రియల్ ఎమోషన్ చేశాను, న్యాచురల్ కామెడీ సినిమా చేశాను అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించాం అంటూ మూవీ యూనిట్ చెప్పుకొచ్చారు. మరి ఈ సోదరా సినిమా ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం(Sodara Movie Review )

కథేంటంటే..
తెలంగాణలోని ఓ పల్లెటూరులో చిరంజీవి(సంపూర్ణేష్ బాబు), పవన్(సంజోష్) అన్నదమ్ములు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. చిరంజీవి సోడా బిజినెస్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లవ్వట్లేదని, వచ్చిన 99 సంబంధాలు ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్న సమయంలో చిరంజీవి ఎదురింట్లోకి దివి(ఆర్తి గుప్తా) ఫ్యామిలీ వస్తుంది. దివిని చూసి అన్నదమ్ములు ఇద్దరూ ఇష్టపడతారు. ఇద్దరూ దీవిని ట్రై చేస్తారు. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వస్తాయి. అదే సమయంలో కాలేజీలో చదువుకోడానికి చిరంజీవి తమ్ముడు పవన్ ని వేరే ఊరు పంపిస్తాడు. అక్కడ కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)తో ప్రేమలో పడతాడు పవన్. ఓ సారి పవన్ ఇంటికి వచ్చినప్పుడు దివి తన అన్నయ్యని రిజెక్ట్ చేసిందని తెలిసి మరోసారి నీ ప్రేమని చెప్పు అంటూ అర్ధరాత్రి తన అన్నయ్యని దివి ఇంటికి వెళ్లేలా చేస్తాడు. అది దివి తండ్రి చూడటంతో పెద్ద గొడవ అయి రెండు కుటుంబాలు కొట్టుకునే దాకా వెళ్తారు. ఈ గొడవతో దివి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. తమ్ముడి వల్లే ఇదంతా జరిగిందని చిరంజీవి పవన్ కి దూరంగా ఉంటాడు. మరి చిరంజీవి - పవన్ మళ్ళీ అన్నదమ్ములుగా క్లోజ్ అవుతారా? దివి చిరంజీవి కోసం తిరిగి వస్తుందా? చిరంజీవి 100వ పెళ్లిచూపులు జరుగుతాయా? పవన్ లవ్ స్టోరీ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
కామెడీ కథలు చేసే సంపూర్ణేష్ బాబుతో మరో హీరోని పెట్టి అన్నదమ్ముల సినిమాతో పాటు ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఆ తెలంగాణ మట్టి వాసన, స్లాంగ్, జనాలు కాస్త రియలిస్టిగా చూపించే ప్రయత్నం చేసారు. అయితే ఫస్టాఫ్ బాగా సాగదీసారు. కాలేజీ ఎపిసోడ్స్ కాస్త బోర్ కొడతాయి. ప్రథమార్థం సింపుల్ గా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ కి ఎవరూ ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి నెలకొంటుంది. సెకండాఫ్‌లో కామెడీ, ఎమోషన్ పండించడానికి బాగానే కష్టపడ్డారు. కొన్ని సీన్స్ హిలేరియస్ గా నవ్వుకుంటాం. ఓ పక్క లవ్ ఎమోషన్, మరో పక్క అన్నదమ్ముల ఎమోషన్ ని బాగానే చూపించే ప్రయాతం చేశారు. క్లైమాక్స్ లో కూడా మళ్ళీ ట్విస్టులు ఇచ్చి కథ ముగిస్తారు. అయితే అన్నదమ్ముల ఎమోషన్ ని లవ్ స్టోరీలు డామినేట్ చేశాయి అనిపిస్తాయి.

ఎవరెలా చేసారంటే..
ఇన్నాళ్లు నవ్వించిన సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఓ విలేజ్ లో సోడాలు అమ్ముకునే కుర్రాడి పాత్రలో సింపుల్ గా బాగానే నటించాడు. ఎమోషన్ పండించడానికి బాగానే ట్రై చేసాడు. సంజోష్ కూడా తెలంగాణ యువకుడి పాత్రలో యాక్టివ్ గా కనపడ్డాడు. ఆర్తి గుప్తా కాసేపే కనపడినా పర్వాలేదనిపిస్తుంది. ప్రాచి బన్సాల్ తన అందంతో అలరిస్తూనే నటనతో మెప్పిస్తుంది. బాబు మోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రా పరిధి మేరకు నటించారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే చూపించారు. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుంది. సినిమాలో కొంతమందికి డబ్బింగ్ సెట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే మెప్పిస్తుంది. పాటలు మాత్రం యావరేజ్. మొదటి సినిమా అయినా డైరెక్టర్ మంచి కథ తీసుకొని ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.