
నయనతార, కీర్తీ సురేష్ వంటి వారు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లుగా నటిస్తూనే, వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కానీ కథానాయిక సాయిపల్లవి (Sai Pallavi) మాత్రం ఈ ట్రాక్‌లో కాస్త స్లోగా ఉన్నారనుకోవాలి. హీరోయిన్‌గా బిజీగా ఉంటున్న సాయి పల్లవి ‘గార్గి’ అనే డిఫరెంట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేశారు. 2022లో విడుదలైన ఈ సినిమా తర్వాత మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కి సాయి పల్లవి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.
ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని తెలుస్తోంది. ఓ సీనియర్ రచయిత ఓ పవర్‌పుల్ స్టోరీ రెడీ చేశారని, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌కు ఈ కథ నచ్చిందని, ఈ సినిమాలోని మెయిన్ లీడ్ కోసం సాయిపల్లవిని సంప్రదించారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరి... సాయిపల్లవి మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ చిత్రంతో బిజీగా ఉన్నారు సాయిపల్లవి. అలాగే ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) విడుదలకు సిద్ధమవుతోంది.
చదవండి: పాక్ నటుడికి బాలీవుడ్ బ్యూటీ సపోర్ట్.. వారిపై బ్యాన్