పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు | Actress Lavanya Tripathi's Interesting Comments On Her Acting Career After Marriage With Varun Tej - Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: పెళ్లి, కెరీర్ గురించి మెగా కోడలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published Sat, Feb 3 2024 3:59 PM | Last Updated on Sat, Feb 3 2024 4:24 PM

Lavanya Tripathi Comments On Acting Career After Marriage - Sakshi

సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే పెళ్లి తర్వాత సినిమాలు చేయడం తగ్గించేస్తారు లేదంటే పూర్తిగా పక్కనబెట్టేస్తారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్ననే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఎదురైంది. దీనికి ఆమె నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. అలానే కొత్తగా ఏం సినిమాలు చేస్తున్నాననేది బయటపెట్టింది. భర్త వరుణ్ తేజ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

మెగాకోడలిగా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని ఆస్వాదిస్తోంది. నవంబరులో పెళ్లి జరగ్గా.. ఇప్పుడు ఫిబ్రవరిలో 'మిస్ ఫెర్‌ఫెక్ట్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలోనే మీడియా ఆమెని పలకరించగా.. పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తలో సినిమా చేస్తున్నానని క్లారిటీ ఇచ్చేసింది. అలానే కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టినా సరే సినిమాలు చేసే విషయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్)

లావణ్య ఏం చెప్పింది?
'పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి మార్పు రాలేదు. మెగా ఫ్యామిలీలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని నాకు ఎవరు పరిమితులు పెట్టడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ తేజ్ రూపంలో బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు. ఇంతకు మించి ఏం కావాలి'

'మా వరకు మేం అయితే ఎప్పటిలానే ఉన్నాం. అలానే నా సినిమాల విషయంలో వరుణ్ పెద్దగా కల్పించుకోడు. నేను ఏదైనా స్టోరీ చెబితే మాత్రం వింటాడు. తను ఈ సిరీస్ చూసి బాగుందని మెచ్చుకున్నాడు' అని మెగా కోడలు లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement