మూడు రోజుల వేడుక.. వరుణ్-లావణ్య పెళ్లి ముహూర్తం టైమ్ ఇదే! | Varun Tej-Lavanya Tripathi Marriage Date, Muhurtham Time & Full Details | Sakshi
Sakshi News home page

Varun Tej Lavanya Wedding: వరుణ్-లావణ్య పెళ్లి.. ఏది ఎప్పుడు జరగనుందంటే?

Published Tue, Oct 31 2023 7:24 AM | Last Updated on Tue, Oct 31 2023 8:31 AM

Varun Tej Lavanya Tripathi Wedding Muhurtham Time Full Details - Sakshi

మెగా ఫ్యామిలీలో పూర్తి సందడి వాతావరణం. వరుణ్ - లావణ్య పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు పెళ్లి హడావుడిలో మునిగిపోయారు. నవంబరు 1న పెళ్లి వేడుక జరగనుంది. అయితే ముహూర్తం ఎన్నింటికి? ఏది ఎప్పుడు జరగనుందనే విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే కొత్త ఫొటోలు బయటకొచ్చాయి.

(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమించుకున్న వరుణ్-లావణ్య.. పెద్దల్ని ఒప్పించి ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అలానే తాము తొలిసారి కలిసిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యారు. అందుకు తగ్గట్లే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. నవంబరు 1న పెళ్లి జరగనుంది. తాజాగా మూడు రోజుల పెళ్లి వేడుకలో ఏ కార్యక్రమం ఎప్పుడు జరగనుందనే డీటైల్స్ ఉన్న ఇన్విటేషన్ కార్డు బయటకొచ్చింది.

అక్టోబరు 30న అంటే సోమవారం రాత్రి కాక్‌టైల్ పార్టీ గ్రాండ్ జరిగిపోయింది. అక్టోబరు 31న అంటే మంగళవారం ఉదయం 11 గంటలకు హల్దీ, సాయంత్రం 5:30 గంటలకు మెహందీ వేడుక జరగనుంది. ఇక బుధవారం మధ్యాహ్నం 2:48 గంటలకు వరుణ్, లావణ్య మెడలో తాళి కట్టనున్నాడు. అదేరోజు సాయంత్రం 8:30 గంటలకు రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు నితిన్ కూడా ఇటలీ చేరుకున్నాడు. పెళ్లి బస్ ఫొటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నవంబరు 5న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు.

(ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement