
హీరో వరుణ్ తేజ్ (పాత చిత్రం)
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై చర్చ తారా స్థాయికి చేరిన వేళ.. అగ్ర హీరోలపై కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉంటే మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.
‘కపట వేషధారులు, నీపై విమర్శలు చేసి నిన్ను నేలకీడ్చాలని చూసేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవతలి వాళ్లను చెడ్డొళ్లను చేయాలన్న వాళ్ల ప్రయత్నం సులువైందే కావొచ్చు. కానీ, అలా చేసేముందు వాళ్లను వాళ్లు ఓసారి అద్దంలో చూసుకుంటే మంచిది’ అంటూ వరుణ్ తేజ్ ఓ ట్వీట్ చేశాడు. దీనికి క్షణాల్లో మెగా ఫ్యాన్స్ నుంచి మద్ధతుగా రీ-ట్వీట్లు వస్తున్నాయి.
— Varun Tej Konidela (@IAmVarunTej) 17 April 2018