
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమాను ఆగస్టు 30 రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
అయితే అనూహ్యంగా గ్యాంగ్ లీడర్‌కు పెద్ద కష్టం వచ్చి పడింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా వాయిదా పడనుందన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 30కి రిలీజ్ కానుందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే గ్యాంగ్ లీడర్ రిలీజ్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో గ్యాంగ్ లీడర్ కూడా వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment