కష్టాల్లో ‘గ్యాంగ్‌ లీడర్’! | Nani's Gang Leader To Clash With Valmiki On Sep 13 | Sakshi
Sakshi News home page

కష్టాల్లో ‘గ్యాంగ్‌ లీడర్’!

Published Thu, Aug 8 2019 10:00 AM | Last Updated on Fri, Aug 9 2019 5:26 PM

Nani's Gang Leader To Clash With Valmiki On Sep 13 - Sakshi

నేచురల్‌ స్టార్ నాని ఏ ముహూర్తాన గ్యాంగ్ లీడర్‌ సినిమాను ప్రారంభించాడోగాని.. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. విలక్షణ దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. తరువాత టైటిల్‌ విషయంలోనూ ఇబ్బందులు తలెత్తాయి.

గ్యాంగ్ లీడర్‌ టైటిల్‌ ఇతర నిర్మాతలు రిజిస్టర్ చేయించుకోవటంతో టైటిల్‌ను ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’గా మార్చారు. రిలీజ్ డేట్ విషయంలోనూ గ్యాంగ్‌ లీడర్‌కి ఇబ్బందులు తప్పటంలేదు. ముందుగా ఈ సినిమాను  ఆగస్టు 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అదే రోజు ‘సాహో’ రిలీజ్‌ అవుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెప్టెంబర్‌ 13కు వాయిదా వేశారు.

కానీ ఆ రోజున కూడా గ్యాంగ్‌ లీడర్‌కు కష్టాలు తప్పేలా లేవు. భారీ చిత్రం కావటంతో సాహో హవా రెండు మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీనికి తోడు సెప్టెంబర్‌ 13న వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో గ్యాంగ్‌ లీడర్‌కు థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఇన్ని సమస్యల మధ్య గ్యాంగ్‌ లీడర్‌ థియేటర్లలోకి వస్తాడా..? లేక మరోసారి వాయిదా వేస్తారా చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement