
మోహన్ కృష్ణ, హరిణి
‘బావమరదలు’ చిత్రం ఫేమ్ మోహన్ కృష్ణ హీరోగా కిషోర్ బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ‘మళ్ళీ మొదలవుతుంది రచ్చ’ అనేది ఉపశీర్షిక. హరిణి రెyì ్డ కథానాయిక. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు, మెగా అభిమాని మోహన్ కృష్ణ ఈ సినిమా టీజర్‌ను విడుదలచేశారు.
సీహెచ్ రవికిషోర్ బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. చిరంజీవిగారి సూపర్ హిట్ సినిమా టైటిల్ కావడం వల్ల రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘స్వతహాగా చిరంజీవిగారి అభిమానినైన నేను ఆయన సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. మెగా అభిమానులను అలరించేలా టీజర్, సినిమా ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment