Mohan Krishna
-
ఆ అమ్మాయి గురించి చెప్పాడు.. సినిమాలు పడవంటూ
Aa Ammai Gurinchi Meeku Cheppali Movie Teaser Released: యంగ్ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రానికి భిన్న కథలతో అలరించే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో ప్రేమకథా చిత్రం ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ఆరు సంవత్సరాల్లో వరుసగా 6 సూపర్ హిట్లు అందించిన కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా సుధీర్ బాబుని పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. 6 సూపర్ హిట్లు అందించిన డైరెక్టర్‌గా కొంచెం గర్వంతో ఉన్న సుధీర్ బాబుకి అవన్ని రోటీన్ సినిమాలను అతని స్నేహితుడు ఎగతాళి చేయడం బాగుంది. అప్పుడే డాక్టర్ అలేఖ్య పాత్రలో నటిస్తున్న కృతి శెట్టిని హీరో కలుస్తాడు. ఆమె ఒక కళ్ల డాక్టర్. ఆమెకు సినిమాలంటే విరక్తి. అలాంటి అమ్మాయితో సినిమా చేసేందుకు ఒప్పించే ప్రయత్నంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. తను అమ్ముకునే సినిమాలు కాకుండా తనను నమ్ముకునే సినిమాలు చేస్తానని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వివేక్ సాగర్ బీజీఎం అలరించింది. ఓవరాల్‌గా చూసుకుంటే టీజర్ పర్వాలేదనిపించింది. కానీ మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ అంటే తప్పకుండా అంచనాలు ఉంటాయి. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. -
రచ్చ మళ్లీ మొదలవుతుంది
‘బావమరదలు’ చిత్రం ఫేమ్ మోహన్ కృష్ణ హీరోగా కిషోర్ బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ‘మళ్ళీ మొదలవుతుంది రచ్చ’ అనేది ఉపశీర్షిక. హరిణి రెyì ్డ కథానాయిక. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు, మెగా అభిమాని మోహన్ కృష్ణ ఈ సినిమా టీజర్‌ను విడుదలచేశారు. సీహెచ్ రవికిషోర్ బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. చిరంజీవిగారి సూపర్ హిట్ సినిమా టైటిల్ కావడం వల్ల రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘స్వతహాగా చిరంజీవిగారి అభిమానినైన నేను ఆయన సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. మెగా అభిమానులను అలరించేలా టీజర్, సినిమా ఉంటుంది’’ అన్నారు. -
చిరు బర్త్‌డేకి గ్యాంగ్‌లీడర్
మోహన్ కృష్ణ, హరిణి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. సిహెచ్ కిషోర్‌బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్‌రావు నిర్మిస్తున్నారు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ సమర్పకులు. చిత్ర హీరో మోహన్‌కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నారు.‘‘నా అభిమాన హీరో చిరంజీవిగారి పుట్టిన రోజు ఆగస్టు 22న మా సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని మోహన్‌కృష్ణ అన్నారు. ‘‘చిరంజీవిగారి సినిమా టైటిల్ పెట్టడం వల్ల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు సిహెచ్ కిషోర్ బాబు. ‘‘సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. టీమ్ చాలా కష్టపడుతున్నారు’’ అన్నారు సింగులూరి మోహన్‌రావు. -
ఆరేళ్ల కష్టం!
మోహన్‌కృష్ణ, శిరీష, సౌజన్య ముఖ్య తారలుగా గంగారపు లక్ష్మణమూర్తి దర్శకత్వంలో మాణిక్య మూవీస్ పతాకంపై రాజు నిర్మిస్తున్న సినిమా ‘బావ మరదలు’. బండారు దానయ్యకవి స్వరపరచిన ఈ సినిమా పాటలను, ట్రైలర్‌ను ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘గోదావరి జిల్లా నుంచి మరో హీరో, నిర్మాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషం. పాటలు బాగున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మంచి కుటుంబ కథా చిత్రం అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘అతడు ఆమె ఓ స్కూటర్’ నచ్చడంతో రాజుగారు ఈ చిత్రానికి దర్శకుడిగా అవకాశమిచ్చారు. మోహన్ కృష్ణ భవిష్యత్‌లో పెద్ద హీరో అవుతాడు’’ అని గంగారపు లక్ష్మణమూర్తి అన్నారు. ‘‘హీరోగా నా తొలి చిత్రమిది. ఇందుకు ఆరు సంవత్సరాలు కష్టపడ్డా. నా రెండో సినిమా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది’’ అన్నారు హీరో మోహన్‌కృష్ణ. ఈ కార్యక్ర మంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య పాల్గొన్నారు. సమర్పణ: నామన లోహిత్. -
మోహనకృష్ణ మల్టీ స్టారర్ మూవీ ఓపెనింగ్
-
పూనంతో చిందులు
మంచి చార్మింగ్ పర్సనాలిటీ కలిగిన నటుడు గణేశ్ వెంకట్రామన్. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈయన కోలీవుడ్‌లో వెర్సెటైల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ తరహా పాత్ర అయినా ఇట్టే నప్పే గణేశ్వెంక ట్రామన్ తాజాగా అచ్చారం చిత్రం కోసం నటి పూనం కౌర్‌తో కలిసి ఒక రొమాంటిక్ పాటలో చిందులు వేశారు. రాధామోహన్ శిష్యుడు మోహన్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ పిజిరోలాజికల్ థ్రిల్లర్ చిత్రం కోసం ఇటీవల చెన్నైలో ఒక రొమాంటిక్ గీతాన్ని గణేశ్ వెంకట్రామన్, పూనంకౌర్లపై మూడు రోజుల పాటు చిత్రీకరించారు. ఈ పాట గురించి గణేశ్ వెంకట్రామన్ తెలుపుతూ ఈ తరహా పాటలో నటించడం ఇదే తొలిసారి అన్నారు. ఐటమ్‌సాంగ్స్‌కు పెట్టింది పేరైన సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా ఈ పాట చాలా రొమాంటిక్‌గా సంగీతబాణీలందించారని తెలిపారు. నృత్య దర్శకుడు రాబర్ట్ యువతను దృష్టిలో పెట్టుకుని కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ చిత్రంలో తాను రెండు డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తానని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ త్వరలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంతో పాటు జయం రవి, నయనతార జంటగా నటిస్తున్న తనీ ఒరువన్ చిత్రంలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు గణేశ్ వెంకట్రామన్ తెలిపారు. -
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
రేపల్లె/నిజాంపట్నం : నిజాంపట్నం మండలం ఆముదాలపల్లి పంచాయతీ చింతరేవులో 15.13 ఎకరాల అటవీశాఖ భూమిని అధికార టీడీపీ నాయకులు ఆక్రమించుకున్న ఉదంతంపై ‘సాక్షి’ లో ‘దేశం’దురాక్రమణ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనం స్థానికంగా సంచలనం కలిగించింది. 15.13 ఎకరాల అటవీశాఖ భూమికి టీడీపీ నాయకులు పట్టాలు సంపాదించిన గుట్టురట్టయిన సంగతి తెలిసిందే. సాక్షి కథనంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహశీల్దారు మోహన్‌కృష్ణ అటవీశాఖ ఆధీనంలోని సర్వే నంబరు 583 భూ వివరాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అటవీ భూముల వివరాలపై విచారణ నిర్వహించారు. గతంలో పనిచేసిన తహశీల్దారు రవికుమార్‌తో ఫోన్లో మాట్లాడి వివరణ తీసుకున్నారు. రేపల్లె ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి అటవీభూములకు పట్టాలు పొందిన అంశంపై చర్చించడం, వారి నుంచి నివేదికను కోరారు. అటవీ భూముల పట్టాలు పొందిన అంశంపై రెవెన్యూ అధికార యంత్రాంగం రికార్డుల తనిఖీల్లో నిమగ్నమైంది. టీడీపీ నాయకులు పట్టాలు పొందిన భూమి అటవీ శాఖదేనని తేల్చేశారు. ఈ సందర్భంగా మోహనకృష్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు చెప్పారు. అటవీశాఖ భూమికి పట్టాలు జారీచేసిన విషయంపై పూర్తిస్థాయిలో విచారించే నిమిత్తం ముందుగా రికార్డులను పరిశీలించామని, సంబంధిత భూములను గురువారం రెవెన్యూ అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు. అటవీశాఖ భూమిని పంపిణీచేసే అధికారం ఎవరికి లేదని, పట్టాలను రద్దుచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పట్టాలు పొందిన వారిని విచారించి వివరాలు తీసుకోవాల్సి ఉందన్నారు. రెండురోజుల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందించేందుకు తహశీల్దారు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అధికారవర్గాల్లో ఆందోళన.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలంటూ వస్తున్న ఒత్తిళ్లతో చేసేదిలేక ఎక్కడపడితే అక్కడ సంతకాలు చేయాల్సిన దుస్థితి వస్తోందని అధికారవర్గాల్లో ఆందోళన మొదలయ్యింది. చేసే అవినీతి పనుల్లో తమను భాగస్వాములను చేస్తున్నారనే గుసగుసలు మొదలయ్యాయి. అవినీతి కార్యక్రమాలు బయటపడుతున్న సమయంలో నెపం మొత్తం తమపై నెట్టి నాయకులు తప్పించుకుంటున్నారని అధికారులు ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. టీడీపీ పాలకులు, నాయకులు అడ్డగోలు వ్యవహారల్లో తలదూరిస్తే నష్టం వాటిల్లక తప్పదని అటువంటి అడ్డగోలు వ్యవహారాలకు దూరంగా ఉండాలని లేకుంటే నియోజకవర్గం నుంచి అయినా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవాలని పలువురు అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నాయకుల దురాగతాలకు అడ్డూఅదుపు లేకుడా పోతోందనే ఆరోపణలు వినవస్తున్నాయి.