
ఆరేళ్ల కష్టం!
మోహన్‌కృష్ణ, శిరీష, సౌజన్య ముఖ్య తారలుగా గంగారపు లక్ష్మణమూర్తి దర్శకత్వంలో మాణిక్య మూవీస్ పతాకంపై రాజు నిర్మిస్తున్న సినిమా ‘బావ మరదలు’. బండారు దానయ్యకవి స్వరపరచిన ఈ సినిమా పాటలను, ట్రైలర్‌ను ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘గోదావరి జిల్లా నుంచి మరో హీరో, నిర్మాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషం. పాటలు బాగున్నాయి.
ట్రైలర్ చూస్తుంటే మంచి కుటుంబ కథా చిత్రం అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘అతడు ఆమె ఓ స్కూటర్’ నచ్చడంతో రాజుగారు ఈ చిత్రానికి దర్శకుడిగా అవకాశమిచ్చారు. మోహన్ కృష్ణ భవిష్యత్‌లో పెద్ద హీరో అవుతాడు’’ అని గంగారపు లక్ష్మణమూర్తి అన్నారు. ‘‘హీరోగా నా తొలి చిత్రమిది. ఇందుకు ఆరు సంవత్సరాలు కష్టపడ్డా. నా రెండో సినిమా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది’’ అన్నారు హీరో మోహన్‌కృష్ణ. ఈ కార్యక్ర మంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య పాల్గొన్నారు. సమర్పణ: నామన లోహిత్.