పూనంతో చిందులు | romantic song in Poonam Kaur | Sakshi
Sakshi News home page

పూనంతో చిందులు

Published Sun, Jan 18 2015 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

పూనంతో చిందులు

పూనంతో చిందులు

 మంచి చార్మింగ్ పర్సనాలిటీ కలిగిన నటుడు గణేశ్ వెంకట్రామన్. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈయన కోలీవుడ్‌లో వెర్సెటైల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ తరహా పాత్ర అయినా ఇట్టే నప్పే గణేశ్‌వెంక ట్రామన్ తాజాగా అచ్చారం చిత్రం కోసం నటి పూనం కౌర్‌తో కలిసి ఒక రొమాంటిక్ పాటలో చిందులు వేశారు. రాధామోహన్ శిష్యుడు మోహన్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ పిజిరోలాజికల్ థ్రిల్లర్ చిత్రం కోసం ఇటీవల చెన్నైలో ఒక రొమాంటిక్ గీతాన్ని గణేశ్ వెంకట్రామన్, పూనంకౌర్‌లపై మూడు రోజుల పాటు చిత్రీకరించారు.
 
 ఈ పాట గురించి గణేశ్ వెంకట్రామన్ తెలుపుతూ ఈ తరహా పాటలో నటించడం ఇదే తొలిసారి అన్నారు. ఐటమ్‌సాంగ్స్‌కు పెట్టింది పేరైన సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా ఈ పాట చాలా రొమాంటిక్‌గా సంగీతబాణీలందించారని తెలిపారు. నృత్య దర్శకుడు రాబర్ట్ యువతను దృష్టిలో పెట్టుకుని కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ చిత్రంలో తాను రెండు డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తానని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ త్వరలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంతో పాటు జయం రవి, నయనతార జంటగా నటిస్తున్న తనీ ఒరువన్ చిత్రంలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు గణేశ్ వెంకట్రామన్ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement