romantic song
-
రెచ్చిపోయిన నిహారిక.. రొమాన్స్‌తో పాటు డ్యాన్స్‌లోనూ
మెగా డాటర్ నిహారిక ఇదివరకే తెలుగులో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు యాక్టింగ్ పక్కనబెట్టేసింది. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఒకటి రెండు వెబ్ సిరీసుల్లో నటించింది కానీ అవేమంత చెప్పుకోదగ్గ పాత్రలైతే కాదు. ప్రస్తుతం తమిళంలో 'మద్రాస్కారన్' మూవీలో హీరోయిన్గా చేస్తోంది. ఇందులో ఓ పాట షాకిచ్చే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు)ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కాకపోతే ఇవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి, నిర్మాతగా మారింది. ఈ ఏడాది 'కమిటీ కుర్రోళ్లు' అనే అద్భుతమైన సినిమాని అందించింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె హీరోయిన్గా చేసిన తమిళ మూవీ నుంచి ఓ పాట రిలీజైంది.తాజాగా పూర్తి వీడియో సాంగ్ విడుదల చేశారు.ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వీడియో సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోతున్నారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి!(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!) -
ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్‌గా 'లైగర్' సాంగ్
Aafat Song From Vijay Devarakonda Liger Movie Released: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం 'లైగర్'. విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే అలరించనున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎప్పటినుంచో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. అందులో భాగంగానే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా నుంచి బ్యూటీఫుల్ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'ఆఫత్' అంటూ సాగే ఈ పాటలో విజయ్ దేరకొండ, అనన్య పాండేల కెమిస్ట్రీ యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఉంది. ఈ పాట పూర్తి వీడియోను షేర్ చేస్తూ 'మోస్ట్ ఎలక్ట్రిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్' అని విజయ్ అభివర్ణించాడు. 'ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే' అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ పాటలో విజయ్, అనన్య డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. ఇదివరకు ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే. Vibe to the most electric song of the year #AAFAT 💞 ▶️ https://t.co/yHkGSmd8x6#LIGER #LigerOnAug25th pic.twitter.com/otJw78WvHT — Vijay Deverakonda (@TheDeverakonda) August 6, 2022 -
ఎదురీత ముందు విధిరాత ఎంత!
కొన్నాళ్ల క్రితం ఓ మ్యూజిక్ డెరైక్టర్ నాకు ఫోన్ చేశారు. తన కూతుళ్లిద్దరూ నోట్ బుక్‌లో ఏదో రాసుకుంటుంటే ఏమిటని అడిగారట ఆయన. వాళ్లు సినిమా పాట రాసుకుంటున్నామని చెప్పా రట. ఆడపిల్లలు, నోట్‌బుక్‌లో సినిమా పాట రాసుకోవడమేంటి, ఏదైనా రొమాంటిక్ సాంగ్ గానీ రాసుకోవడం లేదు కదా అని కంగారుపడి ఆయన చెక్ చేశారట. అది అలాంటి పాట కాదు. ‘నింగి నేల నాదే’ సినిమాలోని ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ అనే పాట. పిల్లలకి స్కూల్లో ఆ సినిమా చూపించారట. చాలా గొప్ప పాట, అందరూ తప్పకుండా నేర్చుకుని పాడాలి అని టీచర్ చెప్పిందట. ‘పాఠాలతో పాటు మీ పాటను కూడా నేర్పుతున్నారు స్కూల్లో’ అని ఆయన అంటే సంతోషం వేసింది. ఏ రంగంలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఏదో ఒకదాని నుంచి స్ఫూర్తి పొందిన వాడే అయ్యుంటాడు. మహ్మాతాగాంధీ కూడా స్ఫూర్తి కోసం భగవద్గీత చదివేవారు. స్ఫూర్తి అనేది అంత అవసరం. నేను నా కెరీర్లో స్ఫూర్తిని కలిగించే పాటలు చాలా రాశాను... మౌనంగానే ఎదగమని, చీకటితో వెలుగే చెప్పెను, కొడితే కొట్టాలిలా, నవ్వేవాళ్లు నవ్వనీ... ఇలా! అయితే ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ పాట చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది వికలాంగులకు స్ఫూర్తినివ్వడం కోసం రాసింది. అన్ని అవయవాలూ సక్రమంగా పని చేస్తున్నవారికే స్ఫూర్తి అవసర మైనప్పుడు... శరీరంలో కొన్ని అవయవాలు లేక, తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి స్ఫూర్తి ఎంత అవసరం! అందరితో సమానం కావడానికి ఎలాంటి ప్రేరణ అవ సరం! అలా ఆలోచిస్తూనే పెన్ను పట్టాను. ఈ పాటకు జన్మనిచ్చాను. ఆరాటం ముందు ఆటంకం ఎంత/ సంకల్పం ముందు వైకల్యం ఎంత?/దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత??/ఎదురీత ముందు విధిరాత ఎంత? నమ్మకమూ పట్టుదల/నా రెండు రెక్కలుగా/ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశన్నంతా సాధించాలి అన్న పట్టుదల ఉంటే వైకల్యం అడ్డు కాదు. ఆ నిజం తెలుసుకుంటే విధిరాతను మార్చొచ్చు. దురదృష్టాన్ని పారద్రోలవచ్చు. చేజారెను చేతులు/చెదిరేను గీతలు/ బెదిరించిన బాధలే వివరించెను బోధలు హీరోయిన్ ప్రమాదవశాత్తూ చేతులు కోల్పోతుంది. తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితికొస్తుంది. ఆ బాధ మొదటి రెండు లైన్లలోనూ ఉంటే, క్రమంగా తనలో పెరిగిన పట్టుదలను మూడో లైన్ చెబుతోంది. పాదాలను పిడికిలిగా/నా గుండెను గుప్పిటగా/మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా... పట్టుదలతో తానేం చేయబోతోందో చెబుతోందా అమ్మాయి. చేతులు లేని స్థితిలో అలానే ఉండిపోతే తను అందరిలాంటి అమ్మాయిల్లాగే మిగిలిపోయేది. కానీ తను తన పనులు తానే చేసుకోవడం నేర్చుకుంది. కాళ్లతో వండుతుంది. తింటుంది. కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంది. చివరికి స్విమ్మింగ్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తుంది. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం/ అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం/ చిరునవ్వే స్తుంటే సెలవంది శోకం/సహనంతో ఉంటే దొరికింది సైన్యం/చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం అంటూ తన విజయాన్ని ప్రపంచానికి సగర్వంగా చూపిస్తుంది తను. నిజానికిదో చైనీస్ మూవీ. డబ్ చేశారు. విదేశీ సినిమాల్లో పాటలుండవు. కానీ తెలుగులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వచ్చే ఒకచోట పాట పెట్టా లనుకున్నారు. ఆ సిట్యుయేషన్‌కి పాట కంటే ముందు ఒక మాట వచ్చింది నా మనసులోకి. ఆ అమ్మాయి ఓ యాపిల్‌ను కాళ్లతో తీసుకుని, నోటి దగ్గర పెట్టుకుని తింటుంది. అది తన ఆత్మవిశ్వాసం, ధైర్యం, స్థిరచిత్తానికి నిదర్శనం. అందుకే ఓ మాట రాశాను... ‘నాకెన్ని కష్టాలు సమస్యలు ఇబ్బందులు వచ్చినా కన్నీరు పెట్టను, పెట్టకూడదు కూడా. ఎందుకంటే తుడుచుకోవడానికి నాకు చేతులు లేవు కాబట్టి!’ ఆ తర్వాత ఈ పాట ప్రారంభమవుతుంది. ఇలాంటి పాటలు రాయాలంటే పాత్ర తాలూకు మనస్తత్వాన్ని, మానసిక స్థితిని తప్ప కుండా అనుభవించాలి. ఆ స్థానంలోకి వెళ్లి ఆ పాత్ర తాలూకు బాధను, సంఘర్షణను అనుభ వించగలిగితేనే ఈ విధంగా రాయగలం. లేక పోతే పాదాలను పిడికిలిగా పట్టుకుంటాను అన్న మాట ఎలా వస్తుంది! గుండెను గుప్పిటగా మలవడం అన్న వాక్యం ఎలా తడుతుంది! నిర్మాత సుధారాణిగారికి ఈ పాట వినిపించ గానే ఆవిడ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నేను కూడా దీన్ని నా జీవితంలో నేను రాసిన ఓ గొప్ప పాటగా భావిస్తాను. అయితే ఇది పాడే సందర్భం మాత్రం రాకూడదని కోరుకుంటాను. ఎందుకంటే వైకల్యం ఎవరికీ ఉండకూడదు. కానీ దురదృష్టం... చాలామంది వికలాంగులు ఉన్నారు. వాళ్లకి స్ఫూర్తి కలిగించే అవకాశం ఎప్పుడు వచ్చినా నేను ఈ పాటే పాడు తుంటాను. వాళ్ల కోసం ఈ పాట రాయగలిగి నందుకు సంతోషపడుతుంటాను! - చంద్రబోస్,గీత రచయిత -
పిచ్ నుంచి పాటకు..!
క్రికెటర్ సురేశ్ రైనా ఓ రికార్డు సాధించారు. అదేంటి ఏ మ్యాచ్‌లో అనుకుంటున్నారా? మ్యాచ్‌లో కాదండి! పాట పాడటంలో. ‘మీరుథియా గ్యాంగ్స్టర్స్’ చిత్రంలో ‘తూ మిలే సబ్ మిలా’ అనే రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించి తనలో మంచి పాటగాడు కూడా ఉన్నాడని నిరూపించాడు సురేశ్ రైనా. ‘‘క్రికెట్ అంటే నాకు ప్రాణం. దీంతో పాటు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం. అలా నాకు పాడటం వచ్చింది. ఈ సినిమా నిర్మాత నా భార్యకు బంధువు అవుతారు. ఏదో సందర్భంలో నా గొంతు విని నేను ఈ సినిమాలో పాడాల్సిందే పట్టుబట్టారు. కేవలం అయిదు గంటల్లో రికార్డింగ్ పూర్తయింది. వినేవాళ్లకు నచ్చుతుందనుకుంటున్నా’’ అని సురేశ్‌రైనా చెప్పారు. -
పూనంతో చిందులు
మంచి చార్మింగ్ పర్సనాలిటీ కలిగిన నటుడు గణేశ్ వెంకట్రామన్. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈయన కోలీవుడ్‌లో వెర్సెటైల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ తరహా పాత్ర అయినా ఇట్టే నప్పే గణేశ్వెంక ట్రామన్ తాజాగా అచ్చారం చిత్రం కోసం నటి పూనం కౌర్‌తో కలిసి ఒక రొమాంటిక్ పాటలో చిందులు వేశారు. రాధామోహన్ శిష్యుడు మోహన్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ పిజిరోలాజికల్ థ్రిల్లర్ చిత్రం కోసం ఇటీవల చెన్నైలో ఒక రొమాంటిక్ గీతాన్ని గణేశ్ వెంకట్రామన్, పూనంకౌర్లపై మూడు రోజుల పాటు చిత్రీకరించారు. ఈ పాట గురించి గణేశ్ వెంకట్రామన్ తెలుపుతూ ఈ తరహా పాటలో నటించడం ఇదే తొలిసారి అన్నారు. ఐటమ్‌సాంగ్స్‌కు పెట్టింది పేరైన సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా ఈ పాట చాలా రొమాంటిక్‌గా సంగీతబాణీలందించారని తెలిపారు. నృత్య దర్శకుడు రాబర్ట్ యువతను దృష్టిలో పెట్టుకుని కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ చిత్రంలో తాను రెండు డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తానని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ త్వరలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంతో పాటు జయం రవి, నయనతార జంటగా నటిస్తున్న తనీ ఒరువన్ చిత్రంలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు గణేశ్ వెంకట్రామన్ తెలిపారు. -
రౌడి-నీ మీద ఒట్టు సాంగ్