
నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను చేస్తూ.. తనకంటూ ఓ అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్న నాని.. రీసెంట్‌గా జెర్సీ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మళ్లీ తాజాగా మరో విభిన్న చిత్రం చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దం అవుతున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో రాబోతోన్న గ్యాంగ్ లీడర్ చిత్రం టీజర్, పోస్టర్స్,పాటలతో మంచి అంచనాలను పెంచగా.. తాజాగా రెండో పాటను విడుదల చేసింది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ అలరించడానికి రెడీ అవుతున్న ‘గ్యాంగ్‌లీడర్' చిత్రంలోని 'వేరే కొత్త భూమిపై ఉన్నానా.. ఏదో వింత రాగమే విన్నానా.. హోయ్‌నా.. హోయ్‌నా..హోయ్‌నా..' అంటూ సాగే రెండో పాటను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేశారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య నటిస్తున్నారు. ఈ ప్రముఖ పాత్రను ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తీకేయ పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment