
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను మహేష్ క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలోనూ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమాను కూడా మహేష్ పక్కన పెట్టేశాడు.
ఇప్పటికే అదే కథను విక్రమ్.. నాని హీరోగా తెరకెక్కిస్తున్నాడట. సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో తన ఇమేజ్‌కు ఆ కథ సూటవ్వదన్న ఉద్దేశం మహేష్ నో చెప్పాడట. అదే కథను నాని ఓకె చేయటంతో గ్యాంగ్ లీడర్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. విలన్ పాత్రకు సెన్సేషనల్ హీరోగా ఆర్‌ఎక్స్ 100 ఫేం కార్తికేయను తీసుకున్నారు. మరి మహేష్ కోసం తరువాత చేసిన కథకు నాని ఎంత వరకు సూట్ అవుతాడో చూడాలి.