
నాని
కవికి కలం ముఖ్యం. అందుకే దానికి కూడా ఓ పేరు పెట్టుకుంటాడు. ఆ పేరుతో రచనలు చేస్తుంటాడు. నాని కూడా రచయితగా మారారా. ఆయన కూడా తన పెన్నుకో పేరు పెట్టుకోవాలనుకున్నారు. ఆలోచించి చించీ పెన్నుకి తమ్ముడైన పెన్సిల్ పేరుని తన పెన్నుకి పెట్టుకున్నారు. పెన్‌ఫ్యూషన్‌గా ఉందా? అయితే అసలు విషయానికి వచ్చేస్తాం. నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. విక్రమ్ కె. కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో నాని పెన్ నేమ్ పెన్సిల్ అట. ఇందులో నాని రచయితగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనిరుథ్ సంగీత దర్శకుడు.