Priyanka Mohan Arul Latest Photoshoot Goes Viral - Sakshi
Sakshi News home page

Priyanka Mohan: దిక్కుతోచని స్థితిలో ‘గ్యాంగ్‌ లీడర్‌’ బ్యూటీ ప్రియాంక మోహన్‌!

Published Tue, Aug 2 2022 8:47 AM | Last Updated on Tue, Aug 2 2022 9:48 AM

Priyanka Mohan Arul Latest Photoshoot Goes Viral - Sakshi

ప్రియాంక మోహన్‌

తమిళంలో రెండు హిట్‌ చిత్రాల్లో నటించినా ప్రియాంక మోహన్‌కు అవకాశాలు రావట్లేదట. 2019లో కన్నడ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. తెలుగులో ఆమె ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘శ్రీకారం’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత ఆమెను తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. అయితే కోలీవుడ్‌లో మాత్రం అవకాశాలు దక్కాయి. తమిళంలో డాక్టర్‌ చిత్రంతో ఎంట్రీ వచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో శివ కార్తికేయన్‌ డాన్‌ చిత్రంతో మరో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధ్యలో సూర్యతో ఎదుర్కుమ్‌ తుణిందవన్‌ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

చదవండి: సెట్‌లో ఓవరాక్షన్‌ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్‌

ఇక్కడ వరకు కథ బాగానే నడిచింది. ఇప్పుడే అమ్మడు అయోమయంలో పడింది. కొత్త చిత్రాలు అవకాశాలు కనుచూపు మేర కనిపించడం లేదట. ఇలాంటప్పుడు ఏ హీరోయిన్‌ అయినా అవకాశాల వేట పట్టక తప్పదు. అయితే కన్నడం, తెలుగు, తమిళం మూడు భాషల్లో నటించిన ప్రియాంక మోహన్‌ ఇప్పుడు ఏ భాషలో అవకాశాల కోసం ప్రయత్నించాలో తెలియక సతమతపడుతుందట. దీంతో ఆమె ప్రస్తుతం ఇన్‌స్ట్రాగామ్‌ను మార్గంగా ఎంచుకుంది. ఇటీవల వివిధ భంగిమల్లో రకరకాల గ్లామర్‌ దుస్తుల్లో ఫొటోషూట్‌ చేయించుకుని ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేస్తూ ముందుగా ఏ భాషలో అవకాశం వస్తుందా? అని ఎదురు చూస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement