
మోహన్‌కృష్ణ
‘‘నేను చిరంజీవిగారికి వీరాభిమానిని. అందుకే ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ టైటిల్ తమకు కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అడిగారు. ఇవ్వనన్నాను. అమ్మనన్ని కూడా చెప్పాను’’ అన్నారు మోహన్‌కృష్ణ. ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో తాను హీరోగా నటిస్తూ ఓ నిర్మించాలనుకున్నారు మోహన్‌కృష్ణ. అయితే నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో మైత్రి మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేసింది.
ఈ నేపథ్యంలో శనివారం మోహన్‌కృష్ణ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ రిజిస్టర్ చేశాం. త్వరలో షూటింగ్ ఆరంభించి, చిరంజీవిగారి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయాలనుకున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. ఈలోపు నాని బర్త్‌డేకి మా టైటిల్‌తో టీజర్ రిలీజ్ చేశారు. మా పర్మిషన్ తీసుకోకుండా ఎలా టైటిల్‌ను ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్‌లో ఫిర్యాదు చేశాను. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment