
ఇటీవల కాలంలో పాత సినిమాల టైటిల్స్‌ను ఈ జనరేషన్ హీరోల సినిమాలకు వాడటం కామనైపోయింది. ఇప్పటికే చాలా టైటిల్స్ అలా రిపీట్ అయ్యాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో బ్లాక్ బస్టర్ టైటిల్ వచ్చి చేరనుందట. నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ రోజు (ఆదివారం) నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ రోజు నాని, విక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ సంబంధించిన పోస్టింగ్‌లు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి సూపర్‌హిట్ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్‌ను నాని సినిమా కోసం తీసుకున్నారట. గతంలో ఈ టైటిల్‌తో సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా రూపొందనుందన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో గ్యాంగ్ లీడర్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేయాలని కూడా అభిమానులు కోరుతున్నారు. మరి ఈ సమయంలో నాని అదే టైటిల్‌ను తన సినిమాకు ఫిక్స్ చేయటంపై అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.