
‘‘ఐదుగురు అమ్మాయిలు. వాళ్ల గ్యాంగ్‌కి ఓ లీడర్. ఐదు వేళ్లను మోసే అరచేతిలాగా, పాండవుల వెనకుండే కృష్ణుడిలా ఆ గ్యాంగ్‌ని చూసుకుంటుంటాడు’ అంటూ సాగే వీడియోతో నాని–విక్రమ్ కె.కుమార్ చిత్ర టైటిల్‌ను నాని బర్త్‌డే సందర్భంగా ‘గ్యాంగ్‌లీడర్’ అని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది నాని 24వ చిత్రం. ఈ సినిమాలో ‘ఆర్‌ఎక్స్ 100’ కార్తికేయ విలన్‌గా నటించనున్నారు.
‘‘చిరంజీవిగారి సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. ఆయన అభిమాని అయిన నేను.. ఆయన సినిమా టైటిల్‌ను నా సినిమాకి పెట్టడం సంతోషంగా ఉంది’’ అని నాని ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రియాంక, శరణ్య, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆగస్ట్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్.
Comments
Please login to add a commentAdd a comment