
నాని
తన గ్యాంగ్‌తో కలిసి పగ తీర్చుకున్నాడు పార్ధసారథి. ఇందుకోసం ఎలాంటి స్కెచ్‌లు వేశాడు? ప్రత్యర్థుల నుంచి ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే దృశ్యాలను మాత్రం వెండితెరపై చూడాల్సిందే. నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్‌లీడర్’. ఇందులో రివెంజ్ రైటర్ పార్థసారథి పాత్రలో నటించారు నాని. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లాలు నాని గ్యాంగ్ సభ్యులుగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆగస్టు 30న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.