
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసిన చిత్రయూనిట్ అనుకున్న సమయానికి సినిమాను రెడీ చేసేందుకు కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్‌కు విచిత్రమైన సమస్య ఎదురైంది.
గ్యాంగ్ లీడర్ లైన్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా లైన్‌ను పోలి ఉంటుందట. ముఖ్యంగా కొన్ని ట్విస్ట్‌లు ఒకేలా ఉండటంతో ఇప్పుడు కథలో మార్పులు చేసుందుకు రెడీ అవుతున్నారట. అయితే ఈ సమయంలో మార్పులు చేర్పులు చేస్తే అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంతవరకు స్పందించలేదు.