Agent Sai Srinivasa Athreya
-
తెలుగులో హీరోయిన్గా, హిందీ సీరియల్స్‌లో నటిగా!
శ్రుతి శర్మ.. రియాలిటీ షో విన్నర్ కాలేదు.. కానీ రియల్ లైఫ్‌లో విన్నర్‌గా నిలిచింది.. సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాలనే కలను నిజం చేసుకుని! పుట్టింది, పెరిగింది, చదివింది.. అంతా లక్నోలోనే. చదువుకునేరోజుల్లో డాన్స్, నాటకాల్లో పాల్గొనడంతో నటన మీద ఆసక్తి పెరిగింది. దాంతో విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే ముంబైలోని ‘అనుపమ్ ఖేర్స్ యాక్టింగ్ స్కూల్’లో చేరి ట్రైనింగ్ తీసుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2018లో ‘ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్స్’ రియాలిటీ షోతో చిన్ని తెర ప్రేక్షకులకు పరిచయం అయింది. అందులో తను విజయం సాధించక పోయినా, తన నైపుణ్యంతో ప్రేక్షకులను మెప్పించి ‘స్పెషల్ మెన్షన్’ అవార్డును అందుకుంది. ఆమె ప్రతిభకు ముచ్చటపడ్డ ఆ షో గెస్ట్ కరన్ జోహార్, తను తీయబోయే సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించడంతో శ్రుతి రియల్ విన్నర్ అయిందనే కాంప్లిమెంట్స్ పొందింది. తెలుగు సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘గఠ్బంధన్’, ‘నజర్ 2’, ‘యే జాదు హై జిన్ కా!’, ‘నమక్ ఇష్క్ కా’ సిరీయల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ‘పగ్లైట్’లో ముఖ్య భూమిక పోషించి వెబ్ వీక్షకులకూ అభిమాన నటి అయింది. డాన్స్ అంటే చాలా ఇష్టం. భరతనాట్యంలో శిక్షణ పొందింది. రచనారంగంలోనూ చేయితిరిగిన వాక్యం, ఎక్స్ప్రెషన్ ఆమెవి. శ్రుతి రాసిన ‘ప్రిత్యాగ్’ అనే నాటకం విమర్శకుల ప్రశసంలు అందుకుంది. ఆ నాటకానికి ఆమె సోదరుడు శగున్ శర్మ దర్శకత్వం వహించాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు, సీరియల్స్ చూస్తూ పెరిగా. నటిగా కాకుండా మరేవిధంగానూ నన్ను నేను ఊహించుకోలేను. సినిమాలే నా జీవితం. – శ్రుతి శర్మ చదవండి: ఎమ్మెల్యే శంకర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ పచ్చందనమే పచ్చదనమే... -
నిధి కోసం వేట
‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అంటూ చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించిన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జె. మంగళవారం తన రెండో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ‘క్షణం’, ‘ఘాజీ’, ‘గగనం’ చిత్రాలను అందించిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించనున్నారు. తిరుపతికి సమీపంలోని ఓ గ్రామంలో నిధి గురించి జరిగే కథే ఈ సినిమా అంటున్నారు స్వరూప్. ఫస్ట్ లుక్ పోస్టర్లో ముఖం సరిగా కనిపించకుండా ఉన్న వ్యక్తి ఫోటో కింద ‘వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవ్’ అని ఉంది. ‘‘ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించుకుంటుంది’’ అన్నారు నిర్మాతలు. -
మరో రెండు భాగాలు
నవీన్ పోలిశెట్టి హీరోగా, శ్రుతి శర్మ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది జూన్‌లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఈ చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా పుట్టినరోజుని పురస్కరించుకొని ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ట్రయాలజీగా వస్తుందని ప్రకటించారు. అంటే ఈ చిత్రానికి మరో రెండు భాగాలు రానున్నాయన్న మాట. ఈ సందర్భంగా రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ–‘‘స్వరూప్ ఆర్ఎస్జె ప్రస్తుతం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. తను దర్శకత్వం వహిస్తోన్న రెండో సినిమా పూర్తవగానే ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడిస్తాం. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమా హిందీ, తమిళ, మలయాళం రీమేక్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడుపోయాయి. త్వరలో కన్నడ హక్కులు కూడా అమ్ముడు కానున్నాయి. మా చిత్రం జపాన్ భాషలో అనువాదం అవుతుండటం మరో విశేషం. సెప్టెంబర్ 11న అక్కడ విడుదలవుతోంది’’ అన్నారు. -
భారీ రేటుకు 'ఏజెంట్ సాయి' రీమేక్ హక్కులు
గతేడాది భారీ బడ్జెట్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోగా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు మాత్రం అపూర్వ విజయాలను నమోదు చేసుకున్నాయి. అందులో హీరో నవీన్ పొలిశెట్టి నటించిన "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ"కు ప్రత్యేక స్థానం ఉంది. థ్రిల్లర్, డిటెక్టివ్ తరహాలో రూపు దిద్దుకున్న ఈ సినిమా మూస సినిమాలు చూస్తూ విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇచ్చింది. దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన ఈ సినిమా గతేడాది జూన్ 21న విడుదలవగా నాలుగు రోజుల్లోనే ఆరు కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో హీరోగా పరిచయమైన నవీన్ పొలిశెట్టి సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా నడిపించారు. రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే రూపొందించారు. త్వరలోనే దీనికి సీక్వెల్ తీయాలని ఆలోచనలో పడ్డారు స్వరూప్. (హిందీకి హిట్) కాగా ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం ప్రధాన పాత్రలో తమిళంలో ఈ చిత్రం రీమేక్ కానుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులు 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. బడ్జెట్ కన్నా రెట్టింపు డబ్బులకు రీమేక్ హక్కులు రేటు పలకడం విశేషం. రీమేక్‌లో ఎవరు నటించనున్నారు? రీమేక్ హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే చిన్న సినిమాలైన విశ్వక్సేన్ 'హిట్', ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూమారుడు శ్రీ సింహా 'మత్తు వదలరా' సినిమాలు కూడా బాలీవుడ్ రీమేక్‌ల దిశగా అడుగులు పడిన విషయం తెలిసిందే. (‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’) -
‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు స్వరూప్ ఆర్ఎస్జే. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు రద్దు కావడంతో ఇంటికే పరిమితైమన ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తన తదుపరి చిత్రాల స్క్రిప్ట్ పనిలో నిమగ్నమయ్యారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వరూప్ తన డ్రీమ్ ప్రాజెక్ట్స్, ఆలోచనలను అభిమానులతో పంచుకున్నాడు. ‘నాకు మల్టీస్టారర్ చిత్రాలంటే ఇష్టం. అయితే పర్ఫెక్ట్ కాన్సెప్ట్ దొరికితే తప్పకుండా మల్టీస్టారర్ చిత్రం చేస్తా. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించాలనే కోరిక ఉంది. అదేవిధంగా ప్రభాస్-ఆమీర్ ఖాన్ కలయికలో పాన్ ఇండియా రేంజ్లో మరో చిత్రాన్ని తీయాలనే ఆలోచన ఉంది. ఈ హీరోల కలయికలో సినిమాలు వస్తే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తాయి. అయితే ఇలాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీయాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం. ఆయనతో సినిమా చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్’ అని దర్శకుడు స్వరూప్ పేర్కొన్నారు. చదవండి: అవ్రమ్‌కు హెయిర్ కట్ చేసిన విరానిక నిహారిక, యశ్‌ల డ్యాన్స్ చూశారా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_691245605.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సినిమాల్లో వీరు పాసయ్యారు
ఇండస్ట్రీ సముద్రం లాంటిది. కొత్త నీరు ఎప్పటికప్పుడు సముద్రంలో చేరినట్టే, ఇండస్ట్రీలోనూ కొత్త ముఖాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రవాహం సాగుతుంటుంది. ఈ ప్రయాణంలో ప్రామిసింగ్‌గా కొందరు మాత్రమే అనిపిస్తారు. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మెరిసిన కొత్తవాళ్ల సంఖ్య అభినందనీయంగా లేదు. గత ఏడాది కొత్త దర్శకులు నెలకో వారం చొప్పున మెరిశారు. ఈసారి అదీ కనిపించలేదు. హీరోహీరోయిన్లు విషయంలోనూ అంతే. అలా ఈ ఏడాది తెలుగులో పరిచయమైనవాళ్లల్లో ఫస్ట్ టెస్ట్‌లో పాస్ అయి, ఇటు ఇండస్ట్రీ అటు ప్రేక్షకులకు బాగా రీచ్ అయినవారి గురించి మాట్లాడుకుందాం. హీరోలిద్దరే! ► డిటెక్టివ్ అనేవాడికి తన మీద తనకి నమ్మకం, కొంచెం ఓపిక ఉండాలి అనేది ఏజెంట్ ఆత్రేయ ఫిలాసఫీ. నవీన్ పొలిశెట్టి జర్నీని గమనిస్తే ఇలాంటి థియరీనే తన లైఫ్‌లోనూ పాటించినట్టున్నారు. యూట్యూబ్ వీడియోలతో మొదలయి, సినిమాల్లో అవకాశాల కోసం ఓపికగా ఎదురు చూశారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో హీరోగా పరిచయం అయ్యారు నవీన్ పొలిశెట్టి. ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం అందుకున్న సినిమా ‘ఏజెంట్.. ఆత్రేయ’. వన్ మ్యాన్ షోగా సినిమాను నడిపించారు నవీన్. ప్రస్తుతం ‘జాతి రత్నాలు’లో నటిస్తున్నారు. ► అన్నయ్యేమో యూత్ క్రేజీ స్టార్. ఏం చేసినా సెన్సేషనే. ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలో పరిచయం అయ్యేటప్పుడు అంచనాలుండటం సహజం. ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంట్రీ ఇచ్చారు ఆనంద్ దేవరకొండ.. బ్రదర్ ఆఫ్ విజయ్ దేవరకొండ. ‘దొరసాని’ అంటూ ఓ కొత్త తరహా ప్రేమకథను ప్రేక్షకులకు చూపించారు. స్టార్ అన్నయ్య తమ్ముడు కాబట్టి ఎంట్రీ ఈజీ అయింది. ప్రస్తుతం రెండు, మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు ఆనంద్. ఇలా ఈ ఏడాది పరిచయమైన హీరోల్లో ప్రేక్షకులకు ఎక్కువ రీచ్ అయినది ఈ ఇద్దరే అని చెప్పొచ్చు. ఆ ఆరుగురు... ఈ ఏడాది చాలామంది డైరెక్టర్లు పరిచయం అయ్యారు. అయితే సక్సెస్ పర్సంటేజ్ పరంగా ఎక్కువగా రీచ్ అయినవారి గురించి ప్రస్తావించాలంటే.. ‘డియర్ కామ్రేడ్’తో భరత్ కమ్మ, ‘ఎవరు’తో వెంకట్ రామ్‌జీ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో స్వరూప్ ఆర్ఎస్జే, ‘దొరసాని’తో కేవీఆర్ మహేంద్ర, ‘మల్లేశం’తో రాజ్.ఆర్, ‘రాజావారు రాణిగారు’తో రవికిరణ్ దర్శకులుగా పరిచయం అయ్యారు. హిట్ కొట్టారు. నెక్ట్స్ సినిమా ఏం చేస్తారు? అనే ఆలోచన ప్రేక్షకుడిలో కలిగించడంలో సక్సెస్ అయ్యారు. లైంగిక వేధింపులు, లైంగిక హింస.. ప్రస్తుతం మాట్లాడాల్సిన విషయాలు. అవగాహన కలిగించాల్సిన సమయం. ఇలాంటి కథతో ‘డియర్ కామ్రేడ్’ కథను చెప్పారు భరత్ కమ్మ. ఈ ఏడాది మన దేశం నుంచి ఆస్కార్‌కు పంపే సినిమాల లిస్ట్‌లో ‘డియర్ కామ్రేడ్’ కూడా ఉండటం విశేషం. ‘డిటెక్టివ్’ కథలు తెలుగులో వచ్చి చాలా కాలం అయింది. అలాంటి సీరియస్ డిటెక్టివ్ కథకు హ్యూమర్ జత చేసి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో బాక్సాఫీస్‌కి కితకితలు పెట్టారు స్వరూప్. ఈ అల్లరి ఏజెంట్ అందరినీ నవ్వించి, అందరికీ నచ్చేశాడు. ఏజెంట్‌ను ఓ ఫ్రాంచైజీగా కొనసాగించే ఆలోచన ఉందని దర్శకుడు ఓ సందర్భంలో తెలిపారు. ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి తెలంగాణ ప్రాంతంలో 1980లలో జరిగే అపురూపమైన ప్రేమకథగా ‘దొరసాని’ చిత్రాన్ని తెరకెక్కించారు మహేంద్ర. ఈ కథను మూడేళ్లు పాటు సుమారు 42 వెర్షన్లు రాసినట్టు దర్శకుడు పేర్కొన్నారు. కథ 1980లలో జరిగేట్టు చూపించడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. చిన్న బడ్జెట్ సూపర్ స్టార్ అడివి శేష్ ఈ ఏడాది మరో కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. ఫ్రెంచ్ సినిమా ‘ది ఇన్వెజిబుల్ గెస్ట్’ కథను తీసుకుని అద్భుతంగా మన భారతీయతను జోడించి ‘ఎవరు’గా తీశారు దర్శకుడు వెంకట్ రామ్ జీ. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకుల గోళ్లు ఏమాత్రం మిగలకుండా పూర్తిగా కొరికేసుకునే రేంజ్ థ్రిల్లర్ తీయడంలో పక్కాగా సక్సెస్ అయ్యారు రామ్‌జీ. మరో మీడియమ్ బడ్జెట్ హిట్‌ను అడవి శేష్ హిట్ లిస్ట్‌లోకి అందించారు రామ్‌జీ. ఎన్ని కమర్షియల్ సినిమాలొచ్చినా, కాన్సెప్ట్ చిత్రాలొచ్చినా మన కథలు, మన సంస్కృతులను గుర్తు చేసే సినిమాలు ప్రత్యేకం.. అవసరం. అమ్మ కష్టాన్ని చూడలేక ఆసు యంత్రాన్ని కనిపెట్టిన సూపర్ హీరో ‘చింతకింది మల్లేశం’ జీవితకథను ‘మల్లేశం’గా తెరకెక్కించారు రాజ్ ఆర్. నిజాయతీగా కథను చెప్పిన తీరు ప్రశంసలు అందుకుంది. కొత్త దర్శకులకు ప్రియమైన జానర్లో ప్రేమకథ ఎప్పుడూ ముందుంటుంది. ఆ పాత ఫార్ములాను ఎంత కొత్తగా చెప్పడం అనేదాన్ని బట్టి దర్శకుడి ప్రతిభ దాగి ఉంటుంది. ‘రాజావారు రాణిగారు’ అనే పల్లెటూరి ప్రేమకథను కనువిందుగా చూపించారు దర్శకుడు రవికిరణ్. దర్శకుల్లో ఈ ఆరుగురి రీచ్ బాగుందనొచ్చు. మెరిసిన నాయికలు తెలుగు మూలాలున్న అమ్మాయి ఐశ్వర్యా రాజేశ్. తమిళంలో మంచి పేరు సంపాదించారు. తమిళంలో ఆమె నటించిన సూపర్ హిట్ చిత్రం ‘కణా’. ఈ చిత్రం రీమేక్ ‘కౌసల్య కృష్ణమూర్తి’తో తెలుగులో పరిచయం అయ్యారామె. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పూర్తి చేసి, నానీతో ‘టక్ జగదీష్’ కమిట్ అయ్యారు. కన్నడంలో మంచి ఫెర్ఫార్మర్ అనిపించుకున్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో ‘జెర్సీ’తో ఎంట్రీ ఇచ్చారు. నాని పాత్రకు దీటుగా నటించి ఆడియన్స్‌లో ఆసక్తి కలిగించారు. ప్రస్తుతం ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేశారామె. రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన శివాత్మికా రాజశేఖర్ ‘దొరసాని’లో మంచి నటనను కనబరిచారు. అలానే ‘గద్దలకొండ గణేష్’లో మృణాలినీ రవి, ‘గ్యాంగ్ లీడర్’లో ప్రియాంకా మోహనన్ ప్రేక్షకుడి అటెన్షన్ రాబట్టగలిగారు. పేరు రావడం.. రాకపోవడం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. సినిమా హిట్ వారి వారి కెరీర్‌ని నిర్ణయిస్తుంది. ఈ ఏడాది పెద్దగా గుర్తింపు తెచ్చుకోనివారికి 2020 కలిసొస్తుందేమో. అలాగే ఈ ఏడాది ఎక్కువగా రీచ్ అయినవారు వచ్చే ఏడాది ఇంకా విజయాలు చూస్తారేమో. – గౌతమ్ మల్లాది -
ఏజెంట్ సంతానం?
ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) నెల్లూరు బ్రాంచ్‌లో కేసులు సాల్వ్ చేశారు ఏజెంట్ ఆత్రేయ. ఇప్పుడు ఈ బ్యూరో చెన్నైలో కూడా ఓపెన్ కానుందని తెలిసింది. మరి అక్కడి కేసులను ఎవరు సాల్వ్ చేస్తారంటే... ఏజెంట్ సంతానం అని తెలిసింది. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన డిటెక్టివ్ చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. కామెడీ ఏజెంట్‌గా కితకితలు పెట్టారు నవీన్. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని తెలిసింది. నవీన్ పాత్రలో తమిళ హాస్య నటుడు సంతానం కనిపించనున్నారట. దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. -
తమిళంలో ‘ఏజెంట్ సాయి’ రీమేక్
తెలుగులో కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఇందులో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి తొలి చిత్రంతోనే హిట్ సాధించాడు. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమాపై తమిళ ఇండస్ట్రీ కన్నుపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం తమిళంలో రీమేక్ చేయనున్నారని టాక్. వంజగర్ ఉలగం అనే క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన దర్శకుడు మజోజ్ బీదా ఈ సినిమాను డైరెక్షన్ చేయనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక తారాగణాన్ని త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది. ఇక ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా విషయానికి వస్తే అనాథ శవాల మిస్టరీని చేధించడానికి వెళ్లిన ఏజెంట్ సాయి చిక్కుల్లో పడతాడు. ఈ క్రమంలో అతను వాటి నుంచి ఎలా బయటపడతాడు.. ఆ మిస్టరీని ఎలా చేధించాడన్నదే మిగతా కథ. తెలుగులో హిట్‌టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం హిందీలో కూడా తెరకెక్కించే అవకాశాలు లేకపోలేదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది రెండు భాషల్లోనూ ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇక తనదైన కామెడీతో ఎన్నో హిట్లు సాధించిన సంతానం గత కొంతకాలంగా వరుస ఫ్లాప్(దిల్లుక్కు దుడ్డు 2, ఏ1)లతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా సంతానం విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. -
బిజీ అవుతోన్న ‘ఏజెంట్’
చాలా కాలం తరువాత తెలుగు తెర మీద వచ్చిన డిటెక్టివ్ తరహా సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాతో క్యారెక్టర్ నటుడు నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అశ్వనీదత్ కుమార్తె స్వప్న నిర్మించనున్న సినిమాలో నవీన్ నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నిర్మాతలు కూడా నవీన్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది, ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ పొలిశెట్టి ఆ సక్సెస్ ట్రాక్‌ను ఏ మేరకు కంటిన్యూ చేస్తాడో చూడాలి. -
ఏజెంట్ కంటిన్యూ అవుతాడు
స్వధర్మ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై నవీన్ పొలిశెట్టి, శృతిశర్మ జంటగా స్వరూప్ ఆర్ ఎస్‌జె దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘ఈ సక్సెస్ మా టీమ్ రెండున్నరేళ్ల కష్టం. సినిమా రిలీజ్ వరకు ఫుల్ టెన్షన్ పడ్డాం. అసలు రెండు, మూడు థియేటర్స్ దొరుకుతాయో లేదో అనుకున్నాం. అయితే మా సినిమా 70 థియేటర్లలో విడుదలైంది. విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెడుతున్నాం. విజయ్ దేవరకొండ మొదటి నుండి మమ్మల్ని సపోర్ట్ చేశారు. బన్నీ (అల్లు అర్జున్) ట్వీట్ చేయటంతో పాటు మమ్మల్ని పిలిచి ఓ అరగంట మాట్లాడారు. నేనీ రోజు ఇక్కడ నిలబడి ఉండటానికి కారణం మా దర్శకుడు స్వరూప్, నిర్మాత రాహులే’’ అన్నారు. స్వరూప్ మాట్లాడుతూ– ‘‘డిజిటల్ మాద్యమం పెరగిన తర్వాత కూడా మా సినిమా మూడో వారంలోకి రావటం ఆనందంగా ఉంది. ఏజెంట్‌కు పార్ట్–2 ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. మేం ఉన్నంతకాలం ఈ సినిమాకు ఫ్రాంచైజీ వస్తూనే ఉంటుంది’’ అన్నారు. రాహుల్ మాట్లాడుతూ– ‘‘సినిమాపై చాలామందికి అపనమ్మకాలు ఉండేవి. వాటన్నింటినీ దాటుకొని ఈ రోజు సినిమా హిట్ అవటం హ్యాపీగా ఉంది. థియేటర్స్ అడిగినప్పుడు ఫస్ట్ షోకు తీసేసే సినిమాకు థియేటర్స్ ఎందుకు? అన్నారు. సినిమా తీయటం కంటే రిలీజ్ చేయటం కష్టం. రేపు రిలీజ్ అన్నప్పుడు కూడా టెన్షన్ పడ్డాను’’ అన్నారు. -
‘ఫస్ట్షోకి తీసేసే సినిమా అన్నారు’
స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ జూన్ 21న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సక్సెస్ మీట్లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ - ‘నేను ఐపీయస్ ఆఫీసర్ని కావాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఓ సందర్భంలో గౌతమ్‌ను కలిసిన తర్వాత ప్రొడ్యూసర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. అలా నా జర్నీ మొదలైంది. సినిమా మంచి విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. సినిమాపై చాలా మందికి చాలా అనుమానాలుండేవి. వాటన్నింటినీ దాటుకుని ఈరోజు సక్సెస్‌ను సాధించాం. ఈ సినిమాను నేను నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా టాలెంట్ ఉన్న నవీన్‌ని నేను హీరోగా పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఏడాదిన్నర జర్నీ ఇది. థియేటర్స్‌ను అడిగినప్పుడు ఫస్ట్షోకి తీసేసే సినిమాకు థియేటర్స్ ఎందుకు? అని కూడా ప్రశ్నించిన వారున్నారు. సినిమా మూడో వారం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమాను చేయడం కంటే రిలీజ్ చేయడం ఇంకా కష్టం. రేపు రిలీజ్ అన్నా టెన్షన్ పడ్డాం. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’ అన్నారు. డైరెక్టర్ స్వరూప్ రాజ్ మాట్లాడుతూ -‘నా డైరెక్షన్‌టీమ్‌లో చాలా మంది నాకు బలమైన సపోర్ట్ ఇచ్చారు. వారు లేకపోతే ఈ సినిమాను ఇంత బాగా చేసుండేవాడిని కానేమో. డిజిటల్ మాధ్యమం పెరిగిన తర్వాత కూడా మా సినిమా మూడో వారం రన్ అవుతుండటం ఆనందంగా ఉంది. రిలీజ్ ముందు నేను, రాహుల్ ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. నవీన్‌తోనే సినిమా చేయాలని నేను నిర్ణయించుకునే కథను రాసుకున్నాను. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయకు పార్ట్ 2 ఎప్పుడో అని చాలా మంది అడిగారు. కానీ నేను ఇప్పుడు చెబుతున్నాను. మేం ఉన్నంత కాలం ఈ సినిమాకు ఫ్రాంచైజీ వస్తూనే ఉంటుంది’ అన్నారు. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ - ‘ఈ సినిమా మా రెండున్నరేళ్ల కష్టం. ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తండ్రి అత్తారింటికి పంపేటప్పుడు ఎంత బాధపడతాడో.. మేం కూడా అంతే బాధతో ప్రేక్షకుల దగ్గరకు పంపాం. కానీ తెలుగు ప్రేక్షకులు చాలా ప్రేమ, గౌరవంతో మా అమ్మాయిని ఆహ్వానించారు. ప్రపంచంలో ఎన్నో ఫిలిం ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎంతో మంది ఆడియెన్స్ సినిమా చూస్తారు. కానీ తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించేలా మరెవరూ ప్రేమించలేరని మా అందరికీ తెలుసు. ఇది మాకు దొరికిన వరం. సినిమా రిలీజ్ వరకు మాకు టెన్షన్ పడ్డాం. యు.ఎస్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందని తెలిసింది. మాకు అమెరికాలోని తెలుగు ఆడియెన్స్ మాకు స్ఫూర్తినిచ్చారు. అదే రెస్పాన్స్ ఇక్కడి ప్రేక్షకుల నుండి కూడా వచ్చింది. అసలు రెండు మూడు థియేటర్స్ అయినా దొరుకుతాయో లేదోనని సందేహం ఉండేది. కానీ.. 60-70 థియేటర్స్‌లో షో పడింది. ఇప్పుడు విజయవంతంగా మూడో వారంలోకి సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంచి రెస్సాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ సినిమాకు ముందు నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. రాఘవేంద్రరావుగారు కూడా అభినందించారు. బన్నీగారు ట్వీట్ చేయడంతో పాటు మమ్మల్ని పిలిచి అరగంట మాట్లాడారు. నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉండటానికి కారణం స్వరూప్, నిర్మాత రాహుల్‌గారి నమ్మకమే. నేను హీరోగా సినిమా చేయాలనే కోరిక ఈరోజు తీరింది. కొత్త ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఇంకా ఎక్కువగా కష్టపడతాను’ అన్నారు. -
‘ఏజెంట్’ను మెచ్చుకున్న బన్నీ
డిఫరంట్ స్టోరీ, స్క్రీన్‌ప్లేతో హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. కమర్షియల్ హంగులు దిద్దుతూనే కొత్తదనం చూపించాలంటే దర్శకుడికి ఎంతో ప్రతిభ ఉండాలి. ఈ మధ్య వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రేక్షకులనే కాదు సెలబ్రెటీలను సైతం మెప్పించింది. తాజాగా ఈ చిత్రంపై స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రశంసలజల్లు కురిపించారు. రీసెంట్గా ఈ మూవీని చూసిన బన్నీ.. సోషల్ మీడియాలో వేదికగా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని చూశాను. ఇదొక మంచి హ్యూమర్‌తో కూడిన థ్రిల్లర్ మూవీ. కొత్త టాలెంట్ టాలీవుడ్‌కు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా తరుపును చిత్రబృందానికి కంగ్రాట్స్. థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారు.. తప్పకుండా చూడాల్సిన చిత్రం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్లో బన్నీ బిజీగా ఉన్నాడు. -
మేకింగ్ ఆఫ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
-
సివిల్స్ ప్లాప్.. సినిమా హిట్..!
అతనికి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు.. చిత్రసీమతో అనుబంధం గాని.. అనుభవం గానీ అసలే లేవు. అనుకోకుండా నిర్మాతగా మారి సరికొత్త కథలను తెరకెక్కిస్తున్నాడు నగరానికి చెందిన యువ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. సుమంత్ హీరోగా ‘మళ్ళీరావా’ అంటూ డీసెంట్ హిట్ కొట్టి.. రీసెంట్గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌తో పాటు హిట్ అందుకున్నాడు. బీటెక్ చదువుకుని సివిల్స్‌లో ఇంటర్వ్యూ దాకా వెళ్లిన హైదరాబాదీ రాహుల్ యాదవ్ తన సినీ ప్రస్థానాన్ని, అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. సిటీలో వనస్థలిపురం నా అడ్డా. నాన్న ఉమేష్‌కుమార్ యాదవ్ వ్యాపారి. అమ్మ సావిత్రి గృహిణి. ఇక్కడే బీటెక్ పూర్తి చేశాను. మూడు సార్లు సివిల్స్‌లో ఇంటర్వ్యూ దాకా వెళ్లి అదృష్టం లేక అక్కడే ఆగిపోయాను. ఏదైనా కొత్త రంగంలోకి వెళ్లి అక్కడ విషయాలను తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. అందులో విజయం సాధించడమంటే ఇంకా ఇష్టం. సివిల్స్ మిస్సయ్యాక నా ఫ్రెండ్ తను చేస్తున్న రైల్వే ప్రాజెక్ట్‌లోకి రమ్మని ఆహ్వానించాడు. నాకు సంబంధం లేని వ్యాపార రంగం.. అందులోనూ రైల్వే. ఛాలెంజింగ్ అనిపించి ఆ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా చేరాను. సంవత్సరం పాటు అక్కడే ఉండి రైల్వే లైన్‌ను సక్సెస్ఫుల్ చేశాం. పాప పుట్టాక సిటీకి వచ్చేశాను. ‘హైదరాబాద్ ఎన్జీఓస్’ గ్రూప్‌లో ఉంటూ అక్కడ స్టార్టప్స్ గురించి తెలుసుకునేవాడిని. అలా చాలా వ్యాపారాలపై అవగాహన పెంచుకున్నాను. అలా నిర్మాతగా మారాను.. కామన్ ఫ్రెండ్స్ ద్వారా దర్శకుడు గౌతం తిన్ననూరి పరిచయమయ్యాడు. నాకు సినిమాలు చూడ్డం తప్ప ఆ ప్రపంచం అంతా కొత్త. అయితే, బుక్స్ బాగా చదువుతాను. గౌతం రాసుకున్న కథ, స్క్రిప్ట్(మళ్ళీరావా) నేను చదివాను. అతడు చెప్పాలనుకున్న పాయింట్, స్క్రీన్‌ప్లే చాలా బాగా నచ్చింది. గౌతం కథ బాగున్నా నిర్మాతగా ఎవరూ ముందుకు రావట్లేదు. దాంతో నేనే నిర్మాతగా మారాలనుకున్నా. సినిమా నిర్మాణంలో సగభాగం నేను నిర్మాతగా ఉంటాను. మరో నిర్మాతతో కలిసి సినిమా చేద్దాం అని చెప్పాడు. గౌతం కూడా చాలా ట్రై చేశాడు. కానీ ఎవరూ ముందుకు రాకపోయేసరికి నేనే పూర్తి స్థాయి నిర్మాతగా మారాల్సి వచ్చింది. ‘ఏజెంట్ స్పై థ్రిల్లర్’తో వచ్చా.. మళ్ళీరావా తర్వాత చాలా కథలు విన్నాను. కానీ కొత్తదనం అనిపించలేదు. దర్శకుడు స్వరూప్, నటుడు నవీన్ పొలిశెట్టి మిత్రులు. స్వరూప్ రాసుకున్న కథను నాకు చెప్పాడు.. థ్రిల్లింగ్‌గా అనిపించింది. స్పై సినిమాలు వస్తుంటాయి. కానీ తెలుగుతో లోకల్ ఏజెంట్‌గా స్పై థ్రిల్లింగ్ మూవీలు వచ్చి చాలా ఏళ్లయింది. మెగాస్టార్ చిరంజీవి ‘చంటబ్బాయి’ తర్వాత కామెడీతో పాటు థ్రిల్లర్ మూవీలు రాలేదు. కథ కొత్తగా.. చాలా బాగుంది. నవీన్ హైదరాబాదీ. భోపాల్ ఎన్ఐటీలో చదివి అక్కడే యూట్యూబ్ చానల్లో తన సత్తాను చాటాడు. తెలుగువాడు బాలీవుడ్ సోషల్ మీడియాలో సక్సెస్ అవడం అంటే మామూలు విషయం కాదు. నవీన్‌లో ఈజ్‌తో పాటు అన్ని షేడ్స్ ఉన్నాయి. నవీన్–స్వరూప్ కథలోని కొన్ని మలుపులు, కొత్తదనంతో ఫైనల్ స్క్రిప్ట్‌తో రెడీ అయ్యారు. నెల్లూరులోనే పూర్తి షూటింగ్.. 65 శాతం కొత్తవాళ్లతో వైవిద్యంగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ టైటిల్ పెట్టాం. నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.. అక్కడే షూటింగ్. అనుకున్న ప్రకారం సినిమాను పూర్తి చేశాంగానీ రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. బడా డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి పెదవి విరిచారు. నమ్మకం లేదని తేల్చి చెప్పారు. దాంతో మేమే సొంతంగా రిలీజ్ చేసుకున్నాం. సిటీలో మొదటి రోజు 9 షోలతో రిలీజ్ చేశాం. సాయంత్రానికి విమర్శకుల ప్రశంశలతో పాటు సినిమా అభిమానులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆదివారానికి 64 షోలు నగరంలో పడ్డాయి. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటారని మరోసారి రుజువు చేశారు. ఇండస్ట్రీలో కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు అందించాలి. టాలెంట్‌కే నా ఓటు. కొత్త కథతో ఎవరు వచ్చినా ప్రోత్సహిస్తాను. వైవిధ్య కథలతో ప్రేక్షకుల మెప్పు పొంది తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచాలన్నది నా ప్రయత్నం.. అంటూ ముగించారు రాహుల్ యాదవ్. మొదటిసారి భయమేసింది.. ‘మళ్ళీరావా’ కథను హీరో సుమంత్‌కి చెప్పాం. తనకి బాగా నచ్చి చేద్దామన్నాడు. కానీ ఎక్కడో చిన్న భయం. అనుకున్న బడ్జెట్ దాటిపోతుందనుకున్నాం. ఈ విషయాన్ని సుమంత్‌కి చెబితే.. తను మాలోని భయాన్ని పోగొట్టి సినిమాకు చాలా సహకరించారు. అనుకున్న బడ్జెట్ కన్నా తక్కువలోనే పూర్తి చేశాం. వీటి తర్వాత రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ సినిమా మీదున్న నమ్మకంతో మేమే రిలీజ్ చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. భారీ లాభాలు రాకపోయినా లాభాలతో కొత్తగా చిత్రాన్ని నిర్మించామన్న సంతృప్తి మిగిలింది. నాలో సినిమాపై నమ్మకాన్ని, ధైర్యాన్ని రెట్టింపు చేసింది.-సత్య గడేకారి -
ఫిక్షనల్ కాదు ఒరిజినల్ బ్లాక్‌బస్టర్
నవీన్ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తూ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. చాలా కాలం తరువాత డిటెక్టివ్ తరహా కథతో రూపొందించిన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా నవీన్ నటన, స్వరూప్ టేకింగ్‌ను సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. (మూవీ రివ్యూ : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ) గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లో పది కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఫిక్షనల్ కాదు ఒరిజినల్ బ్లాక్ బస్టర్ అంటూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మళ్లీరావా సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన రాహుల్‌యాదవ్ నక్కా ఈ సినిమాతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. -
గ్యాంగ్ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసిన చిత్రయూనిట్ అనుకున్న సమయానికి సినిమాను రెడీ చేసేందుకు కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్‌కు విచిత్రమైన సమస్య ఎదురైంది. గ్యాంగ్ లీడర్ లైన్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా లైన్‌ను పోలి ఉంటుందట. ముఖ్యంగా కొన్ని ట్విస్ట్‌లు ఒకేలా ఉండటంతో ఇప్పుడు కథలో మార్పులు చేసుందుకు రెడీ అవుతున్నారట. అయితే ఈ సమయంలో మార్పులు చేర్పులు చేస్తే అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంతవరకు స్పందించలేదు. -
ది గ్రేట్ తెలుగు బ్రాండ్
ఇంగ్లిష్ వాళ్లకు ‘జేమ్స్‌బాండ్’ ఉన్నాడు. హిందీ వాళ్ళకు ‘టైగర్’ ఉన్నాడు. మరి తెలుగు వాళ్లకు? నెల్లూరు నుంచి ‘ఏజెంట్ ఆత్రేయ’ దొరికాడు. ఈ క్యారెక్టర్‌తో సిరీస్‌గా ఎన్ని సినిమాలైనా తీయవచ్చు. ఈ క్యారెక్టర్ని స్క్రీన్ ఐకాన్‌గా మార్చవచ్చు.మనకు డిటెక్టివ్ రచయితలు ఉన్నారు కానీ డిటెక్టివ్ హీరోలు లేరు. కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, మధుబాబు, పానుగంటి వీరంతా తెలుగులో డిటెక్టివ్ సాహిత్యం లేదా ‘సీక్రెట్ ఏజెంట్’ సాహిత్యం సృష్టించారు. వీళ్లు సృష్టించిన డిటెక్టివ్లు ‘డిటెక్టివ్ వాలి’, ‘యుగంధర్’, ‘షాడో’, ‘బుల్లెట్’ వీరంతా పాఠకులకు ఇష్టులు. హీరోలు.బెంగాలీ సాహిత్యం తెలుగు సాహిత్యం మీద ప్రభావం చూపుతున్న 1950ల కాలంలో బెంగాలీలో విపరీతంగా వస్తున్న డిటెక్టివ్ సాహిత్యానికి ప్రభావితమైన తెలుగువారు ఉన్నారు. చక్రపాణి వంటివారు అందుకే ‘మిస్సమ్మ’లో తొలి లోకల్ డిటెక్టివ్‌ను చూపించారు. మిస్సమ్మలో అక్కినేని స్కూల్ సూపర్వైజర్ కమ్ డిటెక్టివ్. ఎప్పుడూ హ్యాట్, చేతిలో స్టిక్, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. ప్రతి డిటెక్టివ్‌కు ఒక అసిస్టెంట్ ఉన్నట్టే అక్కినేనికి కూడా అంజిగాడు అసిస్టెంట్‌గా ఉంటాడు. మిన్ను విరిగి మీద పడినా అతడు చలించకుండా ఏదో నోట్ చేసుకుంటూ ఉంటాడు. అక్కినేని చేసిన ఈ పాత్ర ఎంత హాస్యం పండించినా తుదకు సావిత్రే మిస్సమ్మ అని తేల్చడంలో కీలకంగా మారి తన వృత్తి ధర్మానికి న్యాయం చేకూర్చింది. అక్కినేని టాలెంట్ వల్ల ఆ పాత్ర హిట్ అయ్యింది కాని అలాంటి పాత్రలు రిపీట్ కాలేదు. కాని సినిమా రంగంలో ఉంటూ డిటెక్టివ్ సాహిత్యాన్ని బాగా ఔపోసన పట్టినవాడు ఆరుద్ర. ఆయన చొరవతోనే ‘గూఢచారి 116’ వంటి సినిమాలు తెలుగులో సాధ్యమయ్యాయి. తెలుగు తెర మీద తొలి జేమ్స్‌బాండ్‌గా కృష్ణ ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటున్నారు. కాని ఆ తర్వాత ఆ స్థాయిలో ఏజెంట్ సినిమాలు హిట్ కాలేదు. కృష్ణ హీరోగా ‘ఏజెంట్ గోపి’, ‘రహస్య గూఢచారి’ తదితర సినిమాలు తయారయ్యాయి. చిరంజీవి హీరోగా ‘గూఢచారి నం.1’ సినిమా వచ్చింది. ఈ సందర్భంలోనే కొమ్మూరి సాంబశివరావు వీర శిష్యుడు అయిన మల్లాది వెంకటకృష్ణమూర్తి తెలుగులో లోకల్ డిటెక్టివ్ పాత్రను సృష్టించారు. ‘చంటబ్బాయ్’ నవలలో ఆయన సృష్టించిన పాండురంగారావు పాత్ర ఆ తర్వాత వెండితెర మీద చిరంజీవి పోషించడంతో ‘జేమ్స్పాండ్’ అయ్యింది. ‘చంటబ్బాయ్’ ఒక కామెడీ డ్రామాగా నిలిచింది తప్ప పూర్తిస్థాయి ఏజెంట్ సినిమా కాలేకపోయింది. ఆ తర్వాత సస్పెన్స్ సినిమాలలో ఆరితేరిన దర్శకుడు వంశీ– మోహన్‌బాబు హీరోగా ‘డిటెక్టివ్ నారద’ తీశారు. ఒక ఇంట్లో జరుగుతున్న గూడుపుఠాణీని ఆ ఇంటికి డిటెక్టివ్‌గా వచ్చిన నారద ఛేదించడం కథ. ఇందులో మోహన్‌బాబు అసిస్టెంట్ అల్లావుద్దీన్‌గా మల్లికార్జునరావు నటించాడు. ఆ సినిమా హిట్ అయితే ఎలా ఉండేదో కాని జనం నిరాదరించారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగు సినిమా ఈ లాంగ్ కోట్, నల్ల కళ్లద్దాలు, తలమీద హ్యాట్, జేబులో భూతద్దంతో తిరిగే ఏజెంట్ పాత్రను పట్టించుకోలేదు. తమిళంలో కూడా ఇదే పరిస్థితిగా ఉండగా దర్శకుడు మిష్కిన్ ‘డిటెక్టివ్’ పాత్రను మళ్లీ తెర మీదకు తెచ్చి విశాల్‌తో సూపర్ హిట్ కొట్టాడు. ఆధారాలు ఏమీ దొరక్కుండా భారీ మొత్తాలకు వ్యక్తుల అడ్డు తొలగించే ఒక కరడు కట్టిన ముఠాను డిటెక్టివ్ విశాల్ ఎలా పట్టుకున్నాడన్నది ఈ సినిమాలో మిష్కిన్ చాలా రోమాంచితంగా చూపించాడు. అయితే ఈ సినిమాలో డిటెక్టివ్‌కు అసిస్టెంట్‌గా వేసిన నటుణ్ణి హాస్యగాడిగా కాకుండా అతణ్ణి కూడా ఒక సమవుజ్జీగా దర్శకుడు చూపించాడు. తెలుగులో కూడా ఇది హిట్ కావడంతో డిటెక్టివ్ సినిమాల మూడ్ సెట్ అయ్యింది. ఇప్పుడు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఆ మూడ్‌ను స్థిరపరచడమే కాదు తెలుగు ప్రేక్షకులకు ఒక లోకల్ ఏజెంట్‌ను సక్సస్‌ఫుల్‌గా ఇచ్చింది. సాధారణంగా ఏజెంట్లు, డిటెక్టివ్లు సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తిరుగుతుంటారు. కాని ఈ సాయి శ్రీనివాస ఆత్రేయ మాత్రం కోస్తా జిల్లా అయిన నెల్లూరు చుట్టుపక్కల తిరుగుతుంటాడు. అసలు ఈ పాత్రకు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ అని పెట్టడమే ఒక నేటివిటి. ‘ఏజెంట్ విక్రమ్’లాగా పెట్టి ఫిక్షనల్ చేయకుండా సినిమాలో చెప్పినట్టు ‘నాది ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు రియల్ క్యారెక్టర్’ అనేవిధంగా చూపి ప్రేక్షకులకు దగ్గర చేశాడు దర్శకుడు స్వరూప్. ఇక హీరో నవీన్ పోలిశెట్టి అసలు సిసలు తెలుగు డిటెక్టివ్‌గా కనిపించి ఇతను కేసు ఛేదించే తీరుతాడు అనే నమ్మకం కలిగిస్తాడు. సాధారణంగా డిటెక్టివ్ కథలు నలిగిన ఇతివృత్తాలతో ఉంటాయి. కాని ఇందులో కొంచెం రియల్ క్రైమ్‌ను బేస్ చేసుకున్నారు. రైల్వే ట్రాక్‌ల దగ్గర తరచూ కనిపించే అనాథ శవాలు ఎవరివి, అవి ఎందుకు ఉంటున్నాయి, ఆ మరణాలకు కారణం ఎవరు అనేది ఈ సినిమా కథ. దీనికి ‘రెలిజియస్ క్రైమ్స్ ఇన్ ఇండియా’ అనే స్టడీ నేపథ్యం కావడం కూడా ప్రేక్షకుల్లో చైతన్యం పెంచే అంశం. చాలా తక్కువ బడ్జెట్ ఉన్నా, వనరులు తక్కువ ఉన్నా ఒక తెలుగు డిటెక్టివ్ పూనుకుంటే క్రైమ్‌ను ఛేదించే సత్తా ఉంటే ఒక జత బట్టలతో కూడా సినిమా మొత్తం నడిపి మెప్పించగలడని ఈ సినిమా నిరూపిస్తుంది. నిజానికి ఈ ఏజెంట్ పాత్రలు కత్తి మీద సాము. హిందీలో వందలకోట్ల ఖర్చుతో సల్మాన్ ఖాన్‌ను హీరోగా పెట్టి తీసిన ‘ఏక్ థా టైగర్’ కలెక్షన్ల పరంగా బాగున్నా సినిమా పెద్దగా టాక్ సంపాదించుకోలేదు. అయినప్పటికీ టైగర్ సిరీస్‌ను కంటిన్యూ చేయడానికి ‘టైగర్ జిందా హై’ తీశారు. అది ఘనవిజయం సాధించింది. కాని అంతే భారీగా సైఫ్ అలీఖాన్‌ను హీరోగా పెట్టి దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తీసిన ‘ఏజెంట్ వినోద్’ ఫ్లాప్ అయ్యింది. అలాంటి నేపథ్యంలో తెలుగు నుంచి ఒక పాత పద్మిని ప్రీమియర్ కారులో తిరిగే డిటెక్టివ్ జనానికి నచ్చడం విశేషమే. సమాజంలో నేరం పెరిగింది. నేరం చేసే మనుషులు మన ఇరుగు పొరుగే ఉంటారు అన్నంతగా వార్తలు కలవర పరుస్తున్నాయి. సైబర్ నేరాలకైతే అంతే లేదు. ఇందుకు ఆడా మగా తేడా లేదు. దొంగ ఐడీ సృష్టించి వేరే ఫొటోలు డిస్ప్లే పిక్చర్లుగా పెట్టి పెళ్లి కూతురుగా ఒక మహిళ ఒకతన్ని మోసం చేస్తే, సినిమా ప్రొడ్యూసర్‌గా మరో మహిళ మరొకతన్ని మోసం చేసిన ఘటనలు వారం రోజుల వ్యవధిలో బయటపడ్డాయి. డ్రగ్స్ సరఫరాలు నిర్వహించే ముఠాలు, హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే ముఠాలు... వీటిని ఛేదించే ఆత్రేయలు ఇవాళ చాలామంది అవసరం. ఆ ముఠాల గుట్టు బట్టబయలు చేసి ప్రేక్షకులను అలెర్ట్ చేయడం కూడా ముఖ్యం. బహుశా రాబోయే రోజుల్లో ‘ఆత్రేయ ఇన్ పూణె’, ‘ఆత్రేయ ఇన్ అమలాపురం’, ‘ఆత్రేయ ఇన్ ఫలక్‌నుమా’ అనే సినిమాలు రావచ్చు. అలాంటి సినిమాలకు చాన్స్ ఉన్న పాత్రను సృష్టించినందుకు ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ యూనిట్‌కు రీసౌండ్ వచ్చేలా చప్పట్లు కొట్టాలి. తప్పకుండా నల్ల కళ్లద్దాలు కొని గిఫ్ట్‌గా బహూకరించాలి.– కె బ్రేక్ కోసంఎదురు చూశాం– విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి, శృతీ శర్మ హీరోయిన్లుగా స్వరూప్ తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా కొసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు చిత్రాన్ని వీక్షించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విజయ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్‌గా ఉన్నప్పటి మెమొరీస్‌ను గుర్తు చేసుకున్నట్టుంది నాకు ప్రస్తుతం. నవీన్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం కలసి థియేటర్ చేశాం. కలసి యాక్టింగ్ ప్రాక్టీస్ చేశాం. మాకు బ్రేక్ ఎప్పుడు వస్తుందా? అని కలసి ఎదురు చూసే వాళ్లం. థియేటర్ చేస్తున్న రోజుల్లో నవీన్ మమ్మల్ని అందర్నీ బాగా ఎంటర్టైన్ చేసేవాడు. నాకు ‘పెళ్లి చూపులు’ సినిమాతో బ్రేక్ రావడాన్ని వాడు చాలా సంతోషించాడు. ఇప్పుడు వాడికి బ్రేక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి మరో మంచి హీరో దొరికాడు. చాలా హ్యాపీగా ఉంది. నాకు కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది (నవ్వుతూ). స్వరూప్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. రాహుల్‌గారు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. ఈ సినిమాను అందరూ చూడాలి. కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు’’ అన్నారు. -
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ రివ్యూ
-
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ జానర్ : కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తారాగణం : నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ, దర్బా అప్పాజి అంభరీష, విశ్వనాథ్ సంగీతం : మార్క్ కే రాబిన్ దర్శకత్వం : స్వరూప్ ఆర్ఎస్జే నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క టాలీవుడ్లో డిటెక్టివ్ తరహా కథలు వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు ఆ జానర్ సినిమాలంటే చంటబ్బాయి, డిటెక్టివ్ నారథ లాంటి సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఇటీవల కాలంలో విశాల్ హీరోగా తెరకెక్కిన డిటెక్టివ్ ఒక్కటే ఈ జానర్లో తెరకెక్కిన సినిమా. అందుకే నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయం అవుతూ రూపొందిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయపై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్లు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఏజెంట్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాలన్న మిషన్‌లో సక్సెస్ అయ్యాడా..? సాయి శ్రీనివాస ఆత్రేయగా నవీన్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ : ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి). నెల్లూరులో ఎఫ్‌బీఐ (ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరుతో ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. పెద్దగా కేసులు లేకపోవటంతో పోలీసులకు చిన్న చిన్న కేసుల్లో సాయం చేస్తుంటాడు. అదే సమయంలో తన ఫ్రెండ్, క్రైమ్ రిపోర్టర్ శిరీష్ భారీగా దొరుకుతున్న అనాథ శవాల గురించి చెప్పటంతో ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఓ మర్డర్ కేసులో ఆత్రేయనే అనుమానితుడిగా అరెస్ట్ చేస్తారు. జైల్లో ఉండగా తన కూతురిని ఘోరంగా మానభంగం చేసిన హత్య చేశారని ఓ వ్యక్తి ఆత్రేయకు చెపుతాడు. తన కూతురికి చనిపోయే ముందు ఫోన్ చేసిన ముగ్గురి ఫోన్ నంబర్లు ఇస్తాడు. బెయిల్‌పై రిలీజ్ అయిన ఆత్రేయ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఆ మూడు నంబర్లలో ఇద్దరి డీటెయిల్స్ మాత్రమే దొరకటంతో వారిని ఫాలో అవుతాడు. కానీ ఆత్రేయ ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే ఆ ఇద్దరు హత్యకు గురవుతారు. ఆ హత్య కేసుల్లో కూడా ఆత్రేయనే ముద్దాయిగా భావిస్తారు పోలీసులు. దీంతో మరోసారి ఆత్రేయను అరెస్ట్ చేస్తారు. అతి కష్టం మీద ఐదు రోజుల బెయిల్‌తో బయటకు వచ్చిన ఆత్రేయ ఈ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఆ అసలు ఆ హత్యలు చేసింది ఎవరు..? ఆ మూడో ఫోన్ నంబర్ ఎవరిది..? ఆ వ్యక్తి ఏమయ్యారు? అన్నదే మిగతా కథ. నటీనటులు : యూట్యూబ్ వీడియోస్‌తో పాపులర్ అయిన నవీన్ పొలిశెట్టి తొలిసారిగా హీరోగా నటించిన సినిమా సాయి శ్రీనివాస ఆత్రేయ. స్టేజ్ ఆర్టిస్ట్‌గా మంచి అనుభవం ఉన్న నవీన్, ఆత్రేయ పాత్రకు ప్రాణం పోశాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోవటంతో పాటు సీరియస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లోనూ మంచి నటన కనబరించాడు. లుక్, యాటిట్యూడ్ ఇలా ప్రతీ విషయంలోనూ పర్ఫెక్షన్ చూపించాడు. స్నేహ పాత్రలో శృతి శర్మ ఆకట్టుకున్నారు. పెద్దగా నటనకు ఆస్కారం లేకపోయినా ఉన్నంతలో పరవాలేదనిపించారు. ఇతర నటీనటులంతా దాదాపుగా కొత్తవారే. విశ్లేషణ : తెలుగు తెరమీద డిటెక్టివ్ తరహా కథలు వచ్చి చాలా కాలం అయ్యింది. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్న దర్శకుడు స్వరూప్, తొలి ప్రయత్నంలో ఆకట్టుకున్నాడు. ఇంట్రస్టింగ్ స్టోరీతో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందించాడు. అయితే ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో ఉండాల్సిన వేగం మాత్రం లోపించింది. చాలా సన్నివేశాలు సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను విసిగిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో చాలా భాగం ఆత్రేయ పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు సమయం తీసుకున్నాడు దర్శకుడు. ద్వితీయార్థంలో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లోనూ స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. మార్క్ కె రాబిన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది. తన మ్యూజిక్‌తో మార్క్ సినిమా స్థాయిని పెంచాడు. ఎడిటింగ్ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నవీన్ పొలిశెట్టి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ఎడిటింగ్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
అందుకే డిటెక్టివ్ కథకి ఓకే చెప్పా
‘‘నేను 7–8 తరగతి చదువుతున్నప్పటి నుంచే నటన, నాటకాలంటే ఇష్టం. పదో తరగతి వరకూ హైదరాబాద్‌లోనే చదివా. మా తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు భోపాల్ నిట్‌లో చేరి, ఇంజినీరింగ్ పూర్తిచేశా. యూ ట్యూబ్ నుంచి నా ప్రయాణం బిగ్ స్క్రీన్‌కి మారింది’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. స్వరూప్‌రాజ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి చెప్పిన విశేషాలు. ► బాంబేలో సినిమా అవకాశాల కోసం తిరిగేవాణ్ణి. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను కూడా. నటన బాగుంది అన్నారే కానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఫ్రెండ్స్ సలహా మేరకు స్టాండప్ కామెడీ ఆడిషన్స్‌లో పాల్గొని గెలిచా. దాంతో యూ ట్యూబ్ చానెల్లో నా వీడియోస్ పెట్టారు. ‘హానెస్ట్ వెడ్డింగ్’ బాగా వైరల్ అవడంతో పాటు పది మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ చానెల్స్‌కి ఇంత ఆదరణ ఉందని అప్పుడే తెలిసింది. ‘ఇంగ్లీష్ ఇంటర్వ్యూ’ అని మరో వీడియో వాట్సాప్‌లో బాగా వైరల్ అయింది. అది చూసిన డైరెక్టర్ స్వరూప్ రాజ్‌గారు ఫోన్ చేసి, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో డిటెక్టివ్‌గా చేస్తారా? అన్నారు. కథ వినగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ పాత్ర నాకంత నచ్చింది. పైగా తెలుగులో ఈ మధ్య డిటెక్టివ్ కథలు రాలేదు. ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని ఓకే చెప్పా. ► బెంగళూరులో థియేటర్ ఆర్ట్స్ చేశా. హైదరాబాద్‌లో ఓ థియేటర్ ఆర్ట్స్ వర్క్‌షాప్‌లో నేను, విజయ్ దేవరకొండ కలిశాం. అప్పటి నుంచి మేం ఫ్రెండ్స్. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో లీడ్ రోల్స్ కోసం ప్రయత్నిస్తే, హీరో ఆపోజిట్ గ్యాంగ్‌కి ఎంపికయ్యాం. ప్రస్తుతం హిందీలో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘చిచ్చొరే’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నాను. -
చంటబ్బాయ్ ఇష్టం
నవీన్ పొలిశెట్టి, శృతీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో అతిథిగా పాల్గొన్న సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నవీన్ నటించిన వీడియోలు కొన్ని చూశాను. మంచి యాక్టర్. తను సినిమా రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన సినిమా చంటబ్బాయ్. ఆ జానర్లో ఈ సినిమా రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా హీరో కావాలనే నా కల నెరవేరింది. రెండున్నరేళ్లు మేం కష్టపడి చేసిన హిలేరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. మా సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన సాయిధరమ్‌గారికి, నాతోనే ఈ సినిమా చేయాలని వెయిట్ చేసిన స్వరూప్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు నవీన్. ‘‘కొందరు మా సినిమా ‘చంటబ్బాయ్’లానే ఉంది అంటున్నారు. చిరంజీవిగారి ‘చంటబ్బాయ్’ ఓ క్లాసిక్. చిరంజీవి, జంధ్యాలగార్ల టైమింగ్‌ని మేం ఒక్క శాతం కూడా మ్యాచ్ చేయలేం’’ అన్నారు స్వరూప్. ‘‘ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు రాహుల్ యాదవ్. దర్శకులు గౌతమ్ తిన్ననూరి, వెంకటేశ్ మహా పాల్గొన్నారు. -
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘ఏజెంట్ ఆత్రేయ’కు సుప్రీం హీరో సాయం
డిటెక్టివ్ డ్రామాగా తెరకెక్కిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు మంచి స్పందన వస్తోంది. తాజాగా విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్దమైంది. నేటి సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు. నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని నిర్మాతలు తెలిపారు. నవీన్ పొలిశెట్టి, శ్రుతీ శర్మ నటించిన ఈ చిత్రాన్ని స్వరూప్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు మార్క్ కె. రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఆ టైటిల్ చూసి ఎవరొస్తారన్నారు?
‘‘డిటెక్టివ్ జానర్లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తెలుగులో ఈ జానర్లో సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. దాంతో డిటెక్టివ్ థ్రిల్లర్ చేశాను’’ అని స్వరూప్ ఆర్.ఎస్.జె. అన్నారు. నవీన్ పొలిశెట్టి, శృతీశర్మ జంటగా స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. నవీన్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా స్వరూప్ పంచుకున్న విశేషాలు... ► చిరంజీవిగారి ‘చంటబ్బాయి’ చిత్రం ఓ క్లాసిక్. డిటెక్టివ్ జానర్ కాబట్టి ఆ సినిమా ప్రభావం కొంచెం ఉంది. కానీ, చంటబ్బాయికి, మా ఆత్రేయకు ఎటువంటి సంబంధం లేదు. మా సినిమాలో ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. అది సినిమా చూసే తెలుసుకోవాలి. ఒక్క కేసు కూడా తన దగ్గరకు రాని ఓ డిటెక్టివ్ ఓ పెద్ద కేస్ టేకప్ చేసి, ఎలా డీల్ చేశాడన్నది చిత్ర కథ. కథను కొంచెం రివీల్ చేసినా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అవుతాయని చేయడం లేదు. ► ఈ కథ రాస్తున్నప్పుడే కొత్త హీరో అయితే బావుంటుంది అనుకున్నాను. ఆ సమయంలో నవీన్ యూట్యూబ్ వీడియోస్ కొన్ని చూశాను. తన టైమింగ్ బాగా నచ్చింది. సుమారు 7–8 నెలలు స్క్రిప్ట్‌పై కలసి వర్క్ చేశాం. స్క్రిప్ట్‌లో తన హెల్ప్ చాలా ఉంది. స్క్రిప్ట్ కుదిరాకే నిర్మాతలను కలిశాము. ► హీరోహీరోయిన్ ఇద్దరూ బాగా చేశారు. మొదట మా సినిమాకు ‘గూఢచారి’ అని టైటిల్ పెట్టాలనుకున్నాం. అది అప్పటికే వచ్చేయడంతో టైటిల్ కొత్తగా, తెలుగులోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇలాంటి టైటిల్ పెడితే సినిమాకు ఎవరు వస్తారు? అని కూడా అన్నారు. అందుకే మా సినిమా టైటిల్ మీద మేమే ఫన్నీ వీడియోస్ చేశాం. ► ఈ సినిమా తర్వాత ఏం సినిమా చేయాలో ఇంకా అనుకోలేదు. కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏ సినిమా చేసినా కామెడీ, థ్రిల్లర్ అంశాలు కచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అవే నా బలం. -
ఆత్రేయ వస్తున్నారు
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రల్లో స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ‘మళ్ళీరావా’ చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా రూపొందించిన ఈ సినిమా ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకుంది. ఈనెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. నవీన్ ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో నటించాడు. డిఫరెంట్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. మార్క్ కె.రాబిన్ సంగీతం, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు.