మళ్ళీరావా లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ను అందించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్‌టైన్మెంట్స్. తొలి సినిమాతోనే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని తన ప్రత్యేకతను చాటుకున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి రెండో ప్రయత్నంగా మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ రిలీజ్ య్యింది. స్వరూప్ ఆర్ఎస్ జే ను దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’.
యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ఆల్ ఇండియా బక్చోద్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా శృతి శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు . ‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. టైటిల్‌పోస్టర్‌లోనే సినిమా కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు. హీరో నెల్లురూ కు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ అని అర్థమవుతోంది. టైటిల్ పోస్టర్ డిజైన్ చేసిన విధానం, ‘మాకు అమెరికాలో బ్రాంచెస్ లేవు’, ‘ఆషాడం ఆఫర్స్’ స్టేట్‌మెంట్స్‌ను బట్టి సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందన్న క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment