malli raava
-
‘‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఎఫ్.బి.ఐ’
మళ్ళీరావా లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను అందించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్. తొలి సినిమాతోనే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని తన ప్రత్యేకతను చాటుకున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి రెండో ప్రయత్నంగా మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ రిలీజ్ య్యింది. స్వరూప్ ఆర్ఎస్ జే ను దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ఆల్ ఇండియా బక్చోద్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా శృతి శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు . ‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. టైటిల్పోస్టర్లోనే సినిమా కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు. హీరో నెల్లురూ కు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ అని అర్థమవుతోంది. టైటిల్ పోస్టర్ డిజైన్ చేసిన విధానం, ‘మాకు అమెరికాలో బ్రాంచెస్ లేవు’, ‘ఆషాడం ఆఫర్స్’ స్టేట్మెంట్స్ను బట్టి సినిమా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందన్న క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. -
‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్‌లుక్
మళ్ళీరావా సినిమాతో సక్సెస్‌ట్రాక్‌లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరోగా సుమంత్ వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఇదం జగత్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిన సుమంత్ మరో సినిమా సుబ్రహ్మణ్యపురం ప్రమోషన్‌ను కూడా ప్రారంభించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సుమంత్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యపురం సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమంత్ 25వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు. "To believe or not to believe" #Subrahmanyapuram . Here's the first look. Shoot almost halfway thru. Due for release this November... pic.twitter.com/eeH51PkjM6 — Sumanth (@iSumanth) 1 July 2018 -
యంగ్ హీరోతో శృతి!
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా... కెరీర్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన బ్యూటీ శృతి హాసన్. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిన ఈ భామ హిట్ వచ్చిన తరువాత కూడా ఆ ఇమేజ్ను కాపాడుకోలేకపోయారు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చిన హిట్స్ దక్కకపోవటంతో కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో నెమ్మెదిగా సినిమాలు తగ్గించేశారు. గత ఏడాది కాలంగా శృతి హాసన్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే ఇప్పుడు ఈ భామ వరుసగా తెలుగు సినిమాలకు కమిట్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో హీరోయిన్గా నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తాజాగా నాని కొత్త సినిమాలో కూడా శృతినే హీరోయిన్ గానటించనుందన్న ప్రచారం జరుగుతోంది. నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. జెర్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో పాటు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నారు శృతి హాసన్. -
మళ్ళీరావా బ్యానర్లో మరో సినిమా
మళ్ళీరావా లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను అందించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్. తొలి సినిమాతోనే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎంచుకుని తన ప్రత్యేకతను చాటుకున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుంచి రెండో ప్రయత్నంగా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు రాహుల్. ‘మళ్ళీరావా తర్వాత ఎన్నో కథలు విన్నాను,నూతన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్ జే చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాం. యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ఆల్ ఇండియా బక్చోద్ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నాం. మెంటల్ మదిలో చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం విశేషం.‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తాం’ అని నిర్మాత రాహుల్ యాదవ్ తెలిపారు. -
సుమంత్‌కు జోడిగా ఈషా?
సరైన హిట్‌లేక సతమతమవుతున్న సుమంత్‌కు మళ్ళీరావా పెద్ద ఊరటనిచ్చింది. ఇలాంటి క్లాస్‌హిట్ తర్వాత సుమంత్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మళ్ళీరావా ఇచ్చిన ఊపుతో వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు సుమంత్. అయితే తాజాగా మరో సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడు ఈ హీరో. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఈషారెబ్బాను హీరోయిన్గా ఎంపిక చేశారని సమాచారం. అమీతుమీ సినిమాలోని నటన, తన అందంతో ఈషాకు తర్వాత అవకాశాలు పెరిగాయి. ఈ భామ రీసెంట్గా అ! సినిమాలో నటించింది. ప్రస్తుతం సుమంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఉగాదికి ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు తెలస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
థ్రిల్లర్ జానర్లో ‘ఇదం జగత్’!
సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిన అక్కినేని వారసుడు సుమంత్ ఇటీవల మళ్ళీరావా సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్‌ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. మళ్ళీరావా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలకు ఓకె చెప్పాడు సుమంత్. ప్రస్తుతం అనిల్ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అంజు కురియెన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సుమంత్ ఫొటో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సుమంత్ కొత్త స్టైల్లో కనిపించనున్న ఈసినిమాకు ‘ఇదం జగత్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి – సుమంత్
సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్కా నిర్మించిన చిత్రం ‘మళ్ళీ రావా’. ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సుమంత్ మాట్లాడుతూ– ‘‘ సక్సెస్, ఫెయిల్యూర్ రెండిటిని సమానంగా తీసుకుంటాను. ‘మళ్ళీ రావా’ చాలా సంతృప్తిని ఇచ్చింది. ఈ చిత్రం ద్వారా గౌతమ్‌ను దర్శకునిగా పరిచయం చేసినందుకు గర్వంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ పాడైపోయింది, కొత్త ఫోన్ కొనాలి. సినిమాలో మ్యూజిక్ హైలైట్ అయింది. సినిమాని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘సినిమాను ఎంత నమ్మామో అంత కంటే మంచి ఫలితం లభించింది. అందరూ తమ సొంత సినిమాలా పని చేశారు. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాత. ‘‘నన్ను నమ్మిన సుమంత్ గారికి, నిర్మాతకు కృతజ్ఞతలు. ఇండస్త్రీ నుంచి ‘మంచి సినిమా చేశారు’ అంటూ అభినందనలు వస్తున్నాయి. ఇది టీమ్ సక్సెస్’’ అన్నారు గౌతమ్. చిత్రబృందానికి ‘మధుర’ శ్రీధర్ అభినందనలు తెలియజేశారు. -
నాదీ టీనేజ్ లవ్ స్టోరినే : హీరోయిన్
మళ్ళీరావా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ముద్దగుమ్మ ఆకాంక్ష సింగ్. పలు హిందీ సీరియల్స్ లో నటించిన ఆకాంక్ష తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. హీరోయిన్ గా తొలి సినిమానే ఘనవిజయం సాధించటంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆకాంక్ష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను పెళ్లయిన తరువాతే నటనను కెరీర్ గాఎంచుకున్నానని తెలిపింది ఆకాంక్ష. ఏడేళ్ల క్రితమే ఆకాంక్షకు పెళ్లైందట. 16 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడిన ఈ భామ 20 ఏళ్లకు పెళ్లి చేసుకుంది. తరువాత భర్త సహకారంలో నటనలో శిక్షణ తీసుకొని యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. మళ్ళీరావా సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆకాంక్ష తెలుగు లో బిజీ అవుతుందని భావిస్తున్నారు. -
'మళ్ళీ రావా' మూవీ రివ్యూ
టైటిల్ : మళ్ళీ రావా జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : సుమంత్, ఆకాంక్ష సింగ్,మిర్చి కిరణ్, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి ఆస్రాని సంగీతం : శ్రవణ్ భరద్వాజ్ దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క హీరోగా పదిహేనేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న అక్కినేని వారసుడు సుమంత్ కేవలం 22 సినిమాలు మాత్రమే చేశాడు. వాటిలో సక్సెస్ సాదించిన సినిమాలు మూడు నాలుగుకు మించి ఉండవు. దీంతో ఇటీవల ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గత చిత్రం నరుడా డోనరుడాతో మరోసారి నిరాశపరిచిన సుమంత్ లాంగ్ గ్యాప్ తరువాత మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'మళ్ళీ రావా' సుమంత్ కు సక్సెస్ అందించిందా..? కథ : ఈ సినిమా కార్తీక్ (సుమంత్), అంజలి (ఆకాంక్ష సింగ్)ల ప్రేమకథలు. కార్తీక్.. పద్నాలుగేళ్ల వయసులోనే అంజలితో ప్రేమలో పడతాడు. అది ప్రేమించే వయసుకాదని పెద్దలు చెప్పినా.. నాకు చిన్నప్పటి నుంచే అమ్మ, క్రికెట్, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇష్టమని తెలిసింది.. అలాగే అంజలి అంటే కూడా ఇష్టం అంటూ క్లారిటీ ఇచ్చేస్తాడు. అంజలి కూడా కార్తీక్ ను ఇష్టపడుతుంది. కానీ తన కుటుంబ సమస్యల కారణంగా కార్తీక్ ను వదిలి వెళ్లిపోతుంది. అలా వదివెళ్లిన అంజలి పదమూడేళ్ల తరువాత తిరిగి కార్తీక్ జీవితంలోకి వస్తుంది. (సాక్షి రివ్యూస్) సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ గా కార్తీక్ పనిచేస్తున్న కంపెనీకే అంజలి ప్రొజెక్ట్ మేనేజర్ గా వస్తుంది. అప్పటికీ కార్తీక్ తననే ప్రేమిస్తున్నాడని తెలుసుకొని మరోసారి కార్తీక్ తో ప్రేమలో పడుతుంది. కానీ బాధ్యత లేకుండా ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడి బతుకున్న కార్తీక్ తో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో మరోసారి కార్తీక్ కు దూరమవుతుంది. అలా దూరమైన కార్తీక్, అంజలిలు తిరిగి కలిశారా..? కార్తీక్ ప్రేమను అంజలి అర్థం చేసుకుందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్ మరోసారి ఆ ఇమేజ్ ను నిలబెట్టుకున్నాడు. అందమైన ప్రేమ కథలో హుందాగా నటించాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో అంజలిని కలిసినప్పుడు అల్లరి అబ్బాయిగా మెప్పించినా సుమంత్, తరువాత హుందాగా కనిపించి ఆకట్టుకున్నాడు. బుల్లితెర మీద మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఉత్తరాది నటి ఆకాంక్ష సింగ్ అంజలి పాత్రలో ఒదిగిపోయింది. లుక్స్ విషయంలో తెలుగమ్మాయే అనిపించిన ఈ భామ... పర్ఫామెన్స్ తోనూ మెప్పించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆకాంక్ష నటన కంటతడిపెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)ఇతర పాత్రల్లో పెద్దగా పరిచయం ఉన్న నటీనటులెవరు కనిపించలేదు. విశ్లేషణ : డబ్బుకోసం కాదు మంచి సినిమా అయితేనే సినిమా చేస్తానన్న హీరో సుమంత్ అందుకు తగ్గట్టుగా అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక వ్యక్తి జీవితంలో మూడు దశల్లో జరిగిన సంఘటనలు ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ దర్శకుడు గౌతమ్ కథ నడిపించిన విధానం ఆకట్టుకుంది. అయితే ఈ తరహా కథనం సామాన్య ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుందన్న దాని మీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. మనసును తాకే సంభాషణలతో రూపొందించిన ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి. మిర్చి కిరణ్ అండ్ గ్యాంగ్ మంచి కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్) సినిమాకు మరో బలం పాటలు. ఎక్కడ అనవసరంగా ఇరికించినట్టుగా కాకుండా కథతో పాటే నడిచే పాటలో సినిమాలో ప్రేక్షకుణ్ని మరింత ఇన్వాల్వ్ చేస్తాయి. శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రధాన పాత్రల నటన సంగీతం మైనస్ పాయింట్స్ : సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని కథనం స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
'మళ్ళీ రావా' మూవీ స్టిల్స్
-
సుమంత్ అన్న మళ్ళీ రావా పెద్ద హిట్ అవ్వాలి – అఖిల్
‘‘చిన్నప్పుడు నన్ను సుమంత్ అన్న చాలా పాంపర్ చేసేవారు. ‘మళ్ళీ రావా’ పోస్టర్స్‌లో ఆయన ఫేస్‌లో పెయిన్‌తో చాలా బాగున్నారు. ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద హిట్ అవ్వాలి. శ్రవణ్ ఇచ్చిన పాటలు బాగున్నాయి’’ అని అఖిల్ అన్నారు. శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన చిత్రం ‘మళ్ళీ రావా’ . ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకలో హీరో సుమంత్ మాట్లాడుతూ– ‘‘అఖిల్‌కి ఈ సినిమా పాటలు బాగా నచ్చాయి. శ్రవణ్ మంచి సంగీతం ఇచ్చాడు. నేనిప్పటివరకూ 22 సినిమాలు చేశాను. వాటిలో గోదావరి, గోల్కొండ హైస్కూలు సినిమాలకి చాలా దగ్గరగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘సుమంత్ ఈ సినిమా గురించి నాకు చెబుతూనే ఉన్నారు. ఈ చిత్రంలోని డైలాగులను బట్టి చూస్తే దర్శకుడు తప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారేమో అనిపిస్తోంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘పాటలు బాగా రావడానికి కారణం దర్శకుడు గౌతమ్. మధుర శ్రీధర్‌గారు, సుమంత్‌గారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు’’ అని సంగీత దర్శకుడు శ్రవణ్ చెప్పారు. ‘‘గౌతమ్ మంచి స్టోరీ రాసుకున్నారు. చాలా హానెస్ట్‌గా మేం పని చేశాం. అందుకే మంచి అవుట్‌పుట్ వచ్చింది’’ అన్నారు నిర్మాత. ‘‘నాకిది మొదటి సినిమా. ఎంతోమందికి నిర్మాతలకు కథ చెప్పినా నన్ను నమ్మి చాన్స్ ఇవ్వలేకపోయారు. రాహుల్ ముందుకు వచ్చారు. సుమంత్ గారు ఇచ్చిన నమ్మకంతోనే బాగా చేయగలిగాను’’ అన్నారు దర్శకుడు. -
మళ్ళీ రావా!
సుమంత్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మళ్ళీ రావా’. హిందీ హిట్ ‘బద్రినాద్కి దుల్హనియా’ ఫేమ్ ఆకాంక్షా సింగ్ కథానాయిక. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. గౌతమ్ మాట్లాడుతూ– ‘‘ఇది పక్కా కమర్షియల్ రొమాంటిక్ డ్రామా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మూవీ అవుట్‌పుట్ బాగా వచ్చింది. సుమంత్‌గారి కెరీర్లో బిగ్ హిట్ అవుతుంది. అవకాశం ఇచ్చిన హీరో సుమంత్, నిర్మాత రాహుల్‌కి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘30 రోజుల్లో ఒకే షెడ్యూల్లో సినిమాను కంప్లీట్ చేశాం. పది నెలల పాటు ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఆగస్ట్ 3న ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని రాహుల్ యాదవ్ అన్నారు. కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, ఎ. కార్తీక్, సాత్విక్, ప్రీతి తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.