మళ్ళీరావా సినిమాతో సక్సెస్‌ట్రాక్‌లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరోగా సుమంత్ వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఇదం జగత్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిన సుమంత్ మరో సినిమా సుబ్రహ్మణ్యపురం ప్రమోషన్‌ను కూడా ప్రారంభించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సుమంత్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యపురం సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమంత్ 25వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు.
"To believe or not to believe" #Subrahmanyapuram . Here's the first look. Shoot almost halfway thru. Due for release this November... pic.twitter.com/eeH51PkjM6
— Sumanth (@iSumanth) 1 July 2018
Comments
Please login to add a commentAdd a comment