FirstLook
-
హీరోగా మారిన యాంకర్ సుమ కొడుకు.. ఫస్ట్‌లుక్ అవుట్.. డైరెక్టర్ ఎవరంటే
స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత చదువులపై ఫోకస పెట్టాడు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లిన రోషన్ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. త్వరలో రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అయితే అది ఏ మూవీ, ఏ ప్రోడక్షన్ అనేది సస్పెన్స్‌లో ఉంది. ఈ క్రమంలో మార్చి 15న రోషన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన ఇచ్చారు మేకర్స్. చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ‘చిన్నారి పెళ్లి కూతురు 2’ నటి అంతేకాదు హీరోగా డెబ్యూ ఇస్తున్న రోషన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్ పేరేపు.. రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రం రూపొందుతోంది. పి విమల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్లో రోషన్ డిజేగా కనిపించాడు. తనయుడు లుక్‌ను షేర్ చేస్తూ సుమ మురిసిపోయింది. ‘ఎట్టకేలకు నీ కల నిజమైంది రోషన్’ అంటూ సుమ తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. Team @maheshwarimovie wishes #RoshanKanakala a very Happy Birthday 💥 #ProductionNo1 pic.twitter.com/KTmKFsMme6 — Ravikanth Perepu (@ravikanthperepu) March 15, 2023 View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) చదవండి: ఆ సంఘటన చాలా భయపెట్టింది, రెండు నెలలు నిద్రపట్టలేదు: నాని -
అనుష్క, నవీన్ పొలిశెట్టి మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ అవుట్
హీరోయిన్ అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. యు.వి.క్రియేషన్స్ పతాకంపై ‘రారా కృష్ణయ్య ఫేం’ పి మహేశ్ బాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ మూవీ టైటిల్‌ను ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’గా ఖరారు చేశారు. ఈ సందర్భంగా, అనుష్క, నవీన్ పొలిశెట్టిల లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్‌గా నవీన్, అన్విత రవళి శెట్టి అనే చెఫ్‌గా అనుష్క నటించనున్నారు. కాగా ఈ సమ్మర్‌కు తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిశ్శబ్దం తర్వాత అనుష్క, జాతిరత్నాలు తర్వాత నవీన్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩 Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz — UV Creations (@UV_Creations) March 1, 2023 -
‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, భీమ్రావ్ దొరగా జగపతిబాబు
జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్‌గా చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మించారు. ‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘రుద్రంగి నాది.. రుద్రంగి బిలాంగ్స్ టు మీ’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ వినిపిస్తుంది. జాలి, దయ లేని భీమ్ రావ్ దొరగా జగపతిబాబుని పరిచయం చేశారు. ‘‘త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి నాఫల్ రాజా సంగీతం అందిస్తున్నారు. first innings chusaru, second innings chusaru, third innnings chudabothunaru.. mee #BheemRaoDhora from #Rudrangi movie. pic.twitter.com/NWdYfmbWjR — Jaggu Bhai (@IamJagguBhai) October 3, 2022 -
పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’.. ఫస్ట్ లుక్, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
నేహ లీడ్రోల్లో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా తెరకెక్కిన చిత్రం 'లిల్లీ'. ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్యప్రాతలో నటించారు. ఈ సినిమా ద్వారా శివమ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్‌కుమార్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు ఎమోషనల్ సాంగ్‌ను దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ.. 'శివమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్యాన్సర్‌పై పోరాటంపై ఉంటుంది. క్రియేటివ్ యూనిక్ గా ఉంది. అలాగే సీనియర్ నటుడు శివ కృష్ణ సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయన మనవడు నటించిన ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. (చదవండి: న్యాచురల్ స్టార్ 'దసరా' అప్డేట్.. ఊరమాస్ లుక్‌లో నాని) నటుడు శివ కృష్ణ మాట్లాడుతూ... 'నా కెరీర్ లో చాలా మంది దర్శకులతో పని చేశా. కానీ వీవీ వినాయక్ అంత కూల్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయనతో పనిచేయడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి రావడం సంతోషం' అని అన్నారు. దర్శకుడు శివమ్ మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో లిల్లీ పాత్రలో నటించిన నేహ నా జీవితానికి టర్నింగ్ పాయింట్. 32 ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అంజలి’ సినిమానే ఈ చిత్రానికి ఇన్స్పిరేషన్' అని అన్నారు. -
అయోధ్యలో ఆది పురుష్ టీజర్, ఫస్ట్ పోస్టర్
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్-‘డార్లింగ్’ ప్రభాస్ కాంబినేషన్లో అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణ ఇతిహసం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అయితే అక్టోబర్ 2న ఆది పురుష్ టీజర్, ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయోధ్యలో రిలీజ్ చేయబుతున్నట్ల ఇప్పటికే చిత్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయోధ్యలోని సరయూ రివర్ బ్యాంక్, ఉత్తరప్రదేశ్ వేదికగా అక్టోబర్ 2న సాయంత్రం 7:11 గంటలకు ఆది పురుష్ టిజర్,, ఫస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నామంటూ వెన్యూ, టైంను ప్రకటించింది మూవీ యూనిట్. ఈ సందర్భంగా ప్రభాస్ సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ప్రభాస్ బాణం పైకి ఎత్తి చూపుతూ కనిపించాడు. కాగా ఈ సినిమాలో కృతిసనన్ సీతగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. || Aarambh || Join us as we embark on a magical journey ✨ On the Sarayu River Bank in Ayodhya, UP! #AdipurushInAyodhya Unveil the first poster and teaser of our film with us on Oct. 2 at 7:11 PM! #AdipurushTeaser #Adipurush releases IN THEATRES on January 12, 2023 pic.twitter.com/dxEOA2zhAI — Om Raut (@omraut) September 30, 2022 -
బర్త్‌డే లుక్
నటుడు కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా సోమవారం నిధీ అగర్వాల్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఈ సినిమా కోసం చేసిన కృష్ణగారి ‘యమలీల’ చిత్రంలోని ‘జుంబారే..’ సాంగ్ రీమిక్స్ వీడియోకు మంచి స్పందన వచ్చింది.. ఇప్పటి వరకూ 60 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపూటి. -
ఫస్ట్ లుక్ 20th February 2020
-
ఫస్ట్ లుక్ 18th February 2020
-
ఫస్ట్ లుక్ 10th February 2020
-
ఫస్ట్ లుక్ 7th February 2020
-
ఫస్ట్ లుక్ 6th February 2020
-
ఫస్ట్ లుక్ 5th February 2020
-
ఫస్ట్ లుక్ 6th January 2020
-
విజయ్ వర్మ ఉరఫ్ వైల్డ్ డాగ్
ఏసీపీ విజయ్ వర్మ.. కరడుకట్టిన క్రిమినల్స్‌ను ఎన్కౌంటర్ చేయడంలో స్పెషలిస్ట్. అందుకే ఆయన్ను వైల్డ్ డాగ్ అని కూడా అంటారు. విజయ్ వర్మ ఎలాంటి ఆపరేషన్లు చేపట్టారో తెలియాలంటే కాస్త టైమ్ ఉంది. నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అషిహోర్ సొల్మాన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. కొత్త టెక్నీషియన్లు, సరికొత్త ఫిల్మ్‌మేకింగ్ విధానం, కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని ఆపకూడదు. 2020 ఎగ్జయిటింగ్‌గా ఉండబోతోంది’’ అని ట్వీట్ చేశారు నాగార్జున. కాగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. వేసవిలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు కెమెరా: షానీ డియోల్, సహ న్మిరాతలు: పాషా, జగన్మోహన్ వంచా. -
ఫస్ట్ లుక్ 15th November 2019
-
ఫస్ట్ లుక్ 14th November 2019
-
ఫస్ట్ లుక్ 13th November 2019
-
ఫస్ట్ లుక్ 11th November 2019
-
ఫస్ట్ లుక్ 5th November 2019
-
ఫస్ట్ లుక్ 31st October 2019
-
ఫస్ట్ లుక్ 30th October 2019
-
ఫస్ట్ లుక్ 29th October 2019
-
ఫస్ట్ లుక్ 25th October 2019
-
ఫస్ట్ లుక్ 23rd October 2019
-
ఫస్ట్ లుక్ 22nd October 2019
-
ఫస్ట్ లుక్ 18th October 2019
-
ఫస్ట్ లుక్ 17th October 2019
-
ఫస్ట్ లుక్ 16th October 2019
-
ఫస్ట్ లుక్ 15th October 2019
-
ఫస్ట్ లుక్ 11th October 2019
-
ఫస్ట్ లుక్ 10th October 2019
-
ఫస్ట్ లుక్ 11th September 2019
-
ఫస్ట్ లుక్ 10th September 2019
-
ఫస్ట్ లుక్ 9th September 2019
-
ఫస్ట్ లుక్ 5th September 2019
-
ఫస్ట్ లుక్ 3rd September 2019
-
ఫస్ట్ లుక్ 30th August 2019
-
ఫస్ట్ లుక్ 29th August 2019
-
ఫస్ట్ లుక్ 28th August 2019
-
ఫస్ట్ లుక్ 11th July 2019
-
ఫస్ట్ లుక్ 10th July 2019
-
ఫస్ట్ లుక్ 9th July 2019
-
ఫస్ట్ లుక్ 4th July 2019
-
ఫస్ట్ లుక్ 3rd July 2019
-
ఫస్ట్ లుక్ 26th June 2019
-
ఫస్ట్ లుక్ 25th June 2019
-
ఫస్ట్ లుక్ 24th June 2019
-
ఫస్ట్ లుక్ 21st June 2019
-
ఫస్ట్ లుక్ 20th June 2019
-
ఫస్ట్ లుక్ 19th June 2019
-
ఫస్ట్ లుక్ 17th June 2019
-
ఫస్ట్ లుక్ 5th June 2019
-
ఫస్ట్ లుక్ 3rd June 2019
-
ఫస్ట్ లుక్ 29th May 2019
-
ఫస్ట్ లుక్ 28th May 2019
-
ఫస్ట్ లుక్ 27th May 2019
-
ఫస్ట్ లుక్ 1st May 2019
-
‘నా జీవితం మాత్రం రంగులమయం’
2019లో విడుదల కానున్న భారీ చిత్రాల్లో భారత్ ఒకటి. అలీ అబ్బాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పట్ల ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్‌కు కొన్ని రోజుల ముందర సల్మాన్ తన అభిమానులకు ఓ ట్రీట్ ఇచ్చాడు. భారత్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ‘నా జుట్టు, గడ్డం నెరిసిపోవచ్చు.. కానీ నా జీవితం మాత్రం చాలా రంగులమయం’ అంటూ సల్మాన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానులను ఒకింత షాక్‌కు గురిచేసింది. కారణం ఈ పోస్టర్లో సల్మాన్ 70 ఏళ్ల వృద్ధిడిలా కనిపిస్తున్నారు. సినిమాలో సల్మాన్ 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ రకాల లుక్స్‌లో కనిపిస్తారంటూ చిత్రబృందం మొదటి నుంచి చెబుతూనే ఉంది. దానిలో భాగంగానే సల్మాన్ ఇలా వృద్ధిడిగా ఉన్న గెటప్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఓ మనిషి, దేశం కలిసి చేసిన ప్రయాణం అంటూ పోస్టర్ మీద ఉన్న వ్యాఖ్యలు సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. పోస్టర్లో జాకీష్రాఫ్ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన సల్మాన్ తండ్రిగా కనింపిచనున్నారని సమాచారం. ఈ నెల 24న చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. 2014లో వచ్చిన కొరియన్ హిట్ మూవీ ‘యాన్ ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ హిందీ రీమేక్. ఈ ఏడాది ఈద్ స్పెషల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram Jitne safed baal mere sar aur dhaadi mein hain, usse kahin zyada rangeen meri zindagi rahi hain! #Bharat @bharat_thefilm @aliabbaszafar @atulreellife #BhushanKumar @katrinakaif @tabutiful @apnabhidu @sonalikul @dishapatani @whosunilgrover @norafatehi @iaasifsheikhofficial @nikhilnamit #ReelLifeProduction @skfilmsofficial @tseries.official A post shared by Salman Khan (@beingsalmankhan) on Apr 14, 2019 at 10:30pm PDT -
ఘాజీ బాబా వచ్చేశారు
‘‘బొమ్మరిల్లు, అతిథి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కిక్, మిస్టర్ పర్ఫెక్ట్, పంజా, ఎవడు, కేరింత, చీకటి రాజ్యం, ఊపిరి, గూఢచారి’ వంటి చిత్రాల రచయితగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అబ్బూరి రవిని నటుడిగా పరిచయం చేస్తున్నారు దర్శకుడు అడివి సాయికిరణ్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ఆది సాయికుమార్ హీరోగా, శషా చెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిళ్ల్ల, రావు రమేశ్ కీలకపాత్రల్లో నటించారు. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి. బిహెచ్, సతీష్ డేగలతో పాటు ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో తీవ్రవాది ‘ఘాజీ బాబా’ పాత్రలో అబ్బూరి రవి నటించారు. ఆయన ఫస్ట్ లుక్‌ను దర్శకుడు త్రివిక్రమ్ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే... అబ్బూని (అబ్బూరి రవి) విలన్‌గా పరిచయం చేయడం. నేనూ, రవి కలిసి చదువుకున్నాం. నాకు ఇష్టమైన స్నేహితుడు. కశ్మీరీ పండిట్ల సమస్య మీద సాయి కిరణ్‌గారు తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నన్ను రచయితగా లాంచ్ చేసింది త్రివిక్రమే. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’లో నా లుక్ తన చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది. అడివి సాయి కిరణ్‌తో ‘కేరింత’ సినిమాకు వర్క్ చేశా. నన్ను టెర్రరిస్ట్ (సినిమాలో పాత్రని ఉద్దేశించి) గా చూస్తాడని కలలో కూడా ఊహించలేదు (నవ్వుతూ)’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘ఘాజీ బాబా పాత్రలో నటించమని అబ్బూరి రవిగార్ని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది’’ అన్నారు సాయి కిరణ్ అడివి. ఈ చిత్రానికి కెమెరా: జయపాల్ రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రెడ్డి తుమ్మ, కో ప్రొడ్యూసర్: దామోదర్ యాదవ్ (వైజాగ్). -
మహా వివాదం!
సౌత్‌లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న హన్సిక చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆమె ప్రధానపాత్ర పోషిస్తున్న లేడీ ఒరియంటెడ్ మూవీ ‘మహా’ వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రం హన్సిక కెరీర్లో 50వది కావడం విశేషం. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. అందులో ఒక పోస్టర్లో కాషాయ వస్త్రాలు ధరించి హన్సిక ధూమపానం చేస్తున్న లుక్ ఒకటి. ఈ లుక్ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని తమిళనాడు కోర్టులో కేసు నమోదైంది. కోర్టు కూడా కేసును స్వీకరించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ వివాదంపై ‘మహా’ చిత్రబృందం ఏ విధంగా స్పందించనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. యూఆర్ జమీల్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. కరుణాకరన్, తంబి రామయ్య కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ స్వరకర్త. జిబ్రాన్ కెరీర్లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే..« ధూమపానం చేస్తున్న విజయ్ ‘సర్కార్’ చిత్ర పోస్టర్ కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. -
మహా సస్పెన్స్
కథానాయిక హన్సిక ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదకొండేళ్లు అవుతోంది. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ 11ఏళ్ల కాలంలో ఆమె ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేశారు. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘విలన్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేశారామె. ఇప్పుడు హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మహా’. హాన్సిక నటిస్తున్న 50వ చిత్రం ఇది. యూఆర్. జెమిల్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ఒక పోస్టర్లో మాస్క్‌లను చేతిలో పట్టుకుని, మరో పోస్టర్లో కుర్చీలో కూర్చొని ధూమపానం చేస్తున్న పోజుతో హన్సిక రెండు రకాలుగా కనిపించారు. ఈ సినిమా కాకుండా ‘100, తుపాకీ మునై’ హన్సిక నటించిన చిత్రాలు. ‘తుపాకీ మున్నై’ ఈ నెల 14న విడుదల కానుంది. -
మిస్టర్ గుర్కా
హాస్యనటుడు యోగిబాబు టైటిల్ రోల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. శామ్ ఆంటోని దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను హీరో శివ కార్తీకేయన్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘గుర్కా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యోగిబాబు లీడ్ రోల్ చేస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో కుక్క కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తుందని చిత్రబృందం చెబుతోంది.ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘యోగిబాబు లీడ్ రోల్లో నటిస్తున్న గుర్కా ఫస్ట్ లుక్, టైటిల్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు శివకార్తీకేయన్. ‘‘నా నెక్ట్స్ సినిమా ‘గుర్కా’ అని అనౌన్స్ చేయడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు యోగిబాబు. -
ఫస్ట్ లుక్ 12th September 2018
-
ఫస్ట్ లుక్ 3rd September 2018
-
‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్‌లుక్
మళ్ళీరావా సినిమాతో సక్సెస్‌ట్రాక్‌లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరోగా సుమంత్ వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఇదం జగత్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిన సుమంత్ మరో సినిమా సుబ్రహ్మణ్యపురం ప్రమోషన్‌ను కూడా ప్రారంభించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సుమంత్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యపురం సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమంత్ 25వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు. "To believe or not to believe" #Subrahmanyapuram . Here's the first look. Shoot almost halfway thru. Due for release this November... pic.twitter.com/eeH51PkjM6 — Sumanth (@iSumanth) 1 July 2018 -
ప్రేమలో సరికొత్త కోణం
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో సక్సెస్ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేశారు రాజ్‌తరుణ్. వరుస హిట్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘లవర్’. గాయత్రి కథానాయిక. ‘అలా ఎలా?’ వంటి హిట్ అందుకున్న అనీశ్ కృష్ణ దర్శకుడు. ‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ప్రేమలోని సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మా చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై రెండో వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: అంకిత్ తివారి, రిషి రిచ్, అర్కో, తనీశ్ బాగ్చి, సాయికార్తీక్, నేపథ్య సంగీతం: జె.బి. -
‘సంత’ సక్సెస్ కావాలి
‘‘గ్రామీణ నేపథ్యంలో చక్కని ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తీసిన చిత్రం ‘సంత’. గోరేటి వెంకన్నగారు ఓ లెజెండ్. ఆయన ఈ సినిమాకి రాసిన పాట అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ‘సంత’ సక్సెస్ కావాలి. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ట్యాగ్ లైన్. శ్రీ జై వర్ధన్ బోయెనేపల్లి నిర్మించి న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ‘రంగస్థలం’ సెట్లో సుకుమార్ విడుదల చేశారు.ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ– ‘‘ఓ సంత నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఫీల్‌గుడ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో పాటలు చిత్రీకరించాం. షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు. కిన్నెర, మధుమణి, ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ– కథనం– సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్. -
ఓటర్ పవర్!
మంచు విష్ణు ప్రశ్నించడానికి రెడీ అయ్యారు. ఓటర్‌గా తనకు ఫైట్ చేసే హక్కు ఉందంటు న్నారు. విష్ణు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఓటర్’. తమిళంలో ‘కురళ్ 388’ పేరుతో తెరకెక్కుతోంది. జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో జాన్ సుధీర్‌కుమార్ పూదోట నిర్మిస్తున్నారు. నిన్న విష్ణు బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇటు తెలుగు అటు తమిళంలో ఫస్ట్ లుక్‌కి విశేష స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘తమిళ తెరకు విష్ణు పరిచయం కావడానికి ఇది సరైన సినిమా. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులకు ఎంతో ముఖ్యమైన ఓటర్ ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఓటర్ పవర్ ఏంటో చూపించే సినిమా ఇది. యూనివర్శల్ పాయింట్ కావడంతో తమిళంలోనూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్లో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
జియో ఫోన్ ఫస్ట్ లుక్.. కానీ..
సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా మారింది. అయితే ఫోన్ లవర్స్ ముందే భయపడినట్టుగానే ఇందులో పాపులర్ మెసేజింగ్ యాప్‌లు ఫేస్బుక్, వాట్సాప్ లేవని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. తాజా నివేదికల ప్రకారం రేపటి(సెప్టెంబర్ 24) నుంచి కస్టమర్ల చేతికి అందనున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ప్లాస్టిక్‌బాడీతో రూపొందించారు. అలాగే సింగిల్ సిమ్‌తో వస్తున్న ఈ ఫోన్లో హాట్‌స్పాట్ ఫీచర్ అందుబాటులోలేదు. కీలకమైన కెమెరా విషయానికి వస్తే .. ఫోన్ ధరతో పోలిస్తే కెమెరా పనితీరు అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. ఇక డిస్ప్లేలో న్యూమరిక్ కీ బోర్డు, పైన నాలుగు బటన్స్‌ను పొందుపర్చింది. వీజీఏ కెమెరా, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2.4 అంగుళాల డిస్ప్లే, 512ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128జీబీ ఎక్స్‌పాండబుల్ జీబీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ జియో ఫీచర్ ఫోన్ ఇతర ఫీచర్లు. కాగా ఆదివారం నుంచి జియో 4 జీ ఫీచర్ ఫోన్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించనుంది. దాదాపు 60 లక్షల యూనిట్లను రాబోయే 15రోజుల్లో వినియోగదారులకు అందించనుంది. -
ఇండిపెండెన్స్ డేకి పవన్ గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా పవన్ ఇమేజ్ కు తగ్గ కథను సిద్ధం చేశాడట త్రివిక్రమ్. షూటింగ్ మొదలై చాలా రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేయలేదు. ఇంజనీర్ అల్లుడు, ఇంజనీర్ బాబు, గోపాల కృష్ణుడు లాంటి టైటిల్స్ ఫిక్స్ చేస్తారన్న టాక్ వినిపించినా.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పవర్ స్టార్ అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చిత్రయూనిట్ త్వరలోనే అభిమానుల కోరిక తీర్చేందుకు రెడీ అవుతోంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ తో పాటు పొలిటికల్ కార్యక్రమాలతోనూ పవన్ బిజీగా ఉండటంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.