Miss Shetty Mr Polishetty: Title and first look poster is out - Sakshi
Sakshi News home page

Anushka Shetty: మిస్‌ శెట్టితో మిస్టర్‌ పొలిశెట్టి.. మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ అవుట్‌

Published Thu, Mar 2 2023 10:54 AM | Last Updated on Thu, Mar 2 2023 11:33 AM

Anushka Shetty, Naveen Polishetty Movie Title And First Look Out - Sakshi

హీరోయిన్‌ అనుష్క శెట్టి, నవీన్‌ పోలిశెట్టి జంటగా ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌ సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై ‘రారా కృష్ణయ్య ఫేం’ పి మహేశ్‌ బాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ మూవీ టైటిల్‌ను ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’గా ఖరారు చేశారు.

ఈ సందర్భంగా, అనుష్క, నవీన్‌ పొలిశెట్టిల లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు. కాగా ఈ సినిమాలో సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్‌ కమెడియన్‌గా నవీన్, అన్విత రవళి శెట్టి అనే చెఫ్‌గా అనుష్క నటించనున్నారు. కాగా ఈ సమ్మర్‌కు తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిశ్శబ్దం తర్వాత అనుష్క, జాతిరత్నాలు తర్వాత నవీన్‌ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమాకు రధన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement