గాయత్రి, రాజ్‌తరుణ్
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో సక్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేశారు రాజ్‌తరుణ్. వరుస హిట్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘లవర్’. గాయత్రి కథానాయిక. ‘అలా ఎలా?’ వంటి హిట్ అందుకున్న అనీశ్ కృష్ణ దర్శకుడు.
‘దిల్’ రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ప్రేమలోని సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మా చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై రెండో వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: అంకిత్ తివారి, రిషి రిచ్, అర్కో, తనీశ్ బాగ్చి, సాయికార్తీక్, నేపథ్య సంగీతం: జె.బి.
Comments
Please login to add a commentAdd a comment