
నాగార్జున
ఏసీపీ విజయ్ వర్మ.. కరడుకట్టిన క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్ చేయడంలో స్పెషలిస్ట్. అందుకే ఆయన్ను వైల్డ్ డాగ్ అని కూడా అంటారు. విజయ్ వర్మ ఎలాంటి ఆపరేషన్లు చేపట్టారో తెలియాలంటే కాస్త టైమ్ ఉంది. నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అషిహోర్ సొల్మాన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. కొత్త టెక్నీషియన్లు, సరికొత్త ఫిల్మ్‌మేకింగ్ విధానం, కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని ఆపకూడదు. 2020 ఎగ్జయిటింగ్‌గా ఉండబోతోంది’’ అని ట్వీట్ చేశారు నాగార్జున. కాగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. వేసవిలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు కెమెరా: షానీ డియోల్, సహ న్మిరాతలు: పాషా, జగన్‌మోహన్ వంచా.
Comments
Please login to add a commentAdd a comment