జియో ఫోన్‌ ఫస్ట్‌ లుక్‌.. కానీ.. | Reliance JioPhone first impression: but.. | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 23 2017 7:57 PM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

Reliance JioPhone first impression: but.. - Sakshi

సాక్షి, ముంబై:  ఎంతో ఆస​క్తిగా ఎదురు చూస్తున్నరిలయన్స్‌ జియో  4 జీ ఫీచర్‌ ఫోన్‌ ఫస్ట్‌ లుక్‌  ఆసక్తికరంగా మారింది. అయితే ఫోన్‌ లవర్స్‌ ముందే భయపడినట్టుగానే ఇందులో  పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌లు  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌  లేవని తాజా రిపోర్ట్‌ ద్వారా తెలుస్తోంది.  ఇది  షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పాలి.

తాజా నివేదికల ప్రకారం రేప‌టి(సెప్టెంబర్‌ 24) నుంచి  కస్టమర్ల చేతికి అందనున్న జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను ప్లాస్టిక్‌బాడీతో రూపొందించారు. అలాగే   సింగిల్‌ సిమ్‌తో  వస్తున్న ఈ ఫోన్‌లో హాట్‌స్పాట్‌ ఫీచర్‌ అందుబాటులోలేదు.   కీలకమైన కెమెరా విషయానికి వస్తే .. ఫోన్‌ ధరతో పోలిస్తే  కెమెరా పనితీరు అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. ఇక డిస్‌ప్లేలో  న్యూమరిక్‌ కీ  బోర్డు, పైన నాలుగు బటన్స్‌ను పొందుపర్చింది.  

వీజీఏ కెమెరా, 2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 2.4 అంగుళాల డిస్‌ప్లే, 512ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 128జీబీ ఎక్స్‌పాండబుల్‌ జీబీ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ  జియో ఫీచర్‌ ఫోన్‌ ఇతర ఫీచర్లు. 

 
కాగా ఆదివారం నుంచి జియో 4 జీ ఫీచ‌ర్ ఫోన్ డెలివ‌రీ ప్ర‌క్రియ‌ను ప్రారంభించనుంది. దాదాపు 60 లక్షల యూనిట్లను రాబోయే 15రోజుల్లో వినియోగదారులకు అందించనుంది.  
 

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement