Jio 4G Phone
-
జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్ ఫోన్
ఇండియన్ మొబైల్ ఫోన్ మార్కెట్లో బేసిక్, ఫీచర్ మోడళ్లతో ఓ వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు జియోకు షాకిస్తూ 'నోకియా సీ01'పేరుతో 4జీ ఎంట్రీలెవల్ బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. చిప్ కొరత కారణంగా వినాయక చవితికి విడుదల కావాల్సిన జియో 4జీ స్మార్ట్‌ఫోన్ 'జియో నెక్ట్స్'ను దీపావళికి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో జియోకి పోటీగా నోకియా బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. 'నోకియా సీ01' ఫీచర్స్ దివాళీ ఫెస్టివల్ సందర్భంగా విడుదల కానున్న ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్ నోకియా సీ01లో ఆండ్రాయిడ్11(గో ఎడిషన్) వెర్షన్‌తో అందుబాటులోకి రానుంది. తక్కువ ర్యామ్, యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ వంటి లైట్ వెయిట్ యాప్స్‌ను వినియోగించేందుకు ఉపయోగపడుతుంది. ఇకఘీ ఫోన్ 5.45 అంగుళాల హెచ్డీస్క్రీన్, హై డైనమిక్ రేంజ్లో ఎల్ఈడీ ఫ్లాష్ వచ్చేలా రెండు 5 మెగా ఫిక్సెల్ కెమెరాలు, ఆక్టాకోర్ 1.6జీహెచ్‌జెడ్ యునిసోక్ SC9863A ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుండగా, మైక్రో ఎస్డీ కార్డ్ తో స్టోరేజీని పెంచుకోవచ్చు. ఫుల్ ఛార్జింగ్ పెడితే 3000 ఎంఏహెచ్ సామర్ధ్యం ఉన్న బ్యాటరీతో ఒక రోజు వినియోగించుకోవచ్చు. 'నోకియా సీ01' ధర, కలర్స్ జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా సీ01 ధర ఇండియాలో రూ.5,999 ఉండగా.. 10శాతం డిస్కౌంట్‌తో మై జియో యాప్‌లో ఈ ఫోన్‌ను రూ.5,399 సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ బ్లూ,పర్పుల్ కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది. -
ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' లాంచ్ చేసిన జియో
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫోన్ ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. గత ఏడాది గూగుల్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెక్ దిగ్గజానికి జియోలో 7.7 శాతం వాటా లభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రపంచ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు సంస్థ పేర్కొంది. జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తో వచ్చింది. దీనిని మొదట భారతదేశంలో ప్రారంభించనున్నారు. తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా బయటికి ప్రకటించలేదు. చాలా మంది మార్కెట్ నిపుణులు ఈ మొబైల్ రూ.5,000 లోపు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. రిలయన్స్ జియోకు దేశంలో 425 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. భారతదేశంలో డేటా వినియోగంలో కంపెనీ 45% వృద్ధిని నమోదు చేసింది. త్వరలో 200 మిలియన్ల కొత్త వినియోగదారులు చెరనున్నట్లు రిలయన్స్ జియో భావిస్తుంది. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫోన్ నే వాడుతున్నారు. వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన విప్లవం రాబోతుంది: భవిష్ అగర్వాల్ -
త్వరలో జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్
జియో ఈ నెలలో చవకైన 4జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. తన 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులను స్మార్ట్ఫోన్లకు తరలించే ప్రయత్నంలో భాగంగా రిలయన్స్ జియో చైనా ఫోన్ తయారీ సంస్థ వివోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ వివో వై-సిరీస్‌లో రానుందని ధర రూ.8 వేల రేంజ్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. డిస్కౌంట్లు, ఒటిటి సబ్ స్క్రిప్షన్, వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్ మెంట్ వంటి ఆఫర్లతో జియో త్వరలో 'ఎక్స్‌క్లూజివ్' స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి జియో యోచిస్తుంది. దీనికి సంబందించిన అధికారిక సమాచారం లేనప్పటికీ, ఒక నివేదిక ప్రకారం జియో వీటిని తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో కేవలం రిలయన్స్ జియో సిమ్ కార్డు మాత్రమే పనిచేసే విధంగా రూపకల్పన చేస్తుంది.(చదవండి: గెలాక్సీ నోట్ ఫోన్లకు శాంసంగ్ స్వస్తి) రిలయన్స్ జియో వివోతో పాటు కార్బన్, లావా మరియు ఇతర చైనా బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వివో ఈ మధ్యే వివో వై1ఎస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.7,990గా నిర్ణయించారు. అలాగే జియో టెక్ దిగ్గజం గూగుల్‌తో పొత్తు పెట్టుకుని తక్కువ ధర గల 4జీ ఫోన్లను వచ్చే ఏడాది తీసుకురావాలని జియో యోచిస్తోంది. రిలయన్స్ జియో 3000 నుంచి 4000 మధ్య తక్కువ ధర గల స్మార్ట్ఫోన్లను తయారు చేయడానికి ఇంతక ముందు ఐటెల్ కంపెనీతో కలిసి పనిచేసింది. జియో ప్రధాన ప్రత్యర్థి అయిన భారతి ఎయిర్టెల్ కూడా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో భాగంగా లావా, కార్బన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎయిర్ టెల్ ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది. -
జియో ఫోన్లలో వాట్సాప్: రికార్డ్ సేల్స్
సాక్షి,ముంబై: సంచలన జియో 4జీ ఫీచర్ ఫోన్ కస్టమర్లకు శుభవార్త. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ జియో ఫోన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. జియో ఫోన్లోని ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ ఇపుడిక వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు రిలయన్స్ జియో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జియో ఫోన్, జియో ఫోన్ 2 ఫోన్లను వాడుతున్న వినియోగదారులు జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం తమ ఫోన్ నంబర్లను వెరిఫై చేసుకోవడం ద్వారా జియో ఫోన్ యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అన్ని జియో ఫోన్లలో సెప్టెంబరు 20 నుంచి వాట్సాప్ అందుబాటులో ఉంటుందని జియో ఒకప్రకటనలో తెలిపింది. అంతేకాదు భారత దేశంలో జియోఫోన్ భారీ అమ్మకాలను నమోదు చేసింది పేర్కొంది. 215 మిలియన్ వినియోగదారులతో ప్రపంచ రికార్డులను సృష్టించిన జియో లాంచ్ చేసిన జియో ఫోన్ కీలక మైలురాళ్లను అధిగమించిందనీ, రూ 1,500 ధర పరిధిలో అమ్ముడైన ప్రతి 10 మొబైల్ ఫోన్లలో, 8 జియో ఫోన్లు ఉన్నాయని ప్రకటించింది. స్పెషల్ హెల్ప్‌లైన్ : మరోవైపు జియో ఫోన్‌పై సందేహాలను, సమస్యలను పరిష్కరించేందుకు 1991 హెల్ప్‌లైన్ కూడా ప్రకటించింది. కాగా యూట్యూబ్, వాట్సాప్ ,గూగుల్ మాప్స్ యాప్‌లను ఆగస్టు 15న అందుబాటులోకి తెస్తామని గతంలో జియో ప్రకటించింది. అయితే ఫేస్‌బుక్‌ను జియో ఫోన్లలో ఫేస్బుక్, యూట్యుబ్‌ను ఆవిష్కరించింది, కానీ ఒక నెల ఆలస్యంగా వాట్సాప్ యాప్‌ను జియో ఫోన్‌కు అందుబాటులోకి తీసుకురావడం విశేషం. -
జియో ఫోన్ ఫస్ట్ లుక్.. కానీ..
సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా మారింది. అయితే ఫోన్ లవర్స్ ముందే భయపడినట్టుగానే ఇందులో పాపులర్ మెసేజింగ్ యాప్‌లు ఫేస్బుక్, వాట్సాప్ లేవని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. తాజా నివేదికల ప్రకారం రేపటి(సెప్టెంబర్ 24) నుంచి కస్టమర్ల చేతికి అందనున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను ప్లాస్టిక్‌బాడీతో రూపొందించారు. అలాగే సింగిల్ సిమ్‌తో వస్తున్న ఈ ఫోన్లో హాట్‌స్పాట్ ఫీచర్ అందుబాటులోలేదు. కీలకమైన కెమెరా విషయానికి వస్తే .. ఫోన్ ధరతో పోలిస్తే కెమెరా పనితీరు అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. ఇక డిస్ప్లేలో న్యూమరిక్ కీ బోర్డు, పైన నాలుగు బటన్స్‌ను పొందుపర్చింది. వీజీఏ కెమెరా, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2.4 అంగుళాల డిస్ప్లే, 512ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128జీబీ ఎక్స్‌పాండబుల్ జీబీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ జియో ఫీచర్ ఫోన్ ఇతర ఫీచర్లు. కాగా ఆదివారం నుంచి జియో 4 జీ ఫీచర్ ఫోన్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించనుంది. దాదాపు 60 లక్షల యూనిట్లను రాబోయే 15రోజుల్లో వినియోగదారులకు అందించనుంది. -
జియో ఫోన్‌పై మరో అంచనా చక్కర్లు
ముంబై: రిలయన్స్ జియో మోస్ట్ ఎవైటెడ్ 4జీ ఫీచర్‌కు సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సె సెప్టెంబర్ నుంచి జియో వినియోగదారుల చేతుల్లో మెరవనున్న జియో 4 ఫీచర్ ఫోన్ సెక్యూరిటీ డిపాజిట్లో నిర్దేశిత కాలం కంటే ముందుగానే పాక్షికంగా చెల్లించనుందట జియో. ఈ పథకం నియమ నిబంధనలను త్వరలోనే ప్రకటించనున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో 4 జీ పీచర్ ఫోన్ కొనుగోలు సందర్భంగా కస్టమర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ మూడు సంవత్సరాల కంటే ముందే చెల్లించేందుకు రిలయన్స్ జియో యోచిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనుంది. కాగా ఇండియాస్ స్మార్ట్‌ఫోన్‌గా పిలుస్తున్న, పూర్తిగా ఉచితమైన దీనికోసం వినియోగదారులు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 1500 చెల్లించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల తరువాత ఈ నగదును కస్టమర్లకు పూర్తిగా వెనక్కి చెల్లించనున్నట్టు జియో ఫోన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ డివైస్ ప్రీ-బుకింగ్‌లు ఆగస్టు 24 న ప్రారంభమవుతాయి. మరోవైపు బహుళ-సిమ్ ఫోన్ల ప్రాబల్యం ఉన్న భారతదేశంలో ఈ ఫోన్ల అమ్మకాల్లో జియో అంచనాలను అందుకోవడం అంత ఈజీకాదని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. మల్టీ సిమ్, ప్రీ పెయిడ్ సిమ్ల వృద్ధి నెలవారీగా 5శాతంగా ఉందని వాదిస్తోంది.