
సాక్షి,ముంబై: సంచలన జియో 4జీ ఫీచర్ ఫోన్ కస‍్టమర్లకు శుభవార్త. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ జియో ఫోన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. జియో ఫోన్‌లోని ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ ఇపుడిక వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు రిలయన్స్ జియో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
జియో ఫోన్, జియో ఫోన్ 2 ఫోన్లను వాడుతున్న వినియోగదారులు జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం తమ ఫోన్ నంబర్లను వెరిఫై చేసుకోవడం ద్వారా జియో ఫోన్ యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అన్ని జియో ఫోన్లలో సెప్టెంబరు 20 నుంచి వాట్సాప్ అందుబాటులో ఉంటుందని జియో ఒకప్రకటనలో తెలిపింది. అంతేకాదు భారత దేశంలో జియోఫోన్ భారీ అమ్మకాలను నమోదు చేసింది పేర్కొంది. 215 మిలియన్ వినియోగదారులతో ప్రపంచ రికార్డులను సృష్టించిన జియో లాంచ్ చేసిన జియో ఫోన్ కీలక మైలురాళ్లను అధిగమించిందనీ, రూ 1,500 ధర పరిధిలో అమ్ముడైన ప్రతి 10 మొబైల్ ఫోన్లలో, 8 జియో ఫోన్లు ఉన్నాయని ప్రకటించింది.
స్పెషల్ హెల్ప్‌లైన్ : మరోవైపు జియో ఫోన్‌పై సందేహాలను, సమస్యలను పరిష్కరించేందుకు 1991 హెల్ప్‌లైన్ కూడా ప్రకటించింది.
కాగా యూట్యూబ్, వాట్సాప్ ,గూగుల్ మాప్స్ యాప్‌లను ఆగస్టు 15న అందుబాటులోకి తెస్తామని గతంలో జియో ప్రకటించింది. అయితే ఫేస్‌బుక్‌ను జియో ఫోన్లలో ఫేస్‌బుక్, యూట్యుబ్‌ను ఆవిష్కరించింది, కానీ ఒక నెల ఆలస్యంగా వాట్సాప్ యాప్‌ను జియో ఫోన్‌కు అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment