record sale
-
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సేల్స్‌లో రికార్డ్: ఓలాదే ఆధిపత్యం, ఎందుకో తెలుసా?
దేశీయ అతిపెద్ద ఈవీ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ మే నెలలో బంపర్ సేల్స్ సాధించింది. 35వేల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేయగా, మొత్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు రికార్డు సృష్టించడం విశేషం. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) కంపెనీ గత మూడు త్రైమాసికాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో, ఓలా మే నెలలో 30శాతం పైగా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది గత ఏడాది మే నెలలోని నమోదైన విక్రయాలతో పోలిస్తే ఏకంగా 300 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు మే 2023 నెలలో అద్భుతమైన పెరుగుదల నమోదైంది. తొలిసారిగా ఒకే నెలలో లక్ష మార్కును దాటడం విశేషం. ఏప్రిల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 57శాతం పైగా పెరిగాయి. ఈవీ అమ్మకాలకు సంబంధించి మే నెల బెస్ట్‌గా నిలిచింది. ఏథర్, ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు మేలో తమ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేశాయి. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?) అటు నెలనెలా తమ అమ్మకాలు ఆకట్టుకునే వృద్ధిని సాధించాయనీ, దేశంలో ఈవీ విప్లవానికి ఓలా లీడర్‌గా కొన సాగుతోందంటూ ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు , సీఈవో భవిష్ అగర్వాల్ సంతోషాన్ని ప్రకటించారు. బ్రాండ్‌పై కస్టమర్ విశ్వాసాన్ని, ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ, తాము జూన్ నుండి స్కూటర్ ధరలను స్వల్పంగా మాత్రమే పెంచిందన్నారు. కాగా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఓలా తన ఆఫ్‌లైన్ ఉనికిని చురుకుగా పెంచుతోంది. కంపెనీ ఇటీవలే తన 600వ ఈసీని ప్రారంభించింది. ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని యోచిస్తోంది. సేల్స్ ఎందుకు పెరిగాయి? ఫేమ్ - II సబ్సిడీకి మే చివరి నెల కావడమే అధిక విక్రయాలకు ఒక కారణం. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్టర్ అడాప్షన్ అండ్ తయారీ (FAME II) పథకం కింద, వాహన ధరలో గరిష్టంగా 40 శాతం పరిమితితో కిలోవాట్-గంటకు (kWh) రూ. 15,000 సబ్సిడీని భారత ప్రభుత్వం అందిస్తోంది. 1 జూన్ 2023 నుంచి సవరించిన అమలులోకి వస్తుంది. ఈ సబ్సిడీని రూ. 10,000కి తగ్గించింది. వాహన ధరలో 15 శాతానికి పరిమితం చేసింది. ఫలితంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలున్నాయి. -
ఎంఐ ఫాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్: బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై : భారతదేశంలో నంబర్‌వన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎదిగిన షావోమి తన దూకుడును కొనసాగిస్తోంది. బిగ్ స్ర్కీన్, బిగ్‌బ్యాటరీ, ఏఐ కెమెరాలు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్న షావోమి తాజాగా ఎంఐ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ అందించింది. బుధవారం రెడ్మి 8 లాంచింగ్ సందర్బంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు షావోమి ఎండీ మను కుమార్ జైన్. అలాగే 64ఎంపీ క్వాడ్ కెమెరా(4) లతో మరో (రెడ్మి నోట్ 8 ప్రొ ) స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతున్నట్టు చెప్పారు. ఈ నెల 16నే దీన్ని ఆవిష్కరించనున్నామని తెలిపారు. రూ. 5కోట్ల రిటర్న్ గిఫ్ట్ ఆఫర్ గత ఐదేళ్లుగా కాలంగా కస్టమర్లు తమపై చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా రూ. 500 కోట్లను తిరిగి వారికి ఇచ్చేస్తున్నట్టు షావోమి ఎండీ మనుకుమార్ జైన్ ప్రకటించారు. తొలి 50 లక్షల వినియోగదారులకు 4జీబీ వేరియంట్ అప్డేట్ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. 50 లక్షల రెడ్మి8 కొనుగోలుదారులకు రూ. 1000 విలువ (రూ. 5 కోట్లు) గల అప్డేట్ను ఉచితంగా అందిస్తుందన్నమాట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగ సీజన్లో కేవలం 7రోజుల్లో 5.3 మిలియన్ల స్మార్ట్ఫోన్ల విక్రయాలు నమోదయ్యాయని ప్రకటించారు. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ దీపావళి సేల్‌లో నిమిషానికి 525 డివైస్‌లు అమ్మినట్టు తెలిపారు. షావోమిపై వినియోగదారుల అసాధారణ ప్రేమ ఎప్పటికే ఇలాగే కొనసాగాలని మనుకుమార్ ఆశించారు. ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెడ్మి నోట్ 8 ప్రో ఫీచర్లు 6.53 అంగుళాల డిస్ప్లే, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ 120-డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో కెమెరాతో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్విక్ ఛార్జ్ 3.0 లకు మద్దతుగా 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్సి సపోర్ట్, యుఎస్బి టైప్-సి పోర్ట్,ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9 ప్రధాన ఫీచర్లు. ధర రూ. సుమారు 14,000. దీన్నిఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. Mi fans, for all the love you have given us over the last 5 years, we're giving back ₹500 Cr. The first 5 million fans will get the #Redmi8, #4GB64GB variant for ₹7,999 & people who order 3GB variant will get upgraded to a 4GB variant. Thank you! pic.twitter.com/jsOJgZcRzM — Redmi India for #MiFans (@RedmiIndia) October 9, 2019 Excited to share the biggest news that we've sold 5.3mn+ #Xiaomi devices in last 7 days. That makes a whopping 525 devices sold every minute since the start of @amazonIN @Flipkart #DiwaliWithMi sale. Ur love for #Xiao️mi has been phenomenal as always. Thank you, Mi fans! ❤️ pic.twitter.com/wXVZ95VM2H — Mi India for #MiFans (@XiaomiIndia) October 5, 2019 -
30 నిమిషాల్లో ఖతం..బుకింగ్స్ క్లోజ్
సాక్షి, ముంబై : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ వాటాను సొంతం చేసుకున్న భారత్ లగ్జరీ స్మార్ట్ఫోన్ల విక్రయంలో రికార్డు నెలకొల్పింది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. శుక్రవారం అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం ఫోన్లను కంపెనీ విక్రయించింది. దీంతో ప్రీ-బుకింగ్స్‌ను మూసివేసింది. వార్తా సంస్థ ఐఎఎన్ఎస్ అందించిన నివేదిక ప్రకారం, ఫోన్లను ముందే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మొత్తం రూ. 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకోవడం విశేషం. అక్టోబర్ 20న ఇవి వినియోగదారుల చేతికి రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ గెలాక్సీ ఫోల్డ్ ఆరు కెమెరాలతో వస్తుంది. 4.6-అంగుళాల సింగిల్ ఫోల్డ్ అమోలెడ్ డిస్ప్లే. ఇది విప్పినప్పుడు 7.3 అంగుళాల వరకు విస్తరిస్తుంది. బయటి 21: 9 స్క్రీన్ 840x1960 రిజల్యూషన్ , మరో స్క్రీన్ 1,536 x 2,152 రిజల్యూషన్ కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు 7.3 అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే 12 జీబీ రామ్, 512 జీబీ స్టోరేజ్ కవర్ డిస్ప్లేపై 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇంటర్నల్ డిస్ప్లేపై 10 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలు వెనుకవైపు 16 ఎంపీ, 12 ఎంపీ, 12 ఎంపీ ట్రిపుల్ కెమెరాలు 4380 ఎంఏహెచ్ బ్యాటరీ -
జియో ఫోన్లలో వాట్సాప్: రికార్డ్ సేల్స్
సాక్షి,ముంబై: సంచలన జియో 4జీ ఫీచర్ ఫోన్ కస్టమర్లకు శుభవార్త. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ జియో ఫోన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. జియో ఫోన్లోని ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ ఇపుడిక వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు రిలయన్స్ జియో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జియో ఫోన్, జియో ఫోన్ 2 ఫోన్లను వాడుతున్న వినియోగదారులు జియో యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం తమ ఫోన్ నంబర్లను వెరిఫై చేసుకోవడం ద్వారా జియో ఫోన్ యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అన్ని జియో ఫోన్లలో సెప్టెంబరు 20 నుంచి వాట్సాప్ అందుబాటులో ఉంటుందని జియో ఒకప్రకటనలో తెలిపింది. అంతేకాదు భారత దేశంలో జియోఫోన్ భారీ అమ్మకాలను నమోదు చేసింది పేర్కొంది. 215 మిలియన్ వినియోగదారులతో ప్రపంచ రికార్డులను సృష్టించిన జియో లాంచ్ చేసిన జియో ఫోన్ కీలక మైలురాళ్లను అధిగమించిందనీ, రూ 1,500 ధర పరిధిలో అమ్ముడైన ప్రతి 10 మొబైల్ ఫోన్లలో, 8 జియో ఫోన్లు ఉన్నాయని ప్రకటించింది. స్పెషల్ హెల్ప్‌లైన్ : మరోవైపు జియో ఫోన్‌పై సందేహాలను, సమస్యలను పరిష్కరించేందుకు 1991 హెల్ప్‌లైన్ కూడా ప్రకటించింది. కాగా యూట్యూబ్, వాట్సాప్ ,గూగుల్ మాప్స్ యాప్‌లను ఆగస్టు 15న అందుబాటులోకి తెస్తామని గతంలో జియో ప్రకటించింది. అయితే ఫేస్‌బుక్‌ను జియో ఫోన్లలో ఫేస్బుక్, యూట్యుబ్‌ను ఆవిష్కరించింది, కానీ ఒక నెల ఆలస్యంగా వాట్సాప్ యాప్‌ను జియో ఫోన్‌కు అందుబాటులోకి తీసుకురావడం విశేషం. -
5 నిమిషాల్లో రూ. 200 కోట్లు
చైనా మొబైల్ తయారీదారు షావోమీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎదురులేని రారాజులా దూసుకుపోతోంది. ఇటీవల పోకో సబ్‌బ్రాండ్ ద్వారా లాంచ్ చేసిన పోకో ఎఫ్ 1 అపూర్వమైన సేల్స్‌ను నమోదు చేసింది. ఆగస్టు 29న ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం ద్వారా నిర్వహించిన ఫ్లాష్ సేల్‌లో కళ్లు తిరిగే ఆదాయాన్ని ఆర్జించింది. కేవలం ఐదు నిమిషాల్లో రూ. 200 కోట్ల విలువైన షావోమి పోకో ఎఫ్ 1 ఫోన్లు విక్రయించింది. పోకో ఎఫ్ 1 మొదటి ఫ్లాష్‌సేల్‌లో భారీ విక్రయాలను సాధించామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది బిగ్గెస్ట్, ఫాస్టెస్ట్ సేల్ అని పేర్కొంది. అలాగే తదుపరి ఫ్లాష్‌సేల్ సెప్టెంబరు 5న ఉంటుందని ప్రకటించింది. అయితే విక్రయించిన స్మార్ట్ఫోన్ల సంఖ్యను సంస్థ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ టాప్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లో 68వేల యూనిట్లను, 1 లక్షల దాకా బేస్ వేరియంట్ డివైస్‌లను వినియోగదారులు కొనుగోలు చేసినట్టు అంచనా. కాగా పోకో ఎఫ్ 1 స్మార్ట్‌ఫోనును మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 6జీబీర్యామ్/64 స్టోరేజ్ (బేస్ వేరియంట్) ధర .20,999 గానూ, 6జీబీర్యామ్/128 స్టోరేజ్ (రెండవ వేరియంట్)ధర 23,999 రూపాయలుగాను, 8జీబీర్యామ్/256 స్టోరేజ్ (టాప్ ఎండ్ వేరియంట్) రూ .28,999గా నిర్ణయించింది. దీంతో పాటు స్పెషల్ ఎడిషన్ రెడ్ వేరియంట్ రూ. 29,999 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ప్రారంభ అమ్మకాల్లోనే బ్రేకింగ్ రికార్డులతో దూసుకుపోతున్నషావోమి సబ్‌బ్రాండ్ పోకో గ్లోబల్ మార్కెట్లో లాంచింగ్ అనంతరం భారీ ప్రభావాన్నే చూపనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి -
లక్షా పదివేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయం
రూ.11 లక్షల ఆదాయం అన్నవరం : తుని మండలం లోవకొత్తూరులో గల తలుపులమ్మ తల్లి దేవస్థానానికి ఆదివారం తరలివెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని ప్రసాదాల కొనుగోలు చేశారు. లోవభక్తుల రద్దీతో స్వామివారి ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ తీవ్ర రద్దీ ఏర్పడింది. బైపాస్‌రోడ్‌లోని నమూనా ఆలయం వద్ద ప్రసాదాల కోసం భక్తులు అర గంట క్యూలో వేచియుండాల్సి వచ్చింది. సత్యదేవుని తొలిపాంచా వద్ద, బైపాస్‌రోడ్‌లోని నమూనా ఆలయం వద్ద, రత్నగిరిపై రోశయ్య మండపంలో గల ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద సుమారు లక్షా పదివేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్ రూ. పది విలువ గల ఈ ప్యాకెట్ల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ.11 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.