దేశీయ అతిపెద్ద ఈవీ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ మే నెలలో బంపర్ సేల్స్ సాధించింది. 35వేల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేయగా, మొత్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు రికార్డు సృష్టించడం విశేషం. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!)
కంపెనీ గత మూడు త్రైమాసికాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో, ఓలా మే నెలలో 30శాతం పైగా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది గత ఏడాది మే నెలలోని నమోదైన విక్రయాలతో పోలిస్తే ఏకంగా 300 శాతం వృద్ధిని సాధించింది.
మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు మే 2023 నెలలో అద్భుతమైన పెరుగుదల నమోదైంది. తొలిసారిగా ఒకే నెలలో లక్ష మార్కును దాటడం విశేషం. ఏప్రిల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 57శాతం పైగా పెరిగాయి. ఈవీ అమ్మకాలకు సంబంధించి మే నెల బెస్ట్‌గా నిలిచింది. ఏథర్, ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు మేలో తమ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేశాయి. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?)
అటు నెలనెలా తమ అమ్మకాలు ఆకట్టుకునే వృద్ధిని సాధించాయనీ, దేశంలో ఈవీ విప్లవానికి ఓలా లీడర్‌గా కొన సాగుతోందంటూ ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు , సీఈవో భవిష్ అగర్వాల్ సంతోషాన్ని ప్రకటించారు. బ్రాండ్‌పై కస్టమర్ విశ్వాసాన్ని, ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ, తాము జూన్ నుండి స్కూటర్ ధరలను స్వల్పంగా మాత్రమే పెంచిందన్నారు.
కాగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఓలా తన ఆఫ్‌లైన్ ఉనికిని చురుకుగా పెంచుతోంది. కంపెనీ ఇటీవలే తన 600వ ఈసీని ప్రారంభించింది. ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని యోచిస్తోంది.
సేల్స్ ఎందుకు పెరిగాయి?
ఫేమ్ - II సబ్సిడీకి మే చివరి నెల కావడమే అధిక విక్రయాలకు ఒక కారణం. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్టర్ అడాప్షన్ అండ్ తయారీ (FAME II) పథకం కింద, వాహన ధరలో గరిష్టంగా 40 శాతం పరిమితితో కిలోవాట్-గంటకు (kWh) రూ. 15,000 సబ్సిడీని భారత ప్రభుత్వం అందిస్తోంది. 1 జూన్ 2023 నుంచి సవరించిన అమలులోకి వస్తుంది. ఈ సబ్సిడీని రూ. 10,000కి తగ్గించింది. వాహన ధరలో 15 శాతానికి పరిమితం చేసింది. ఫలితంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment