Ether
-
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సేల్స్‌లో రికార్డ్: ఓలాదే ఆధిపత్యం, ఎందుకో తెలుసా?
దేశీయ అతిపెద్ద ఈవీ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ మే నెలలో బంపర్ సేల్స్ సాధించింది. 35వేల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేయగా, మొత్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు రికార్డు సృష్టించడం విశేషం. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) కంపెనీ గత మూడు త్రైమాసికాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో, ఓలా మే నెలలో 30శాతం పైగా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది గత ఏడాది మే నెలలోని నమోదైన విక్రయాలతో పోలిస్తే ఏకంగా 300 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు మే 2023 నెలలో అద్భుతమైన పెరుగుదల నమోదైంది. తొలిసారిగా ఒకే నెలలో లక్ష మార్కును దాటడం విశేషం. ఏప్రిల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 57శాతం పైగా పెరిగాయి. ఈవీ అమ్మకాలకు సంబంధించి మే నెల బెస్ట్‌గా నిలిచింది. ఏథర్, ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు మేలో తమ అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేశాయి. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?) అటు నెలనెలా తమ అమ్మకాలు ఆకట్టుకునే వృద్ధిని సాధించాయనీ, దేశంలో ఈవీ విప్లవానికి ఓలా లీడర్‌గా కొన సాగుతోందంటూ ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు , సీఈవో భవిష్ అగర్వాల్ సంతోషాన్ని ప్రకటించారు. బ్రాండ్‌పై కస్టమర్ విశ్వాసాన్ని, ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ, తాము జూన్ నుండి స్కూటర్ ధరలను స్వల్పంగా మాత్రమే పెంచిందన్నారు. కాగా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఓలా తన ఆఫ్‌లైన్ ఉనికిని చురుకుగా పెంచుతోంది. కంపెనీ ఇటీవలే తన 600వ ఈసీని ప్రారంభించింది. ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని యోచిస్తోంది. సేల్స్ ఎందుకు పెరిగాయి? ఫేమ్ - II సబ్సిడీకి మే చివరి నెల కావడమే అధిక విక్రయాలకు ఒక కారణం. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్టర్ అడాప్షన్ అండ్ తయారీ (FAME II) పథకం కింద, వాహన ధరలో గరిష్టంగా 40 శాతం పరిమితితో కిలోవాట్-గంటకు (kWh) రూ. 15,000 సబ్సిడీని భారత ప్రభుత్వం అందిస్తోంది. 1 జూన్ 2023 నుంచి సవరించిన అమలులోకి వస్తుంది. ఈ సబ్సిడీని రూ. 10,000కి తగ్గించింది. వాహన ధరలో 15 శాతానికి పరిమితం చేసింది. ఫలితంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలున్నాయి. -
ఈ–స్కూటర్ కస్టమర్లకు చార్జర్ డబ్బు వాపస్
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలతో పాటు చార్జర్లను విడిగా కొనుగోలు చేసిన కస్టమర్లకు సదరు చార్జర్ల డబ్బును వాపసు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్, ఎథర్ ఎనర్జీ తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. స్వార్ధ శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ విద్యుత్ వాహనాల పరిశ్రమ గత కొన్నాళ్లుగా అసాధారణంగా వృద్ధి చెందినట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్లో ఓలా పేర్కొంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన కస్టమర్లందరికీ చార్జర్ల డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మొత్తం చెల్లించనున్నదీ మాత్రం వెల్లడించలేదు. ఇది సుమారు రూ. 130 కోట్లు ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఈవీ స్కూటర్లతో కలిపే చార్జర్లను విక్రయించే అంశంపై భారీ పరిశ్రమల శాఖతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఎథర్ ఎనర్జీ తెలిపింది. చట్టబద్ధంగా ఇలా చేయాల్సిన అవసరం లేనప్పటికీ వాహనాలతో పాటే చార్జరును కూడా ఇచ్చేలా తమ నిబంధనలు మార్చుకున్నట్లు వివరించింది. అలాగే 2023 ఏప్రిల్ 12కు ముందు కొనుగోలు చేసిన వాహనాల విషయంలో చార్జర్లకు వసూలు చేసిన మొత్తాన్ని రిఫండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే తరహాలో టీవీఎస్ మోటార్ కంపెనీ తాము రూ. 20 కోట్లు పైచిలుకు వాపసు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
క్రిప్టో ఢమాల్.. భారీగా నష్టోతున్న బిట్‌కాయిన్..
భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీదే రాజ్యం అంటూ ఓ వైపు భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నా... మరోవైపు చాలా దేశాలు క్రిప్టో లావాదేవీలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దీంతో క్రిప్టోలపై అనిశ్చిత్తి పకూర్తిగా వీడటం లేదు. కాగా ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సైతం డిజిటల్ కరెన్సీపై నమ్మకం కోల్పోతున్నారు. ఫలితంగా క్రిప్టో కరెన్సీ విలువలు పడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీలో లార్జెస్ట్ కాయిన్‌గా పేరొందని బిట్ కాయిన్ విలువకి భారీ ఎత్తున కోత పడుతోంది. గడిచిన ఐదు రోజుల్లో బిట్ కాయిన్ విలువ 14 శాతం క్షీణించింది. మే 5న బిట్‌కాయిన్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 30.14 లక్షలు ఉండగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రూ. 25.90 లక్షలకు పడిపోయింది. ద్రవ్యోల్బణం కారణంగా డిజిటల్ ఆస్తుల కంటే రెగ్యులర్ ఆస్తులపై ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మరోవైపు రెండో అతి పెద్ద డిజిటల్ కాయిన్ అయిన ఈథెరమ్ సైతం తన విలువను గత ఐదు రోజుల్లో 15 శాతం కోల్పోయింది. ప్రస్తుతం ఈథేమర్ విలువ రూ.1.89 లక్షలుగా ఉంది. ఐదు రోజుల్లో ఏకంగా రూ. 33.64 వేల మేరకు కోత పడింది. చదవండి: భారత్‌లో క్రిప్టో కరెన్సీ! నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! -
భారీగా పడిపోతున్న క్రిప్టో కరెన్సీ ధరలు..!
దేశీయ స్టాక్ మార్కెట్ మాదిరిగానే క్రిప్టో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 3.10 శాతం తగ్గి రూ.29.73 లక్షల వద్ద కొనసాగుతుంటే.. మార్కెట్ విలువ రూ.54.97 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ గత 24 గంటల్లో 4.14 శాతం తగ్గి రూ.2,05,119 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.24.24 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇతర కరెన్సీ వీలువ కూడా భారీగా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం వీటి మీద కూడా పడింది. క్రిప్టో కరెన్సీల వంటి వాటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ అస్థిరంగా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ ఆస్తి. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. (చదవండి: అదిరిపోయిన హైపర్ స్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకులు..!) -
క్రిప్టో కరెన్సీ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు..!
మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలను తెచ్చిపెడుతుంది. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ఇన్వెస్టర్లు అందరూ విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు(జనవరి 21) భారీగా పతనం అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీ దెబ్బకు ట్రేడర్లు విక్రయాలు చేపట్టారు. గత 24 గంటల్లో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ 5.97 శాతం తగ్గి రూ.28.44 లక్షల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ రూ.55.00 లక్షల కోట్లుగా ఉంది. ఒక్క రోజులోనే రూ.5 లక్షల కోట్ల మేర విలువ ఆవిరైంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 7.71 శాతం తగ్గి రూ.205,958.68 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.25.55 లక్షల కోట్లుగా ఉంది. దాదాపు రూ.2 లక్షల కోట్లు తగ్గిపోయింది. బైనాన్స్ కాయిన్ 7.50 శాతం తగ్గి రూ.34,461, టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.81.21, సొలానా 11.41 శాతం తగ్గి రూ.9,819 వద్ద కొనసాగుతున్నాయి. టెథర్, యూఎస్డీ స్వల్పంగా పెరగడం మినహా మరేవీ లాభాల్లో లేవు. లూప్‌రింగ్, లైవ్‌పీర్, యార్న్ ఫైనాన్స్, హార్మొని, ఎన్‌కేఎన్, కీప్ నెట్వర్క్, అల్గొరాండ్ 13 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పెరిగిన కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య తలెత్తిన ఉద్రిక్తల వల్ల క్రిప్టో మైనింగ్ పరిశ్రమకు నిలయమైన రష్యా అన్ని క్రిప్టోకరెన్సీల వినియోగం, మైనింగ్ పై నిషేధాన్ని విధించాలని చూస్తుంది. రష్యాలోని సుమారు 17 మిలియన్ క్రిప్టో వాలెట్లలో 7 ట్రిలియన్ రూబుల్స్ (92 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ కు చెందిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ Crypto.com, తమ క్రిప్టో కరెన్సీ దొంగిలించినట్లు పలువురు వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో ఈ వారం కొద్ది సేపు భద్రతల నేపథ్యంలో ట్రెండింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. (చదవండి: రిపబ్లిక్ డే రోజున మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..!) -
Bitcoin: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర..!
ప్రముఖ క్రిప్టోకరెన్సీల విలువ గతకొన్ని రోజులుగా భారీగా పడిపోతుంది. క్రిప్టోకరెన్సీలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విలువ నేడు 4.9 శాతం క్షీణించి 41,008 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. నాలుగు నెలల క్రితం బిట్‌కాయిన్ జీవితకాల గరిష్ఠం 69,000 అమెరికన్ డాలర్లకు చేరుకున్నప్పటి నుంచి సుమారు 40 శాతం పడిపోయింది. ఇక రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఈథర్ విలువ సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటి వరకు 9 శాతం పడిపోయింది. బైనాన్స్ కాయిన్, సొలానా, కార్డనో, ఎక్స్ఆర్పీ సైతం గత ఏడు రోజుల్లో 10 శాతానికి పైగా తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశం తర్వాత క్రిప్టోకరెన్సీ ధర భారీగా పడిపోతూ వస్తుంది. వడ్డీ రేట్ల పెంపు ఊహించిన దాని కంటే ఎక్కువ ఉండొచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్‌లో వెల్లడవ్వడం తాజాగా క్రిప్టో కరెన్సీ పతనానికి దోహదం చేసింది. "క్యూ1 2022లో బ్యాలెన్స్ షీట్ తగ్గించాలనే ఫెడ్ తీసుకున్న నిర్ణయం ఈ పతనానికి ప్రధాన కారణం" అని ఫండ్ స్ట్రాట్ వ్యూహకర్తలు తెలిపారు. వివిధ దేశాల్లో దీనికి చట్టబద్ధత లభించే అవకాశం ఉందన్న అంచనాలు, ద్రవ్యోల్బణ నుంచి రక్షణ, మదుపర్ల పోర్ట్‌ఫోలియోకు క్రిప్టోను కూడా జత చేయడం వంటి పరిణామాలతో బిట్‌కాయిన్ విలువ గత ఏడాది 60 శాతం మేర పెరిగింది. వీటిలో కొన్ని అంశాల్లో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతుండడంతో తాజా కొనుగోళ్లకు మద్దతు లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే క్రిప్టోల విలువ క్రమంగా పడిపోతున్నట్లు నిపుణులు తెలిపారు. జెఎస్‌టి క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు టాడ్ మొరాకిస్ ప్రకారం.. కజఖ్‌స్థాన్‌లోని అశాంతి, అక్కడ గణనీయమైన సంఖ్యలో క్రిప్టో-మైనింగ్ కార్యకలాపాలపై చైనా అణచివేత, విద్యుత్-సరఫరాలో ఇబ్బందులు వంటి కారణాలు కూడా బిట్‌కాయిన్ ధరను ప్రభావితం చేశాయి. నెట్ వర్క్ కంప్యూటింగ్ శక్తి కొలత అయిన బిట్‌కాయిన్ హాష్ రేటు(Blockchain.com డేటా ప్రకారం) జనవరి 1న సుమారు 208 మిలియన్ల రికార్డు నుంచి గురువారానికి 176 మిలియన్ టెరాహాషెస్ కు పడిపోయింది. (చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?) -
కొంపముంచిన కోతి బొమ్మ.. చిటికేసినంత ఈజీగా రెండు కోట్ల రూపాయలు లాస్!
Bored Ape NFT Loss To Trader During Online Sale: కంగారు.. ఏమరపాటులో చేసే పనులు ఒక్కోసారి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇక్కడ కోట్లు కలిసి వస్తాయని ఆశపడ్డ ఆ వ్యక్తికి.. నష్టమే మిగిలింది. పొరపాటున బోటన వేలు తగిలి దాదాపు రెండు కోట్ల రూపాయలు లాస్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బోర్డ్ ఏప్ (దిగాలుగా ఉన్న కోతి).. మీమ్ నుంచి ఎన్ఎఫ్టీ (నాన్ ఫంగిబుల్ టోకెన్) ఫ్రాంచైజీగా ఎదిగి.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భారీ బిజినెస్ చేస్తోంది. సుమారు పది వేల పీసులు ఉన్న ‘బోర్డ్ ఏప్’ ఎఎఫ్టీ యాట్చ్ క్లబ్లో హాలీవుడ్ సెలబ్రిటీలు జిమ్మీ ఫాలోన్, స్టెఫ్ కర్రీలాంటోళ్లు సైతం ఉన్నారు. ఇప్పటివరకు గరిష్టంగా ఇది 85 ఎథెర్(క్రిప్టోకరెన్సీ కాయిన్ ఎథెర్.. 3, 20,000 డాలర్లకు సమానం) అమ్ముడుపోవడం విశేషం. అయితే ఈమధ్యే కాలంలో ఈ ఎన్ఎఫ్టీ 3 లక్షల డాలర్లకు(2,28,15,750రూ.) తక్కువ కాకుండా ట్రేడ్ అవుతోంది. దీంతో తన దగ్గరున్న ఎన్ఎఫ్టీని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు ఓ ట్రేడర్. మాక్స్ అనే వ్యక్తి (మ్యాక్స్నాట్ యూజర్‌నేమ్) 75 ఎథర్‌లకు (3 లక్షల డాలర్లకు) ఆ ఎన్ఎఫ్టీ పీస్‌ను ఆన్లైన్లో అమ్మేయాలనుకున్నాడు. అయితే ధర నిర్ధారించేలోపు.. పొరపాటున అతని బోటన వేలు కంప్యూటర్ మౌస్ క్లిక్ అయ్యింది. దీంతో ధర 0.75 ఎథర్(3,000 డాలర్లు)గా కన్ఫర్మ్ అయ్యింది. తప్పును సరిదిద్దుకునే లోపే ఆ ప్రైస్ ఫిక్స్ అయిపోయింది. ఇక అంతే.. మన కరెన్సీ విలువ ప్రకారం.. 2,28,10,800రూ. అమ్ముడుపోవాల్సిన ఈ ఎన్ఎఫ్టీ.. కేవలం రూ. 2, 20, 000లకు అమ్ముడుపోయింది అది. తనకు వాటిల్లిన నష్టంపై ఘోల్లుమంటూ ఆ యూజర్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశాడు. చికేసినంత ఈజీగా రెండున్నర లక్షల డాలర్లు.. (మన కరెన్సీలో రెండున్నర కోట్ల రూపాయల దాకా) నష్టపోయానని వాపోయాడు. ఇందులో మరో దరిద్రం ఏంటంటే.. గతంలోనూ ఈ యూజర్‌కు ఇలానే ఆన్లైన్ సేల్ ద్వారా 20,000 డాలర్ల (15 లక్షల రూపాయల దాకా) నష్టం వాటిల్లడం. What do you gain from thinking about it? You just feel bad by choice. If you can't do anything about it, don't think about it. And you'll live a pretty happy life. — maxnaut.eth (@maxnaut) December 13, 2021 ఎన్ఎఫ్టీ అంటే బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా నడుస్తున్నాయి. ఇదే తరహాలో మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! -
భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బిట్‌కాయిన్. ప్రస్తుతం ఉన్న అన్నీ క్రిప్టోకరెన్సీల్లో కంటే బిట్‌కాయిన్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఈ బిట్‌కాయిన్ ధర గత కొద్ది రోజుల నుంచి భారీగా పడిపోతుంది. నవంబర్ 8న 67,582.60 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ ధర నేడు సుమారు 4% కంటే ఎక్కువ 60,718.80 డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో రూ. 3 వేల డాలర్లు పైగా నష్టపోయింది. అలాగే, మార్కెట్ విలువ పరంగా రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ 6.18% క్షీణించి $4,291.60 వద్ద ఉంది. అయితే, ఈ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర పడిపోవడానికి సరైన కారణాలు కనిపించడం లేదని, చాలా రోజులు నుంచి క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర గరిష్టానికి చేరుకోవడంతో పెట్టుబడుదారులు లాభాలను వెనక్కి తీసుకోవడంతో క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర పడిపోయినట్లు నిపుణులు సూచిస్తున్నారు. బిట్‌కాయిన్ విలువ జూన్ కంటే రెట్టింపు స్థాయిలో పెరిగింది. (చదవండి: Akasa Air: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..) -
సింగిల్ ఛార్జింగ్ తో 240 కి.మీ ప్రయాణం
ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 500 ఎకరాల స్థలంలో మెగా ఫ్యాక్టరీని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరిలో నిర్మిస్తున్నారు. ఈ కొత్త ఫ్యాక్టరీ భారతదేశంలోని డిమాండ్‌ను తీర్చడమే గాక "ఓలా ఎలక్ట్రిక్" ఎగుమతి కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఈ కొత్త ప్లాంట్‌లో తయారు చేసిన వాహనాలను యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. ఒక కోటి వాహనాలను ఏడాది కాలంలో తయారు చేయగల సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి కార్యకలాపాలు 2022 సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఓలా కంపెనీ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలను వెల్లడించింది. ఓలా గత ఏడాది మేలో నేదర్లాండ్ ఆమ్స్టర్ డామ్ ఆధారిత ఈవీ బ్రాండ్ ఏటిర్గోను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో భారత దేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏటిర్గో యాప్ స్కూటర్ మొట్టమొదట 2018లో తయారైంది. ఇది సింగిల్ ఛార్జింగ్ తో 240 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలుపుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో 0-45 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఫుల్ కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి బిట్లతో పాటు అన్ని ఎల్ఇడి లైటింగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఉన్న ఈథర్ 450 ఎక్స్, బజాజ్ చేతక్, టివిఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లకు ఈ రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇవన్నీ రూ.1.30లక్షల నుంచి రూ.2 లక్షల ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్‌ను రూ.1.25లక్షలకు తీసుకురావాలని భావిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కనుక ఆ ధరకు అందుబాటులోకి తీసుకొస్తే ఒక సంచలనం అవుతుంది. చదవండి: కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్ 4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా! -
విశ్వ గవాక్షానికి పాతికేళ్లు!
ఖగోళ వింతలపై మనిషి ఆసక్తి యుగాలుగా ఉన్నదే... మిణుకు మిణుకు తారల్లో రకరకాల ఆకారాలను ఊహిస్తూ... వాటితోనే.. తమ రేపును అంచనా వేస్తూ వేల ఏళ్లు గడిపేశాడు. టెలిస్కోపు ఆవిష్కరణతో ఆకాశ వింతల్ని నేరుగా చూడటం సాధ్యమైనా... ఇటీవలి కాలం వరకూ వాటిని అర్థం చేసుకున్నది కొంతే. కానీ... పాతికేళ్ల క్రితం జరిగిన ఓ అద్భుతం... విశ్వ రహస్యాలను మన కళ్లముందు ఉంచుతోంది. కొత్త కొత్త లోకాలను చూపుతోంది. ఆ అద్భుతం పేరు.. హబుల్ టెలిస్కోపు! విశ్వం మొత్తాన్ని చూడగల హబుల్ మన సూర్యుడిని, బుధ గ్రహాన్ని మాత్రం చూడలేదు. మరీ దగ్గరగా ఉండటం దీనికి కారణం. విశ్వ వ్యాపన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ పేరిట ఈ టెలిస్కోపును నిర్మించారు. 1990 ఏప్రిల్ 24... విశ్వం ఆనుపానులు తెలుసుకునే ప్రయత్నంలో మనిషి కీలక విజయం సాధించిన రోజిది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) డిస్కవరి అంతరిక్ష నౌక సాయంతో హబుల్ టెలిస్కోపును విజయవంతంగా ప్రయోగించింది ఈ రోజే. అయితే ఈ టెలిస్కోపు ద్వారా సువిశాల విశ్వం గురించి మనిషి అవగాహన పెరుగుతుందని, అప్పటివరకూ కనీవినీ ఎరుగని కొత్త లోకాలను చూడగలమని చాలా తక్కువ మంది ఊహించి ఉంటారు. ప్రయోగించిన కొన్ని రోజులకే టెలిస్కోపులోని ముఖ్య దర్పణంలో లోపాలు బయటపడటం. దీనికి ఒక కారణమైతే... ఆ తరువాత ఈ లోపాలన్నింటినీ సరిచేసేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి నాలుగు సర్వీస్ మిషన్లు నడపాల్సి రావడం రెండో కారణం. అదష్టవశాత్తూ ఈ శ్రమంతా వృథా కాలేదు. ఈ విశ్వం పరిమాణమెంతో అంచనా కట్టేందుకు మొదలుకొని... నక్షత్రాలు, గ్రహాల పుట్టుక. చావు... కొరకరాని కొయ్యల్లా ఉండిపోయిన కృష్ణశక్తి, కృష్ణబిలం వంటి భౌతిక శాస్త్ర దృగ్విషయాలను అర్థం చేసుకోవడం వరకూ అనేక అంశాల్లో హబుల్ టెలిస్కోపు పరిశోధనలు కీలకపాత్ర వహించాయి. సౌరకుటుంబం అవతల ఉన్న గ్రహాల రూపురేఖలు, వాటిల్లో ఉండే రసాయనాల వివరాలు తెలిసింది కూడా హబుల్ తీసిన ఫొటోల ఆధారంగానే. మరో రెండు రోజుల్లో పాతికేళ్లు నిండబోతున్న తరుణంలో హబుల్ టెలిస్కోపు సాధించిన ఘన విజయాలు కొన్నింటిని చూద్దామా...? విశ్వం వయసు తెలిసింది... కొన్ని కోటానుకోట్ల ఏళ్ల క్రితం ఈ విశ్వం మొత్తం అతిసూక్ష్మమైన బిందువు పరిమాణంలో ఉండేదని, అకస్మాత్తుగా ఓ భారీ పేలుడు సంభవించి... విశ్వం ఏర్పడటం మొదలైందని మనం పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎప్పుడన్నది మాత్రం తెలియదు. అయితే కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వరకూ చూడగల సామర్థ్యమున్న హబుల్ టెలిస్కోపు... కన్యారాశిలోని కొన్ని నక్షత్రాలు ఎంత వేగంగా కదులుతున్నాయో ఫొటోలు తీసి పంపింది. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విశ్వం వయసు 1300 నుంచి 1400 కోట్ల సంవత్సరాల వరకూ ఉంటుందని అంచనా కట్టగలిగారు. కొత్త లోకాలు... భూమ్మీద ఉన్న టెలిస్కోపుల సాయంతో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు మన సౌర కుటుంబానికి అవతల కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయని ఎప్పుడో గుర్తించారు. అయితే ఈ ఎక్సోప్లానెట్లు ఎలా ఉంటాయి? వాటిల్లో ఉండే రసాయనాలు ఏమిటి? అన్నది మాత్రం తెలియలేదు. హబుల్ టెలిస్కోపు తన కెమెరా సాయంతో ఈ చిక్కుముళ్లన్నింటినీ విప్పేసింది. రకరకాల తరంగదైర్ఘ్యాల్లో తీసిన ఫొటోలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ఎక్సోప్లానెట్ల వాతావరణంలో సోడియం, హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ వంటి వాయువులు ఉన్నాయని తొలిసారి నిర్ధారించగలిగారు. అంతేకాదు... ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారి నేరుగా ఫొటో తీయగలిగింది కూడా ఈ దుర్భిణి ద్వారానే! కృష్ణబిలాలను గుర్తించింది... కాంతిని కూడా తనలోకి లాగేసుకోగల శక్తిమంతమైన ప్రాంతం కష్ణబిలం. విశ్వంలో అనేక చోట్ల ఉండే ఈ కష్ణబిలాలు కంటికి కనిపించవు. ప్రభావం మాత్రం తెలుస్తూంటుంది అంతే. నక్షత్రాలైనా, గ్రహాలైనా, ఏ ఇతర పదార్థమైనా సరే... కృష్ణబిలంలోకి వెళ్లగలవుగానీ... ఆ ప్రాంతం నుంచి ఏదీ బయటకు రాదు... రాలేదు కూడా. ఈ కృష్ణబిలాల గురించి ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనాలు వేశారు.. సిద్ధాంతాలను ప్రతిపాదించారుగానీ.. హబుల్ టెలిస్కోపుతో తొలిసారి అటువంటివాటిని నేరుగా చూడగలిగారు. పాలపుంతల మధ్యభాగంలో భారీసైజున్న కృష్ణబిలాలు ఉంటాయని గుర్తించడమే కాకుండా... వాటి సైజును బట్టి ... పాలపుంత పరిమాణం ఉంటుందని కూడా హబుల్ టెలిస్కోపు తీసిన ఫొటోల ఆధారంగానే తెలిసింది. అదృశ్య శక్తి లెక్కలు తేల్చింది... వేల కోట్లనక్షత్రాలు, గ్రహాలున్న విశ్వం వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయం దాదాపు వందేళ్ల క్రితమే ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ద్వారా తెలిసింది. అయితే ఈ విస్తరణ వేగం కాలక్రమంలో తగ్గుతూ వస్తుందని ఆ తరువాత విశ్వం మొత్తం కుంచించుకుపోవడం మొదలవుతుందని అప్పట్లో అనుకునేవారు.. అయితే హబుల్ టెలిస్కోపు ఈ అంచనాలను తారుమారు చేసింది. 1998లో హబుల్ ఓ నక్షత్ర పేలుడు (సూపర్నోవా) తాలూకూ ఫొటోలను పంపింది. దాని వెలుగులను లెక్కకట్టడం ద్వారా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ విశ్వ విస్తరణ అంతకంతకూ వేగం పుంజుకుంటోందని, తగ్గడంగానీ.. కుంచించుకుపోవడం గానీ సాధ్యం కాదని స్పష్టమైంది. ఈ విస్తరణకు కారణం కృష్ణ శక్తి అని తెలిసింది కూడా ఈ టెలిస్కోపు ద్వారానే . అంతేకాదు... ఈ విశ్వం మొత్తం బరువుకు, మన కంటికి కనిపించే పదార్థం బరువుకు చాలా తేడా ఉంది. అంటే... కంటికి కనిపించని పదార్థం ఏదో ఉందన్నమాట. ఈ కృష్ణ పదార్థం విశ్వం బరువులో 22 శాతం వరకూ ఉంటుందని హబుల్ పరిశోధనల వల్ల స్పష్టమైంది. నక్షత్రాలు, గ్రహాల చావు పుట్టుకలు... నక్షత్రాలు, గ్రహాలు ఎలా పుడతాయన్న విషయంపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా కొన్ని అంచనాలు వేస్తున్నా... స్పష్టంగా చూడగలిగింది మాత్రం హబుల్ పంపిన ఫొటోల ద్వారానే. సుమారు 6500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈగల్ నెబ్యులే (నక్షత్ర మండలం) ఫొటోలను హబుల్ పంపింది. వాటిల్లో అతి ప్రకాశవంతంగా కనిపించే ప్రాంతాల్లో నక్షత్రాలు పురుడుపోసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నక్షత్రాల చుట్టూ ఉన్న ఖగోళ ధూళి ఒకదగ్గరకు చేరి కాలక్రమంలో గ్రహాలుగా ఏర్పడతాయని కూడా శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. ఈగల్ నెబ్యూలేతోపాటు హబుల్ అనేకానేక నక్షత్ర, గ్రహ మండలాలను గుర్తించి వాటి తాలూకూ సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా 552 కిలోమీటర్లు హబుల్ టెలిస్కోపు పరిభ్రమించే ఎత్తు... 12 టన్నులు హబుల్ బరువు 97 నిమిషాలు భూమిని ఒకసారి చుట్టేసేందుకు పట్టే సమయం 28000 కిలోమీటర్ల వేగం 2.4 మీటర్లు హబుల్లోని ప్రధాన దర్పణం వ్యాసం 2800 వాట్లు రెండు సోలార్ ప్యానెళ్ల సాయంతో హబుల్ ఉత్పత్తి చేసుకునే విద్యుచ్ఛక్తి. ఒక్క వారం రోజుల్లో హబుల్ ఇచ్చే సమాచారం 120 గిగాబైట్లు ఇది 60 హెచ్డీ క్వాలిటీ సినిమాలకు సమానం. పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్: నక్షత్రాల పొత్తిళ్లు... 6500 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త కొత్త నక్షత్రాలు పుట్టే ప్రాంతం ఇది. ధూళి మేఘాలు స్తంభాలుగా కనిపించే ఈ చిత్రానికి పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అని పేరు. ఒక్కో స్తంభం దాదాపు 4 కాంతి సంవత్సరాల పొడవు ఉంటుందంటే ఆశ్చర్యమే కదా! బ్లాక్ హోల్: భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో కన్యరాశి దిక్కులో ఉన్న ఎన్జీసీ 4261 పాలపుంత మధ్యభాగమిది. 800 కాంతి సంవత్సరాల వెడల్పున్న ఈ పాలపుంతలో ధూళి మేఘాన్ని గమనించారా? దాని మధ్యలో ఓ భారీ కృష్ణ బిలం ఉన్నట్లు హబుల్ గుర్తించింది. క్రాబ్ నెబ్యూలే: సుమారు వెయ్యి ఏళ్ల క్రితం అంటే... 1054లో అంతరిక్షంలో జరిగిన అతిపెద్ద పేలుడు తాలూకూ అవశేషమిది. తనలోని ఇంధనమంతా ఖర్చయిపోగా... ఓ నక్షత్రం తనలో తాను కుంచించుకుపోయి... పేలిపోయి ఇలా మిగిలింది. చైనా, జపాన్లలోని చరిత్రకారులు ఈ అంతరిక్ష సంఘటనను నేరుగా చూడగలిగారంటే.. పేలుడు తీవ్రత ఎంతో? వెలుగు ఏ స్థాయిలో ఉండిందో అర్థం చేసుకోవచ్చు.