భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీదే రాజ్యం అంటూ ఓ వైపు భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నా... మరోవైపు చాలా దేశాలు క్రిప్టో లావాదేవీలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దీంతో క్రిప్టోలపై అనిశ్చిత్తి పకూర్తిగా వీడటం లేదు. కాగా ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సైతం డిజిటల్ కరెన్సీపై నమ్మకం కోల్పోతున్నారు. ఫలితంగా క్రిప్టో కరెన్సీ విలువలు పడిపోతున్నాయి.
క్రిప్టో కరెన్సీలో లార్జెస్ట్ కాయిన్‌గా పేరొందని బిట్ కాయిన్ విలువకి భారీ ఎత్తున కోత పడుతోంది. గడిచిన ఐదు రోజుల్లో బిట్ కాయిన్ విలువ 14 శాతం క్షీణించింది. మే 5న బిట్‌కాయిన్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 30.14 లక్షలు ఉండగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రూ. 25.90 లక్షలకు పడిపోయింది. ద్రవ్యోల్బణం కారణంగా డిజిటల్ ఆస్తుల కంటే రెగ్యులర్ ఆస్తులపై ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మరోవైపు రెండో అతి పెద్ద డిజిటల్ కాయిన్ అయిన ఈథెరమ్ సైతం తన విలువను గత ఐదు రోజుల్లో 15 శాతం కోల్పోయింది. ప్రస్తుతం ఈథేమర్ విలువ రూ.1.89 లక్షలుగా ఉంది. ఐదు రోజుల్లో ఏకంగా రూ. 33.64 వేల మేరకు కోత పడింది.
చదవండి: భారత్‌లో క్రిప్టో కరెన్సీ! నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment