దేశీయ స్టాక్ మార్కెట్ మాదిరిగానే క్రిప్టో మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 3.10 శాతం తగ్గి రూ.29.73 లక్షల వద్ద కొనసాగుతుంటే.. మార్కెట్ విలువ రూ.54.97 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ గత 24 గంటల్లో 4.14 శాతం తగ్గి రూ.2,05,119 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ విలువ రూ.24.24 లక్షల కోట్లుగా ఉంది. ఇక ఇతర కరెన్సీ వీలువ కూడా భారీగా పడిపోయింది.
రష్యా ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం వీటి మీద కూడా పడింది. క్రిప్టో కరెన్సీల వంటి వాటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ అస్థిరంగా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ ఆస్తి. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు.
(చదవండి: అదిరిపోయిన హైపర్ స్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకులు..!)
Comments
Please login to add a commentAdd a comment