ఒకప్పుడు క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ (Bitcoin) విలువ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ 'బిట్‌కాయిన్' అనే స్థాయికి చేరిపోయింది. 2024లో ఇది ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదు చేసింది.
యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు.. వరుస ర్యాలీని అనుసరించి పెట్టుబడిదారులు లాభాలను పొందడం ప్రారంభించడంతో, డిసెంబర్‌లో బిట్‌కాయిన్ 3.2 శాతం పడిపోయింది. అయితే ఈ ఏడాది దీని విలువ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.83 లక్షల కంటే ఎక్కువ. ఇది బంగారం & గ్లోబల్ ఈక్విటీలను సైతం అధిగమించింది. 2025 జనవరి 20 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు.. బిట్‌కాయిన్ విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
2025లో బిట్‌కాయిన్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. బిట్‌కాయిన్ విలువ మరింత పెరుగుతుందని క్రిప్టో ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు, యూనివర్సిటీ ఎండోమెంట్ ఫండ్స్ కూడా బిట్‌కాయిన్‌ను స్వీకరిస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్ మరింత బలపడే అవకాశం ఉందని QCP క్యాపిటల్స్ వెల్లడించింది.
2024లో కంటే ఈ ఏడాది బిట్‌కాయిన్ విలువ గణనీయంగా పెరుగుతుందని.. బినాన్స్ రీజనల్ మార్కెట్స్ హెడ్ 'విశాల్ సచీంద్రన్' అన్నారు. అధికారులతో బలమైన సహకారాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా.. వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బ్లాక్‌చెయిన్ యుటిలిటీని పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో భారతదేశం యొక్క పాత్ర పట్ల ఆయన ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: హార్డ్ డ్రైవ్‌లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాట
క్రిప్టో రంగం కీలకమైన దశలోకి ప్రవేశిస్తోందని.. మెరుగైన వృద్ధిని ఆశించవచ్చని కాయిన్ డీసీఎక్స్ కో ఫౌండర్ 'సుమిత్ గుప్తా' వెల్లడించారు. బిట్‌కాయిన్ షేర్ కూడా 10-15 శాతం పెరుగుతుందని అన్నారు. క్రిప్టో & వెబ్3 కంపెనీల IPOల ద్వారా నడిచే సంస్థాగత పెట్టుబడి గురించి గుప్తా ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2025 కీలకమైన సంవత్సరంగా ఉంటుందని వివరించారు.
జెబ్ పే సీఈఓ 'రాహుల్ పగిడిపాటి', పీఐ42 కో ఫౌండర్ అండ్ సీఈఓ 'అవినాష్ శేఖర్', సీఐఎఫ్డీఏక్యూ ఛైర్మన్ & ఫౌండర్ 'హిమాన్షు మరడియా', డెల్టా ఎక్స్ఛేంజ్ కో ఫౌండర్ అండ్ సీఈఓ 'పంకజ్ బాలని' వంటి వారు కూడా బిట్‌కాయిన్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment