అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక యూఎస్ డాలర్ దూసుకెళ్తోంది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ మంగళవారం నాలుగు నెలల గరిష్ట స్థాయికి దగ్గరగా బలపడింది. మరోవైపు రానున్న ట్రంప్ పాలనలో ప్రయోజనం ఉంటుందన్న భావనతో ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు దృష్టి సారించడంతో బిట్ కాయిన్ విలువ మంగళవారం అమాంతం పెరిగి సరికొత్త ఆల్‌టైమ్ హైకి చేరింది.
యూరో విలువ రాత్రికి రాత్రే దాదాపు ఏడు నెలల పతనానికి చేరుకుంది. అలాగే చైనీస్ యువాన్ కూడా మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. యూరోతో సహా ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే యూఎస్ డాలర్ ఇండెక్స్.. జూలై 3 తర్వాత మొదటిసారి సోమవారం నాడు 105.70కి చేరగా ఇప్పుడు (0037 GMT) 0.07% పెరిగి 105.49కి చేరుకుంది.
ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్
కాబోయే అధ్యక్షుడు ట్రంప్ క్రిప్టోకరెన్సీకి అత్యధిక ప్రాధన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ మంగళవారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 89,637 డాలర్లు (రూ. 7.44 లక్షలు)కి చేరుకుంది. తాను గెలిచాక అమెరికాను " క్రిప్టో రాజధాని"గా మారుస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఏడాది ముగిసేలోపు బిట్‌కాయిన్ లక్ష డాలర్ల మార్కును తాకుతుందని క్యాపిటల్ డాట్ కామ్ (Capital.com) సీనియర్ ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు కైల్ రోడ్డా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment