new all time high
-
ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టేసిన బిట్‌కాయిన్
ప్రముఖ క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన బిట్‌కాయిన్ ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను కొట్టేసింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో ఆయన పరిపాలన క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక నియంత్రణ వాతావరణాన్ని సృష్టిస్తుందనే అంచనాల క్రమంలో గురువారం మొదటిసారిగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు పైగా పెరిగింది.బిట్‌కాయిన్ విలువ ఈ ఏడాదిలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన ఈ నాలుగు వారాల్లోనే దాదాపు 45 శాతం ఎగిసింది. "మనం ఒక నమూనా మార్పును చూస్తున్నాం. నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రక్షాళన తర్వాత, బిట్‌కాయిన్‌తోపాటు మొత్తం డిజిటల్ అసెట్ ఎకోసిస్టమ్ ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి ప్రవేశించే అంచున ఉన్నాయి" అని యూఎస్ క్రిప్టో సంస్థ గెలాక్సీ డిజిటల్ వ్యవస్థాపకుడు, సీఈవో మైక్ నోవోగ్రాట్జ్ అన్నారు."బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లు దాటడం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఫైనాన్స్, టెక్నాలజీ, జియోపాలిటిక్స్‌లో మారుతున్న ఆటుపోట్లకు ఇది నిదర్శనం" అని హాంకాంగ్‌కు చెందిన స్వతంత్ర క్రిప్టో విశ్లేషకుడు జస్టిన్ డి'అనేతన్ అన్నారు. చాలా కాలం క్రితం ఫాంటసీగా కొట్టేసిన ఈ ఫిగర్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందన్నారు.ట్రంప్ తన ప్రచార సమయంలో డిజిటల్ అసెట్స్‌ను ప్రోత్సహిస్తామని, యునైటెడ్ స్టేట్స్ను "క్రిప్టో రాజధాని"గా చేస్తానని వాగ్దానం చేశారు. దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. కాగా ప్రస్తుతం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న గ్యారీ జెన్స్లర్.. ట్రంప్ అధికారం చేపట్టాక జనవరిలో పదవీవిరమణ చేస్తానని గత వారం చెప్పారు. ఈ పదవికి ఎస్ఈసీ మాజీ కమిషనర్ పాల్ అట్కిన్స్ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. -
ట్రంప్ మాట.. అమాంతం ఎగిసిన బిట్ కాయిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక యూఎస్ డాలర్ దూసుకెళ్తోంది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ మంగళవారం నాలుగు నెలల గరిష్ట స్థాయికి దగ్గరగా బలపడింది. మరోవైపు రానున్న ట్రంప్ పాలనలో ప్రయోజనం ఉంటుందన్న భావనతో ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు దృష్టి సారించడంతో బిట్ కాయిన్ విలువ మంగళవారం అమాంతం పెరిగి సరికొత్త ఆల్‌టైమ్ హైకి చేరింది.యూరో విలువ రాత్రికి రాత్రే దాదాపు ఏడు నెలల పతనానికి చేరుకుంది. అలాగే చైనీస్ యువాన్ కూడా మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. యూరోతో సహా ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే యూఎస్ డాలర్ ఇండెక్స్.. జూలై 3 తర్వాత మొదటిసారి సోమవారం నాడు 105.70కి చేరగా ఇప్పుడు (0037 GMT) 0.07% పెరిగి 105.49కి చేరుకుంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్కాబోయే అధ్యక్షుడు ట్రంప్ క్రిప్టోకరెన్సీకి అత్యధిక ప్రాధన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ మంగళవారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 89,637 డాలర్లు (రూ. 7.44 లక్షలు)కి చేరుకుంది. తాను గెలిచాక అమెరికాను " క్రిప్టో రాజధాని"గా మారుస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఏడాది ముగిసేలోపు బిట్‌కాయిన్ లక్ష డాలర్ల మార్కును తాకుతుందని క్యాపిటల్ డాట్ కామ్ (Capital.com) సీనియర్ ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు కైల్ రోడ్డా అంటున్నారు. -
బుల్ రన్ : రెండో రోజూ రికార్డులే
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోరోజు కూడా రికార్డుల మోత మోగించాయి. ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పంద సమీక్షలో భాగంగా మెక్సికోతో సరికొత్త ఒప్పందాన్ని అమెరికా కుదుర్చుకోవడం దేశీయంగా కూడా ఇన్వెస్టర్లలో నమ్మకాన్నిచ్చింది. దీంతో సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలోనే డబుల్ సెంచరీ లాభాలను సాధించింది. 204 పాయింట్లు ఎగిసి 38,898వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పుంజుకుని 11,757ను తాకింది. దీంతో మరోసారి కీలక సూచీలు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 140పాయింట్లు పుంజుకుని 38,834వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 11,734 వద్ద కొనసాగుతున్నాయి దాదాపు అన్నిరంగాలూ లాభపడ్డాయి. మెటల్, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంక్ నిఫ్టీలాభాల మెరుపులు మెరిపిస్తున్నాయి. ఆర్ఐఎల్, ఎన్టీపీసీ గెయిల్, సిప్లా, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, వేదాంతా, టాటా మోటార్స్ టాప్విన్నర్స్గా ఉన్నాయి. బ్లూచిప్స్‌లో టైటన్, యస్‌బ్యాంక్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో స్వల్పంగా నష్టపోతున్నాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
దలాల్ స్ట్రీట్ రికార్డుల హోరు, నిఫ్టీ 11700 టచ్
సాక్షి, ముంబై: ప్రపంచ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయంగానూ ర్యాలీ సాగింది. ఆరంభంనుంచీ భారీ లాభాలతో కొనసాగిన కీలక సూచీలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తొలినుంచీ నెలకొన్న కొనుగోళ్లజోరు సెన్సెక్స్ 442 పాయింట్ల జంప్ చేసి 38,694 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు ఎగిసి 11691 వద్ద స్థిరపడింది. అంతేకాదు తొలిసారి 11700స్థాయిని కూడా టచ్ చేసింది. స్వల్పంగా వెనక్కి తగ్గినా గరిష్టం వద్ద ముగియడం విశేషం. మొత్తంగా దలాల్ స్ట్రీట్ ఆల్ టైం గరిష్టాలతో హోరెత్తింది. ముఖ్యంగా మెటల్, ప్రభుత్వ, ప్రయివేట్ సెక్టార్ బ్యాంక్‌ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. వీటికితోడు ఎఫ్ఎంసీజీ,ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు బాగా లాభపడ్డాయి. మీడియా మాత్రం స్వల్పంగా నష్టపోయింది. పవర్‌గ్రిడ్, యస్‌బ్యాంక్, హిందాల్కో, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్, ఎయిర్టెల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాభపడగా, ఇన్ఫ్రాటెల్, జీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఐషర్నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. -
సరికొత్త గరిష్టాలకు కీలక సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరు అప్రతిహతంగా కొనసాగుతోంది. కీలక సూచీలు మరోసారి ఆల్-టైమ్ గరిష్టాలను నమోదు చేసి దూసుకుపోతున్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీని సాధించింది. అనంతరం మరింత జోరందుకున్నాయి ట్రిపుల్ సెంచరీకిపైగా లాభాలతో ప్రస్తుతం సెన్సెక్స్ 339 పాయింట్లు జంప్‌చేసి 38,591కు చేరగా, నిఫ్టీ 97 పాయింట్లు ఎగసి 11,653 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభపడుతుండగా .. మెటల్, బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్టీ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, యస్‌బ్యాంక్, టాటా స్టీల్, గ్రాసిమ్, ఐవోసీ, ఎస్బీఐ, హెచ్‌పీసీఎల్, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా లాభాలతో కొనసాగుతున్నాయి. మరోపక్క ఎల్ఐసీ హౌసింగ్, జేపీ, డీష్ టీవీ, జెట్ ఎయిర్వేస్, స్టార్, అపోలో హాస్పిటల్స్, ఆర్‌కామ్, ఐడీఎఫ్సీ, ఆర్‌పవర్ నష్టపోతున్నాయి. -
లాభాల్ ఓపెనింగ్: నిఫ్టీ కొత్త రికార్డు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలను దాటేసింది. నిఫ్టీ 11500 పాయింట్లు అధిగమించి కొత్త ఆల్ టైం హైని టచ్ చేసింది. దాదాపు అన్ని సెక్టార్లు షేర్లలో కొనుగోళ్ళు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్, ఫార్మ, మెటల్ బాగా లాభపడుతోంది. ఎస్ బ్యాంకు, ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు ధనలక్ష్మి బ్యాంకు తదితరాలు లాభపడుతున్నాయి. ఇంకా ఎల్ అండ్‌టీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, టాటా స్టీల్ దివీస్ లాబ్స్, లాభపడుతోంది. ఇన్ఫోసిస్, టైటన్, టెక్ మహీంద్రా, ఎయిర్టెల్ నష్టపోతున్నాయి. -
సరికొత్త గరిష్టాలకు స్టాక్‌మార్కెట్లు: టెలికాం షేర్ల పతనం
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు సరికొత్త రికార్డ్ స్థాయిలవద్ద జోరుగా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మరోసారి రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. కొత్త ఏడాదిలో హవా చాటుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడును కొనసాగిస్తున్నాయి. ఈ బాటలో తాజాగా సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 34,300ను, నిఫ్టీ 10,600ను అధిగమించాయి. రియల్టీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ లాభాలు మార్కెట్‌కు ఉత్సాహాన్నిస్తున్నాయి. సెన్సెక్స్ 163, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో కీలక సూచీలు పాజిటివ్‌గా మొదలయ్యాయి. ముఖ్యంగా తొలిసారి నిఫ్టీ 10600స్థాయిని అధిగమించడం విశేషం. టెలికాం సెక్టార్ తప్ప, దాదాపు అన్నిసెక్టార్లలోనూ కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. టాటా స్టీల్, ఆర్ఐఎల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ , ఎల్ అండ్ టీ లాభాపడుతున్నాయి. వీటితోపాటు చిన్న ప్రయివేటు బ్యాంకు షేర్లు లాభపడుతున్నాయి. ఐడియా, భారతి ఎయిర్టెల్, ఆర్‌కాం,ఏషియన్ పెయింట్స్, వేదాంతా, హెచ్‌సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్ నష్టపోతున్నాయి. -
సరికొత్త గరిష్టాలకు మార్కెట్లు: ఆటో, మెటల్ జోరు
ముంబై: ఇటీవల ఆల్ టైం హై స్తాయిలను నమోదు చేసిన దేశీయ స్టాక్‌మార్కెట్ల పరుగు మరింత వేగం అందుకుంది. ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలోమార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నా క్రమంగా పుంజుకుని సరికొత్త గరిష్టాలను తాకాయి. రేసు గుర్రాల్లా దౌడుతీస్తున్న ప్రధాన ఇండెక్సులు నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కొత్త గరిష్టాలకు చేరడం విశేషం. ప్రస్తుతం లాభాల సెంచరీ కొట్టిన సెన్సెక్స్112 పాయింట్లుఎగిసి 30, 862 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 9534 వద్ద కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు లాభాలు బుల్ మార్కెట్ మద్దతు నిస్తున్నాయి. అయితే ఫార్మా, ఐటీ రంగాలు నష్టపోతున్నాయి. మారుతి సుజుకి, టీవీఎస్ మోటార్ భారీగా లాభపడుతున్నాయి. ఆటో దిగ్గజం మారుతి సుజుకి ఆల్ టైం హైని తాకి భారీ లాభాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం 7052 వద్ద ఉంది. ఏషియన్ పెయింట్స్ , డా. రెడ్డీస్, అరబిందో, టాటా స్టీల్, లాభాల్లో ఉన్నాయి. సిప్లా, బీపీసీఎల్, ఐఓసీ టెక్ మహీంద్రచ భారతి ఎయిర్ టెల్ నష్టాల్లోఉన్నాయి. అటు డాలర్ మారకంలో రుపీ 0.13 పైసలు లాభపడి రూ. 64.61 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌మార్కెట్ లో బంగారం పది గ్రా. రూ.65లు నష్టంతో రూ. 28,648 వద్ద ఉంది