![Markets At Record Highs: Sensex Climbs 339 Points - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/27/market.jpg.webp?itok=lObQ9p3x)
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరు అప్రతిహతంగా కొనసాగుతోంది. కీలక సూచీలు మరోసారి ఆల్-టైమ్ గరిష్టాలను నమోదు చేసి దూసుకుపోతున్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీని సాధించింది. అనంతరం మరింత జోరందుకున్నాయి ట్రిపుల్ సెంచరీకిపైగా లాభాలతో ప్రస్తుతం సెన్సెక్స్ 339 పాయింట్లు జంప్‌చేసి 38,591కు చేరగా, నిఫ్టీ 97 పాయింట్లు ఎగసి 11,653 వద్ద ట్రేడవుతోంది.
దాదాపు అన్ని రంగాలూ లాభపడుతుండగా .. మెటల్, బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, యస్‌బ్యాంక్, టాటా స్టీల్, గ్రాసిమ్, ఐవోసీ, ఎస్‌బీఐ, హెచ్‌పీసీఎల్, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా లాభాలతో కొనసాగుతున్నాయి. మరోపక్క ఎల్‌ఐసీ హౌసింగ్, జేపీ, డీష్ టీవీ, జెట్ ఎయిర్‌వేస్, స్టార్, అపోలో హాస్పిటల్స్, ఆర్‌కామ్, ఐడీఎఫ్‌సీ, ఆర్‌పవర్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment