![Sensex Raises Over 440 Points, Nifty Hits 11,700 First time - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/27/sensex_0.jpg.webp?itok=sG92YSE3)
సాక్షి, ముంబై: ప్రపంచ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయంగానూ ర్యాలీ సాగింది. ఆరంభంనుంచీ భారీ లాభాలతో కొనసాగిన కీలక సూచీలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తొలినుంచీ నెలకొన్న కొనుగోళ్లజోరు సెన్సెక్స్ 442 పాయింట్ల జంప్ చేసి 38,694 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు ఎగిసి 11691 వద్ద స్థిరపడింది. అంతేకాదు తొలిసారి 11700స్థాయిని కూడా టచ్ చేసింది. స్వల్పంగా వెనక్కి తగ్గినా గరిష్టం వద్ద ముగియడం విశేషం. మొత్తంగా దలాల్ స్ట్రీట్ ఆల్ టైం గరిష్టాలతో హోరెత్తింది.
ముఖ్యంగా మెటల్, ప్రభుత్వ, ప్రయివేట్ సెక్టార్ బ్యాంక్‌ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. వీటికితోడు ఎఫ్‌ఎంసీజీ,ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు బాగా లాభపడ్డాయి. మీడియా మాత్రం స్వల్పంగా నష్టపోయింది. పవర్‌గ్రిడ్, యస్‌బ్యాంక్, హిందాల్కో, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఇన్‌ఫోసిస్, టెక్ మహీంద్రా లాభపడగా, ఇన్‌ఫ్రాటెల్, జీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఐషర్నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment