
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలను దాటేసింది. నిఫ్టీ 11500 పాయింట్లు అధిగమించి కొత్త ఆల్ టైం హైని టచ్ చేసింది. దాదాపు అన్ని సెక్టార్లు షేర్లలో కొనుగోళ్ళు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్, ఫార్మ, మెటల్ బాగా లాభపడుతోంది. ఎస్ బ్యాంకు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు ధనలక్ష్మి బ్యాంకు తదితరాలు లాభపడుతున్నాయి. ఇంకా ఎల్ అండ్‌టీ, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, టాటా స్టీల్ దివీస్ లాబ్స్, లాభపడుతోంది. ఇన్ఫోసిస్, టైటన్, టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment