సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు సరికొత్త రికార్డ్ స్థాయిలవద్ద జోరుగా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మరోసారి రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. కొత్త ఏడాదిలో హవా చాటుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడును కొనసాగిస్తున్నాయి. ఈ బాటలో తాజాగా సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 34,300ను, నిఫ్టీ 10,600ను అధిగమించాయి. రియల్టీ, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ లాభాలు మార్కెట్‌కు ఉత్సాహాన్నిస్తున్నాయి. సెన్సెక్స్ 163, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో కీలక సూచీలు పాజిటివ్‌గా మొదలయ్యాయి. ముఖ్యంగా తొలిసారి నిఫ్టీ 10600స్థాయిని అధిగమించడం విశేషం. టెలికాం సెక్టార్ తప్ప, దాదాపు అన్నిసెక్టార్లలోనూ కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది.
టాటా స్టీల్, ఆర్‌ఐఎల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ , ఎల్ అండ్ టీ లాభాపడుతున్నాయి. వీటితోపాటు చిన్న ప్రయివేటు బ్యాంకు షేర్లు లాభపడుతున్నాయి. ఐడియా, భారతి ఎయిర్‌టెల్, ఆర్‌కాం,ఏషియన్ పెయింట్స్, వేదాంతా, హెచ్‌సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment