సరికొత్త గరిష్టాలకు మార్కెట్లు: ఆటో, మెటల్ జోరు
ముంబై: ఇటీవల ఆల్ టైం హై స్తాయిలను నమోదు చేసిన దేశీయ స్టాక్‌మార్కెట్ల పరుగు మరింత వేగం అందుకుంది. ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలోమార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నా క్రమంగా పుంజుకుని సరికొత్త గరిష్టాలను తాకాయి. రేసు గుర్రాల్లా దౌడుతీస్తున్న ప్రధాన ఇండెక్సులు నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కొత్త గరిష్టాలకు చేరడం విశేషం. ప్రస్తుతం లాభాల సెంచరీ కొట్టిన సెన్సెక్స్112 పాయింట్లుఎగిసి 30, 862 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 9534 వద్ద కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు లాభాలు బుల్ మార్కెట్ మద్దతు నిస్తున్నాయి. అయితే ఫార్మా, ఐటీ రంగాలు నష్టపోతున్నాయి. మారుతి సుజుకి, టీవీఎస్ మోటార్ భారీగా లాభపడుతున్నాయి. ఆటో దిగ్గజం మారుతి సుజుకి ఆల్ టైం హైని తాకి భారీ లాభాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం 7052 వద్ద ఉంది. ఏషియన్ పెయింట్స్ , డా. రెడ్డీస్, అరబిందో, టాటా స్టీల్, లాభాల్లో ఉన్నాయి. సిప్లా, బీపీసీఎల్, ఐఓసీ టెక్ మహీంద్రచ భారతి ఎయిర్ టెల్ నష్టాల్లోఉన్నాయి.
అటు డాలర్ మారకంలో రుపీ 0.13 పైసలు లాభపడి రూ. 64.61 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌మార్కెట్ లో బంగారం పది గ్రా. రూ.65లు నష్టంతో రూ. 28,648 వద్ద ఉంది