
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బిట్‌కాయిన్. ప్రస్తుతం ఉన్న అన్నీ క్రిప్టోకరెన్సీల్లో కంటే బిట్‌కాయిన్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఈ బిట్‌కాయిన్ ధర గత కొద్ది రోజుల నుంచి భారీగా పడిపోతుంది. నవంబర్ 8న 67,582.60 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ ధర నేడు సుమారు 4% కంటే ఎక్కువ 60,718.80 డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో రూ. 3 వేల డాలర్లు పైగా నష్టపోయింది.
అలాగే, మార్కెట్ విలువ పరంగా రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ 6.18% క్షీణించి $4,291.60 వద్ద ఉంది. అయితే, ఈ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర పడిపోవడానికి సరైన కారణాలు కనిపించడం లేదని, చాలా రోజులు నుంచి క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర గరిష్టానికి చేరుకోవడంతో పెట్టుబడుదారులు లాభాలను వెనక్కి తీసుకోవడంతో క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర పడిపోయినట్లు నిపుణులు సూచిస్తున్నారు. బిట్‌కాయిన్ విలువ జూన్ కంటే రెట్టింపు స్థాయిలో పెరిగింది.
(చదవండి: Akasa Air: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..)
Comments
Please login to add a commentAdd a comment