ఎంఐ ఫాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్: బంపర్‌ ఆఫర్‌ | Good news for Mi fans Xiaomi giving back Rs 500 Cr | Sakshi
Sakshi News home page

ఎంఐ ఫాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్: రూ. 500 కోట్లు వెనక్కి

Published Wed, Oct 9 2019 12:24 PM | Last Updated on Thu, Oct 10 2019 7:50 AM

Good news for Mi fans Xiaomi giving back Rs 500 Cr - Sakshi

సాక్షి, ముంబై : భారతదేశంలో నంబర్‌వన్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా ఎదిగిన షావోమి తన దూకుడును కొనసాగిస్తోంది. బిగ్‌ స్ర్కీన్‌, బిగ్‌బ్యాటరీ, ఏఐ కెమెరాలు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్న షావోమి తాజాగా ఎంఐ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ అందించింది. బుధవారం రెడ్‌మి 8 లాంచింగ్‌ సందర్బంగా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు షావోమి ఎండీ మను కుమార్‌ జైన్‌. అలాగే 64ఎంపీ  క్వాడ్‌ కెమెరా(4) లతో మరో  (రెడ్‌మి నోట్‌ 8 ప్రొ ) స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయబోతున్నట్టు చెప్పారు. ఈ నెల 16నే దీన్ని ఆవిష్కరించనున్నామని తెలిపారు. 

రూ. 5కోట్ల రిటర్న్‌ గిఫ్ట్‌ ఆఫర్‌
గత ఐదేళ్లుగా కాలంగా కస్టమర్లు తమపై చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా రూ. 500 కోట్లను తిరిగి వారికి ఇచ్చేస్తున్నట్టు షావోమి ఎండీ మనుకుమార్‌ జైన్‌ ప్రకటించారు. తొలి  50 లక్షల వినియోగదారులకు 4జీబీ వేరియంట్‌ అప్‌డేట్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. 50 లక్షల  రెడ్‌మి8 కొనుగోలుదారులకు రూ. 1000 విలువ (రూ. 5 కోట్లు) గల అప్‌డేట్‌ను ఉచితంగా అందిస్తుందన్నమాట.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగ సీజన్‌లో కేవలం 7రోజుల్లో 5.3 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు నమోదయ్యాయని ప్రకటించారు. అలాగే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ దీపావళి సేల్‌లో నిమిషానికి 525 డివైస్‌లు అమ్మినట్టు తెలిపారు. షావోమిపై వినియోగదారుల అసాధారణ ప్రేమ ఎప్పటికే ఇలాగే కొనసాగాలని మనుకుమార్‌ ఆశించారు. ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  

 రెడ్‌మి నోట్ 8 ప్రో  ఫీచర్లు 

6.53 అంగుళాల డిస్‌ప్లే, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ 120-డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్,  2ఎంపీ మాక్రో కెమెరాతో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.  అలాగే 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 18వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్, క్విక్ ఛార్జ్ 3.0 లకు మద్దతుగా 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్‌ఎఫ్‌సి సపోర్ట్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్,ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9 ప్రధాన ఫీచర్లు. ధర రూ. సుమారు 14,000. దీన్నిఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement